
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికలను కేంద్ర బలగాల పర్యవేక్షణలో నిర్వహించాలని బీజేపీ నేతలు మంగళవారం ఈసీని కోరనున్నారు. తమకు బెంగాల్ పోలీసులపై విశ్వాసం లేనందున కేంద్ర బలగాలు జోక్యం చేసుకోవాలని వారు ఈసీకి విన్నవించనున్నారు. ఈసీ అధికారులతో బీజేపీ నేతలు సాయంత్రం 5 గంటలకు భేటీ కానున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
కాగా తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఓటర్లను బెదిరిస్తున్నారని బీజేపీ ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేసింది. పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం లేదని, ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కూడా తృణమూల్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. కేంద్ర బలగాలు రెండు రోజులే ఉంటాయని, ఆ తర్వాత ప్రజలు రాష్ట్ర పోలీసులపైనే ఆధారపడాలని తృణమూల్ మంత్రి ఒకరు ఓటర్లను బెదిరించారని బీజేపీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు జై ప్రకాష్ మజుందార్ ఆరోపించారు. బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 11న ప్రారంభమై మే 19తో ఏడు దశల పోలింగ్‌తో ముగుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment