కలకలం; బీజేపీ నాయకుడి కూతురు కిడ్నాప్‌! | West Bengal BJP Leader Daughter Allegedly Kidnapped | Sakshi

బీజేపీ నాయకుడి కూతురు కిడ్నాప్‌!

Feb 15 2019 3:51 PM | Updated on Mar 29 2019 9:07 PM

West Bengal BJP Leader Daughter Allegedly Kidnapped - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఐదు నెలల క్రితమే సుప్రభాత్‌ అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరారు.

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ నాయకుడి కూతురు కిడ్నాప్‌ అవడం కలకలం రేపుతోంది. ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని దుండగులు ఆమెను అపహరించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వివరాలు.... లబ్ధ్‌పూర్‌కు చెందిన సుప్రభాత్‌ బత్యబయాల్‌ గురువారం రాత్రి ఓ సమావేశం నిమిత్తం బయటికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన కూతురితో పాటు సుప్రభాత్‌ సోదరుడు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఈ క్రమంలో ఇంట్లోకి వచ్చిన ఐదుగురు ఆగంతకులు సుప్రభాత్‌ కూతురిని కిడ్నాప్‌ చేశారు.

ఈ విషయం గురించి సుప్రభాత్‌ సోదరుడు మాట్లాడుతూ... ‘ ఐదుగురు వ్యక్తులు వచ్చారు. మొదట మమ్మల్ని ఇంట్లో బంధించి తాళం వేశారు. ఆ తర్వాత కాసేపటికి ఇంట్లో చొరబడి తుపాకీతో బెదిరించి నా సోదరుడి కూతురిని లాక్కెళ్లారు. కార్లో ఎక్కించుకుని పరారయ్యారు’ అని పేర్కొన్నారు. కాగా ఐదు నెలల క్రితమే సుప్రభాత్‌ అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన కూతురు కిడ్నాప్‌ అవడంతో లబ్ధ్‌పూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన స్థానికులు పోలీసు స్టేషను ఎదుట నిరసనకు దిగారు.

ఇక ఈ విషయంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేదని భావిస్తున్నట్లు బీర్‌భూమ్‌ జిల్లా ఎస్పీ శ్యామ్‌ సింగ్‌ తెలిపారు. అలా అని ఈ విషయాన్ని పూర్తిగా కొట్టి పారేయలేమని పేర్కొన్నారు. త్వరలోనే బాధితురాలి ఆచూకీ కనుగొంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి కుదుటపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement