'సింహాసనం' కోసం 'డిస్కో డాన్సర్' గా మారిన 'గ్యాంగ్ లీడర్' | Bappi enthrals voters with his music | Sakshi
Sakshi News home page

'సింహాసనం' కోసం 'డిస్కో డాన్సర్' గా మారిన 'గ్యాంగ్ లీడర్'

Published Tue, Apr 1 2014 11:04 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

'సింహాసనం' కోసం 'డిస్కో డాన్సర్' గా మారిన 'గ్యాంగ్ లీడర్' - Sakshi

'సింహాసనం' కోసం 'డిస్కో డాన్సర్' గా మారిన 'గ్యాంగ్ లీడర్'

ఎక్కడైనా ఎన్నికల సభలో 'ఐయామ్ ఎ డిస్కో డాన్సర్' 'ఊ లలా ఊ లలా' అంటూ కిక్కెక్కించే పాటలు వినిపించాయనుకొండి. దూరం నుంచే ఒకాయన మెడలో బంగారం హారాలు తళుక్కుమంటున్నాయనుకొండి. సందేహం లేదు. అది మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లాహిరీయే!


బిజెపి అభ్యర్థిగా శ్రీరామ్ పూర్ నుంచి లోకసభ ఎన్నికల బరిలో ఉన్న బప్పీదా 'నా పాట పంచామృతం' అంటూ ఎన్నికల సభలను సంగీత సభలుగా మార్చేస్తున్నారు. అంతే కాదు ... నా మ్యూజిక్ కి, నరేంద్ర మోడీ మ్యాజిక్ కలిస్తే ఇక గెలుపు నాదే అంటున్నారు. మరీ మూడొస్తే నాలుగైదు స్టెప్పులు కూడా వేస్తున్నారు.


బప్పీదా భలే డిప్లోమాటిక్. ఆయనప్రత్యర్థులను అస్సలు విమర్శించడం లేదు. నా పాటతో కమలం విచ్చుకునేలాచేస్తానని మాత్రమే చెబుతున్నాడు.


అన్నట్టు బప్పీ లాహిరీ తెలుగులోనూ సింహాసనం, గ్యాంగ్ లీడర్ వంటి సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఇప్పుడీ గ్యాంగ్ లీడర్ సింహాసనం కోసం డిస్కో డాన్సర్ గా మారిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement