Citizenship case
-
రాహుల్ పౌరసత్వ కేసు విచారణ: పిటిషనర్ న్యాయవాదిపై హైకోర్టు ఆగ్రహం
లక్నో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పౌరసత్వంపై దాఖలైన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కోర్టులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పిటిషనర్ తరపు న్యాయవాది ఎంత సేపటికి వాదనలు ముగించకపోవడంతో ధర్మాసనం అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.వివరాలు.. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి ఎంపీగాఎన్నికైన రాహుల్ గాంధీ భారతీయ పౌరుడు కాదని, ఆయన బ్రిటిష్ పౌరుడని పేర్కొంటూ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు కర్ణాటక బీజేపీ కార్యకర్త ఎస్. విఘ్నేష్ శిశిర్ తన న్యాయవాది అశోక్ పాండే ద్వారా ఈ పిల్ దాఖలు చేశారు.దీనిపై స్టిస్ రాజన్ రాయ్ మరియు జస్టిస్ ఓం ప్రకాష్ శుక్లాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా దాదాపు 90 నిమిషాల పాటుఅశోక్ పాండే వాదనలు వినిపించారు. అయితే ఆయన వాదనలు విన్న తర్వాత ఈ కేసులో ఉత్తర్వులను రిజర్వ్ చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.అయినప్పటికీ న్యాయవాది పాండే తనకు వాదించేందుకు మరింత సమయం కావాలని పట్టుబట్టారు. దీనిపై ధర్మాసనం స్పందింస్తూ.. తనకు, తన పిటిషనర్‌కు వాదనలు వినిపించేందుకు సరైనసమయం ఇచ్చిందని, తమ వాదనలన్నీ పరిగణనలోకి తీసుకున్నామని చెప్పడంతో న్యాయవాది పాండే అసహనానికి గురయ్యారు.తనకు వాదించడానికి మరింత సమయం కావాలని పట్టుబట్టారు. 20 రోజులపాటు వాదనలు జరుగుతాయని, కానీ ధర్మాసనం గంట కూడా తన మాటలు వినడం లేదని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, వాదనలు తగినంతగా ఉంటే ఆ విషయాలపై విచారణలు 20 రోజుల పాటు కొనసాగించవచ్చని పేర్కొంది. న్యాయవాది పాండే చేస్తున్న వాదనలను ఇప్పటికే కోర్టు విని పరిశీలించిందని ధర్మాసనం మరోసారి నొక్కి చెప్పింది.అయినప్పటికీ పాండే వినకుండా.. బెంచ్ వ్యక్తిగతంగా వ్యవహరించకూడాదని అన్నారు. దీంతో ధర్మసానం ఆగ్రహంవ్యక్తం చేసింది. మీరు మా సహనాన్ని పరిక్షిస్తున్నారు. కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారు. మీకు వాదించడానికి తగినంత సమయం ఇచ్చాము. మీ ప్రవర్తన చూస్తుంటే ఇతర కేసులను వినకుండా చేయాలని చూస్తున్నట్లు ఉంది అని పేర్కొంది. చివరికి న్యాయమూర్తులు న్యాయస్థానం నుంచి బయలుదేరుతుండగా.. హైకోర్టు తుది కోర్టు కాదని వ్యాఖ్యానించారు.తన వాదనలు అనంతరం కొత్త పిటిషన్ దాఖలు చేసేందుకు తాజా పిల్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని బెంచ్‌ను అభ్యర్థించారు పాండే. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఒకవేళ పిల్‌ను పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే, కోర్టు సమయాన్ని 90 నిమిషాల వృధా చేసినందుకు బెంచ్ అతనిపై పెనల్టీ విధిస్తుందని మందలించింది. -
చెన్నమనేని పౌరసత్వంపై తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తన పౌరస త్వాన్ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ వేములవా డ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ దాఖలు చేసిన పిటిషన్లో హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. రమేశ్ 2009లో భారత పౌరసత్వం పొందారు. ఆపై వరుసగా 4సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ఆయన ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ వేము లవాడలో ఆయనపై పోటీ చేసిన ఆది శ్రీనివాస్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఏడాదిన్నర క్రితం కేంద్ర హోంశా ఖ చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీన్ని సవాల్ చేస్తూ రమేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వై.రామా రావు వాదనలు వినిపించారు. ప్రయాణానికి పాత పాస్‌పోర్టు ఉపయోగించినంత మాత్రాన రమేశ్ తమ దేశ పౌరుడు అనలేమని లిఖితపూ ర్వంగా జర్మనీ రాయబార కార్యాలయం చెప్పిందని నివేదించారు. రాజకీయ ప్రత్యర్థి వరుసగా ఎన్నికల్లో ఓడిపోవడంతోనే ఈ కేసు వేశారని చెప్పారు. రమేశ్.. ముమ్మాటికి భారతీయుడే అని, పౌరసత్వ చట్టం సెక్షన్ 10(3) ధ్రువీకరి స్తోందన్నారు. సెక్షన్ 10(2) ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి పౌరసత్వం రద్దు చేసే అధికారాలు న్నాయని.. అయితే రమేశ్‌కు అందులోని ఏ అంశాలు వర్తించవని వెల్లడించారు. విదేశీ పౌరసత్వాన్ని వదులుకోలేదు... కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ టి.సూర్యకరణ్‌రెడ్డి వాదిస్తూ, భారత పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 10, 7బీ ప్రకారం రమేశ్ భార త సంతతికి చెందిన విదేశీ పౌరుడని చెప్పారు. జర్మనీ పౌరసత్వం ఉన్నందున ఆయన విదేశీ పౌరుడేనని అన్నారు. 2009 నుంచి ఈ వివాదం కొనసాగుతున్నప్పటికీ ఇప్పటివరకు రమేశ్ విదేశీ పౌరసత్వాన్ని వదులుకోలేదని, జర్మనీ పౌరసత్వాన్ని పునరుద్ధరించుకుంటూ వస్తున్నా రని తెలిపారు. ఇది అసాధారణ వ్యాజ్యంగా పరిగణించాలని కోరారు. సెక్షన్ 10(3) ప్రకారం పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. చట్టసభ సభ్యుడిగా ఉన్న చెన్నమనేని ద్వంద్వ పౌరసత్వ విషయంలో చట్టనిబంధనలను కచ్చితంగా అమలు చేయా ల్సి వుంటుందని ఆది శ్రీనివాస్ తరఫు సీనియర్ న్యాయవాది రవికిరణ్‌రావు వాదించారు. దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే చర్యలకు పాల్పడి తేనే పౌరసత్వంపై చర్యలు తీసుకోవాలని రమేశ్ చెప్పడంలో ఔచిత్యం లేదన్నారు. చివరకు న్యాయమూర్తి.. తీర్పును వాయిదా వేశారు. -
కోర్టుకు హాజరు కావాలంటూ.. చనిపోయిన వ్యక్తికి నోటీసులు!!
సాక్షి అస్సాం(సిల్చార్): కొన్ని సంఘటనలను చూస్తే మన వ్యవస్థలోని లోపాలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. సామాన్యుడిని ఇష్టానుసారమో లేదంటే నిర్లక్ష్యపూరిత వైఖరితోనో కేసులు పెట్టి.. ఇబ్బంది పెట్టడమే కాకుండా అధికారులు సైతం చిక్కుల్లో పడుతుంటారు. అచ్చం అలాంటి ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. ఆ వ్యక్తి చనిపోయి ఆరేళ్లైంది. ఇప్పుడు అతను తన భారతీయ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని నోటీసులు పంపారు. వివరాల్లోకెళ్తే.... అస్సాంలోని సిల్చార్ గ్రామానికి వచ్చి నివాసం ఉన్న శ్యామ్ చరణ్ దాస్ పై అక్రమ వలసదారునిగా కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. అయితే ఆ వ్యక్తి మే 6, 2016న 74 ఏళ్ల వయసులో చనిపోయాడు. అతని మరణం తర్వాత కుటుంబ సభ్యులు అస్సాం ప్రభుత్వం జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించడంతో న్యాయమూర్తి ఆ కేసును కొట్టేశారు. అస్సాం కోర్టు దాస్ మరణాన్ని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 23, 2016న కేసు ముగించేసింది కూడా. పైగా న్యాయమూర్తి నాటి కోర్టు ఉత్తర్వుల్లో ఇలా రాశారు... ‘‘సుదన్ రామ్ దాస్ కుమారుడైన చరణ్ దాస్ కుటుంబ సభ్యులు మే 06, 2016న సిల్చార్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో మరణించినట్లు మరణ ధృవీకరణ పత్రాలను సమర్పించారు. తాలిగ్రామ్ ఉదర్‌బాండ్ నివాసి అయిన అనుమానాస్సద ఓటరు అయిన దాస్ రికార్డుల ప్రకారం అతని తండ్రి సుధన్ రామ్ దాస్ పేరు 1965 నుంచి 1970 ఓటర్ల జాబితాలో ఉంది కావున కేసును కొట్టివేస్తున్నాం’’ అని జడ్డీ పేర్కొన్నారు. కానీ, ఈ ఏడాది ప్రారంభంలో అక్రమ వలసదారునిగా అనుమానంతో సరిహద్దు పోలీసులు చరణ్ దాస్ పై తాజాగా కేసు నమోదు చేశారు. దీంతో కాచర్ జిల్లాలోని ఫారిన్ట్రిబ్యునల్ (ఎఫ్టీ-3) ప్రకారం అతని పై కేసు నమోదైందని మార్చి 15న నోటీసులు జారీ చేసింది. పైగా తన భారతీయ పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు మార్చి 30న హాజరుకావల్సిందిగా స్పష్టం చేసింది. విశేషం ఏంటంటే.. ఏ కోర్టు అయితే కేసును కోట్టేసిందో మళ్లీ ఆ కోర్టే నోటీసులు జారీ చేసింది. పైగా ఆ నోటీసులో చరణ్ దాస్ ప్రతిస్పందించడంలో విఫలమైనప్పుడు, ట్రిబ్యునల్ రిఫరెన్స్ ఎక్స్‌పార్టీగా నిర్ణయించి అతనిపై తగిన చర్యలు తీసుకుంటారని పేర్కొంది. అయితే దాస్ భార్య సులేఖా దాస్ కూడా ఎక్స్-పార్టీ ఆర్డర్లో తన భారతీయ గుర్తింపును కోల్పోయింది. ఏప్రిల్ 2018లో విదేశీయుల కోసం ఉద్దేశించిన డిటెన్షన్ సెంటర్లో ఉంచారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆమె ఏప్రిల్ 2020లో బెయిల్‌పై విడుదలైంది. అయితే మార్చి 16న, ఉదర్‌బాండ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారుల బృందం తాలిగ్రామ్ గ్రామంలోని సులేఖా దాస్ ఇంటికి చేరుకుని, మృతుడికి వ్యతిరేకంగా కొత్త నోటీసును కుటుంబ సభ్యులకు అందజేసింది. చరణ్ దాస్ కుమార్తె, బేబీ దాస్ మాట్లాడుతూ.. “మా తండ్రిని అర్ధ దశాబ్దం క్రితమే కోల్పోయాం. అయితే అతను జీవించి ఉన్నాడని కోర్టు అంటోంది. మా నాన్నగారి దగ్గర తన గుర్తింపును రుజువు చేసేందుకు తగిన పత్రాలు ఉన్నప్పటికీ, ఆయన బతికున్నప్పుడు మేము కోర్టు చుట్టూ తిరిగాం. ఇప్పుడు, అతని మరణం తర్వాత మేము అతని తరపున కోర్టుకు హాజరు కావాలి. ఎలా ప్రతిస్పందించాలో నాకు తెలియడం లేదు" అని అన్నారు. జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ (డీఎల్ఎస్ఏ) సామాజిక కార్యకర్త కమల్ చక్రవర్తి బేబీ దాస్‌కు తమ మద్దతును అందించారు. మార్చి 30న కోర్టు ముందు డాక్యుమెంట్లు సమర్పించడంలో వారు ఆమెకు సహాయం చేయనున్నారు. ఏదీఏమైన మన వ్యవస్థ లోపాలు తేటతెల్లమవుతున్నాయి. పోలీసుల ఫీల్డ్ వెరిఫికేషన్ ఆధారంగా చనిపోయిన వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచాలని కోరారు. అంటే డాక్యుమెంట్ల వెరిఫికేషన్ కోసం పోలీసులు నిందితుడి ఇంటికి కూడా వెళ్లలేదని అర్థమవుతోంది. (చదవండి: కన్నతల్లి నిర్వాకం... పసికందుని మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టి) -
ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదంపై హైకోర్టు విచారణ
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఇప్పటికే చెన్నమనేని జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నట్లు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయగా, కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌పై చెన్నమనేని కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. కౌంటర్ పిటిషన్లపై ఇరుపక్షాలు తమ వాదనలను హైకోర్టుకు వినిపించారు. ఎన్నికల్లో పాల్గొనడానికి పూర్తి అర్హత ఉందని చెన్నమనేని తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఇప్పటికీ చెన్నమనేని జర్మనీలో ఉన్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. భారత ప్రభుత్వానికి ఓసిఐ కార్డు కోసం అప్లయ్ చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. హోంశాఖ కూడా చెన్నమనేని జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నట్లు తెలిపిందని న్యాయవాది వివరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది. -
ఎమ్మెల్యే పౌరసత్వం కేసులో గడువు పెంపు
రాజన్న సిరిసిల్ల : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై తేల్చేందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు మరోసారి గడువు ఇచ్చింది. రమేష్ జర్మన్ దేశ పౌరుడని, ఆయన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గతంలో విచారించింది. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్రానికి అప్పట్లో మూడు నెలల గడువు ఇచ్చింది. గడువు ముగియటంతో మరోసారి విచారణకు రాగా మరో మూడు నెలల సమయం పొడిగించాలని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ న్యాయస్థానాన్ని కోరారు. ఇందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది.