మన బప్పీ లాహిరీ బంగారు కొండే! | BJP's Bappi Lahiri owns 754 gms of gold | Sakshi
Sakshi News home page

మన బప్పీ లాహిరీ బంగారు కొండే!

Published Sat, Apr 12 2014 11:07 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

మన బప్పీ లాహిరీ బంగారు కొండే! - Sakshi

మన బప్పీ లాహిరీ బంగారు కొండే!

సంగీత దర్శకుడు బప్పీ లాహిరి అనగానే గున గున నడిచే ఓ బంగారు కొండ గుర్తుకొస్తుంది. జిగేల్ జిగేల్ చెయిన్లూ, ధగధగ నగలూ బప్పీ లాహిరీ ట్రేడ్ మార్క్. ఈ సారి ఆయన బెంగాల్ లోని సెరాంపూర్ నుంచి బిజెపి తరఫున లోకసభకి పోటీ చేస్తున్నారు. అసలీ బంగారు బాబు దగ్గర బంగారం ఎంతుంది అన్నదే ఇప్పుడందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న.


రిటర్నింగ్ ఆఫీసర్ కు బప్పీ లాహిరీ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన దగ్గర 754 గ్రాముల బంగారం, ఆయన భార్య చిత్రాణి దగ్గర 967 గ్రాముల బంగారం ఉంది. దాని మొత్తం విలువ దాదాపు 38 లక్షలు. ఇవే కాక దాదాపు భార్యాభర్తలిద్దరికీ కలిపి 13.5 కిలోల వెండి ఉంది. ఆయన స్థిరచరాస్తులు దాదాపు 12 లక్షలున్నాయి. ఆయన దగ్గర బీఎం డబ్ల్యు, ఆడిలతో సహా అయిదు కార్లున్నాయి.


మొత్తానికి నడిచొచ్చే నగల దుకాణం లాంటి ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎన్నికల ప్రచారం పేరిట జనంలోకి వెళ్తే ఈ బంగారం క్షేమంగా ఉంటుందా? లేక బప్పీదా ఎన్నికల వేళ గిల్లు ధగధగలతో తిరుగుతారా? ఏమో వేచి చూడాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement