
నారా వారూ ఈ కారెవరిది?
భువనేశ్వరికి ఒకే కారుందని బాబు తప్పుడు అఫిడవిట్
రవాణా శాఖ రికార్డుల్లో ఆమె పేరిట రెండు కార్లు
హైదరాబాద్: తన కార్ల విషయుంలో చంద్రబాబునాయుుడు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి బయుటపడింది. నామినేషన్ సందర్భంగా సవుర్పించిన అఫిడవిట్‌లో తన పేరుపై ఒక కారు, భార్య భువనేశ్వరి పేరుపై మరో కారు ఉందని పేర్కొన్నారు. నిజానికి భువనేశ్వరి పేరుపై రెండు కార్లు ఉన్నట్లు రాష్ట్ర రవాణా శాఖ రికార్డుల్లో నమోదై ఉంది. కుప్పం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నామినేషన్ పత్రాలు, ఆస్తుల వివరాలతో కూడిన అఫిడవిట్లను.. ఆయున తరఫున అతని కుమారుడు నారా లోకేష్ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వేణుగోపాల్‌రెడ్డికి ఏప్రిల్ 14న అందజేశారు.
అఫిడవిట్‌లో చంద్రబాబు పేరుపై రూ.2,22,500 విలువైన అంబాసిడర్ కారు (ఏపీ 09 జీ 0393), తన భార్య భువనేశ్వరి పేరుపై రూ.91,92,946 విలువైన కారు (ఏపీ 09 బీవీ 0393) ఉందని పేర్కొన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా భువనేశ్వరి పేరుపై రూ.12 లక్షల విలువైన హ్యుండాయ్ టైన్ కారు (ఏపీ 09 ఏవీ 0393) కూడా రిజిస్టర్ అయినట్లు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ రికార్డుల్లో స్పష్టంగా ఉంది. ఎన్నికల సంఘం బాబుగారి విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.