సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తన పౌరస త్వాన్ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ వేములవా డ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ దాఖలు చేసిన పిటిషన్‌లో హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. రమేశ్ 2009లో భారత పౌరసత్వం పొందారు. ఆపై వరుసగా 4సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ఆయన ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ వేము లవాడలో ఆయనపై పోటీ చేసిన ఆది శ్రీనివాస్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఏడాదిన్నర క్రితం కేంద్ర హోంశా ఖ చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీన్ని సవాల్ చేస్తూ రమేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వై.రామా రావు వాదనలు వినిపించారు. ప్రయాణానికి పాత పాస్‌పోర్టు ఉపయోగించినంత మాత్రాన రమేశ్ తమ దేశ పౌరుడు అనలేమని లిఖితపూ ర్వంగా జర్మనీ రాయబార కార్యాలయం చెప్పిందని నివేదించారు.
రాజకీయ ప్రత్యర్థి వరుసగా ఎన్నికల్లో ఓడిపోవడంతోనే ఈ కేసు వేశారని చెప్పారు. రమేశ్.. ముమ్మాటికి భారతీయుడే అని, పౌరసత్వ చట్టం సెక్షన్ 10(3) ధ్రువీకరి స్తోందన్నారు. సెక్షన్ 10(2) ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి పౌరసత్వం రద్దు చేసే అధికారాలు న్నాయని.. అయితే రమేశ్‌కు అందులోని ఏ అంశాలు వర్తించవని వెల్లడించారు.
విదేశీ పౌరసత్వాన్ని వదులుకోలేదు...
కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ టి.సూర్యకరణ్‌రెడ్డి వాదిస్తూ, భారత పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 10, 7బీ ప్రకారం రమేశ్ భార త సంతతికి చెందిన విదేశీ పౌరుడని చెప్పారు. జర్మనీ పౌరసత్వం ఉన్నందున ఆయన విదేశీ పౌరుడేనని అన్నారు. 2009 నుంచి ఈ వివాదం కొనసాగుతున్నప్పటికీ ఇప్పటివరకు రమేశ్ విదేశీ పౌరసత్వాన్ని వదులుకోలేదని, జర్మనీ పౌరసత్వాన్ని పునరుద్ధరించుకుంటూ వస్తున్నా రని తెలిపారు. ఇది అసాధారణ వ్యాజ్యంగా పరిగణించాలని కోరారు.
సెక్షన్ 10(3) ప్రకారం పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. చట్టసభ సభ్యుడిగా ఉన్న చెన్నమనేని ద్వంద్వ పౌరసత్వ విషయంలో చట్టనిబంధనలను కచ్చితంగా అమలు చేయా ల్సి వుంటుందని ఆది శ్రీనివాస్ తరఫు సీనియర్ న్యాయవాది రవికిరణ్‌రావు వాదించారు. దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే చర్యలకు పాల్పడి తేనే పౌరసత్వంపై చర్యలు తీసుకోవాలని రమేశ్ చెప్పడంలో ఔచిత్యం లేదన్నారు. చివరకు న్యాయమూర్తి.. తీర్పును వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment