సాక్షి, హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై తెలంగాణలో హైకోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. అయితే, అఫిడవిట్ దాఖలు చేయకుండా.. మెమో దాఖలు చేసిన కేంద్ర హోంశాఖ కేంద్ర హోమ్ శాఖ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంబసీ నుంచి వివరాలు రాబట్టలేకపోతే ఎందుకు మీ హోదాలు? అని హైకోర్టు ప్రశ్నించింది. పాత మెమోనే సమర్పించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు జర్మనీ ఎంబీసీ నుంచి పూర్తి సమాచారంతో అఫిడవిట్ వేయాలని హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment