chennamaneni ramesh
-
చెన్నమనేని జర్మనీ పౌరుడే
సాక్షి, హైదరాబాద్: వేములవాడ మాజీ ఎమ్మెల్యే చె న్నమనేని రమేశ్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చిచెప్పింది. భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ 2019లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను సమర్థించింది. తప్పుడు పత్రాలతో గత 15 ఏళ్లుగా న్యాయస్థానాన్ని, అధికారులను తప్పుదోవ పట్టించారని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్మనీ పౌరుడినని తెలిసినా పలు పిటిషన్లు దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృథా చేశారని మండిపడింది.ఇందుకుగాను ఆయనకు హైకోర్టు చరిత్రలోనే తొలి సారిగా ఏకంగా రూ. 30 లక్షల భారీ జరిమానా విధించింది. ఇందులో ఆది శ్రీనివాస్ (ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో రమేశ్ ప్రత్యర్థి)కు రూ. 25 లక్షలు, హైకోర్టు లీగల్ సర్విసెస్ కమిటీకి రూ. 5 లక్షలు చెల్లించాలని రమేశ్‌ను ఆదేశించింది. చెల్లింపునకు నెల రోజులు గడువు విధించింది. 2009లో తొలిసారి వేములవాడ నుంచి ఎ మ్మెల్యేగా విజయం సాధించింది మొదలు చెన్నమ నేని భారతీయ పౌరుడా కాదా అనే వివాదం కొన సాగుతోంది.ఆయన రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ దీనిపై తొలి నుంచీ న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జర్మనీ పౌరసత్వం కారణంగా రమేశ్ భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ 2019 నవంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ అదే సంవత్సరం ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై ఐదేళ్లపాటు సాగిన విచారణ అనంతరం న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి అక్టోబర్‌లో తీర్పు రిజర్వు చేసి సోమవారం తీర్పు వెలువరించారు. ఆయన ఎన్నిక కూడా చెల్లదన్న ఆది శ్రీనివాస్ చెన్నమనేని ఇరుదేశాల పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్‌కుమార్ వాదించారు. ‘రెండుచోట్ల వివిధ కేటగిరీల కింద పౌరసత్వం కలిగి ఉండటాన్ని మన చట్టాలు అనుమతించవు. విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయుడు ఎన్నటికీ ఇక్కడ ఎమ్మెల్యే కాలేరు. తన పౌరసత్వ సమస్య 2009 నుంచి పెండింగ్‌లో ఉన్నా చెన్నమనేని రమేశ్ రెండు పౌరసత్వాలలో ఒకదాన్ని వదులుకోలేదు’అని వారు గుర్తుచేశారు.చెన్నమనేని రమేశ్ క్లెయిమ్ చేస్తున్న రెండు విభిన్న రకాల పౌరసత్వాలకు సంబంధించిన ఆధారాలు, పత్రాలను న్యాయమూర్తికి సమరి్పంచారు. రమేశ్ పౌరసత్వాన్ని కొనసాగించడం ‘ప్రజాప్రయోజనాలకు అనుకూలం కాదు’అని కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరించారు. మరోవైపు ఆది శ్రీనివాస్ తరఫు న్యాయవాది రవికిరణ్‌రావు వాదిస్తూ ‘ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డుతో చెన్నమనేని రమేశ్ జర్మనీకి అనేకసార్లు వెళ్లారు. జర్మనీ పౌరసత్వంతోనే ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నిక కూడా చెల్లదు’అని పేర్కొన్నారు. ఆ అధికారం కేంద్రానికి లేదని వాదించిన రమేశ్ మరోవైపు చెన్నమనేని రమేశ్ తరఫున న్యాయవాది రామారావు వాదిస్తూ ‘చెన్నమనేని జర్మనీ పౌరసత్వాన్ని వదులుకున్నారు. జర్మనీ పాస్పోర్టుతో ప్రయాణించినంత మాత్రాన ఆ దేశ పౌరసత్వం ఉన్నట్లు కాదు. దేశ సార్వ¿ౌమత్వానికి విఘాతం కలిగించిన వారి పౌరసత్వాన్ని రద్దు చేసే అధికారం కేంద్రానికి ఉంది. కానీ రమేశ్ అలాంటి చర్యలకు పాల్పడలేదు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకోవాలి. చెన్నమనేని రమేశ్ పౌరసత్వ రద్దు నోటిఫికేషన్‌ను కొట్టేయాలి’అని కోరారు.అప్పీల్‌కు వెళ్లడాన్ని పరిశీలిస్తా: చెన్నమనేనిహైకోర్టు తీర్పు తీవ్ర నిరాశపరిచిందని చెన్నమనే ని రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సో మవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రా జకీయ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మిత్రులు, శ్రేయోభిలాషుల సహకారంతో ముందుకు నడిచానని.. నాలుగుసార్లు ఎన్నికల్లో గెలిచానని గుర్తుచేశారు. వరుస ఓటములను జీర్ణించుకోలేక రాజకీయ ప్రత్యర్థులు తన పౌరసత్వంపై కేసులు వేశారని చెన్నమనేని ఆరోపించారు. ఇలాంటి కేసులను గతంలోనే హైకోర్టు, సుప్రీంకోర్టులో విజయవంతంగా ఎదుర్కొన్నానని.. తాజా తీర్పుపై అప్పీల్ చేసే అంశాన్ని పరిశీలిస్తానన్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ వేములవాడ అభివృద్ధికి సహకరిస్తూనే ఉంటానని పేర్కొన్నారు -
చెన్నమనేని రమేష్ కు చుక్కెదురు
-
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేనికి బిగ్ షాక్.. హైకోర్టు ఝలక్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పౌరసత్వంపై ఆయన వేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ సందర్భంగా రమేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఆయనకు 30 లక్షలు జరిమానా విధించింది.బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. పౌరసత్వం విషయంలో రమేష్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. పదిన్నర సంవత్సరాల పాటు ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చెన్నమనేనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాదనల సందర్బంగా కోర్టును తప్పుదోవ పట్టించినందుకు హైకోర్టు సీరియస్ అయ్యింది. ఆయన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్టు తెలిపింది. రమేష్ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు.. ఫేక్ డాక్యుమెంట్స్ సమర్పించారు. కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.జర్మనీ పౌరసత్వంతోనే ఆయన అక్కడికి వెళ్లారని కోర్టు తెలిపింది. దీంతో, చెన్నమనేనికి రూ.30 లక్షలు జరిమానా విధించింది. జరిమానాలో రూ.25 లక్షలు కాంగ్రెస్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఇవ్వాలని తెలిపింది. మిగిలిన రూ.5లక్షలను హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశం. నెల రోజుల్లో చెల్లింపులు పూర్తిచేయాలని చెన్నమనేనికి సూచించింది. -
చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టులో వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ గతంలో దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా చెన్నమనేని రమేష్‌కు హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ఇన్ని రోజులు చెన్నమనేని రమేష్ ఏ పాస్ పోర్ట్ మీద ట్రావెల్ చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. అందుకు జర్మనీ పాస్ పోర్ట్ మీద ట్రావెల్ చేశారని చెన్నమనేని తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇప్పటికి జర్మనీ పాస్ పోర్ట్ ఉందని తెలిపిన న్యాయవాది.. పాస్ పోర్ట్ ప్రామాణికం కాదని విన్నవించారు. వెంటనే ఇండియన్ పాస్ పోర్ట్ ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. లేదని చెన్నమనేని తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం, అన్ని వాదనలు పరిగణలోకి తీసుకుంటామంటూ తీర్పును ఈ రోజు వాయిదా వేసింది. తుది తీర్పు త్వరలోనే వెలువరిస్తామని తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. -
మరోసారి హాట్ కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్
-
మంత్రి కేటీఆర్‌ను కలిసిన చెన్నమనేని..
సాక్షి, హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. శుక్రవారం సాయంత్రం సచివాలంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. వేములవాడ నియోజకవర్గంలోని అభివృద్ది పనులు, పెండింగ్ పనులు, అనుమతులపై కాసేపు చర్చించారు. ఈ సందర్భంగా చెన్నమనేనికి మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా వేములవాడ ఎమ్మెల్యే టికెట్‌ను చల్మెడ లక్ష్మీనర్సింహరావుకు కేటాయించడంతో చెన్నమనేని అలకబూనిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చెన్నమనేని సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రధాన సలహాదారుగా నియమించారు. అంతేగాక ఇటీవలే చెన్నమనేని రమేష్ అమెరికా, దుబాయ్ దేశాల నుంచి రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాల ఏర్పాటు చేసుకుని తెలంగాణ వచ్చారు. ఈ క్రమంలో నేడు కేటీఆర్‌తో భేటీ అయి.. వేములవాడ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, పెండింగ్ పనుల అనుమతులు, దేవాలయ అభివృద్ది, కలికోట సూరమ్మ చెరువు, మిగిలి వున్న ముంపు గ్రామాల సమస్యలు, ప్రధాన మైన రోడ్లు, బ్రిడ్జీల అనుమతులు మొదలగు వాటిపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహా దారులుగా నియమితులైన రమేష్‌కు కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి గురుతరమైన బాధ్యత అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇందుకు సహకరించిన జిల్లా స్థానిక మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చెన్నమనేని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పజెప్పిన ఈ బాధ్యతకు పూర్తిస్థాయి న్యాయం చేస్తానని చెప్పారు. -
సస్పెన్స్ ఓవర్.. కేసీఆర్‌ను కలిసిన చెన్నమనేని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల పంచాయితీ పీక్ స్టేజ్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. పలువురు సిట్టింగ్‌లకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, రంగంలోకి దిగిన కేసీఆర్.. పలువురు నేతలకు కీలక పదవులు, బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఈ క్రమంలోనే వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు(వ్యవసాయ రంగ వ్యవహారాలు)గా నియమించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా సీఎం కేసీఆర్‌ను చెన్నమనేని ప్రగతిభవన్‌లో కలిశారు. తనను వ్యవసాయ రంగ ప్రధాన సలహాదారుగా నియమించినందుకు కేసీఆర్‌ను చెన్నమనేని బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల నుంచి వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని, స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, కేవలం దశాబ్ది కాలంలోపే అధిగమించిందని తెలిపారు. చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వహిస్తా.. సీఎం కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ రాష్ట్రం నేడు వ్యవసాయ విధానాల అమలులో, వ్యవసాయాభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కేసీఆర్ సారథ్యంలో వ్యవసాయ అభివృద్ధి, రెండవ దశలో భవిష్యత్తు సవాళ్లకు సిద్దమౌతున్న సమయంలో సీఎం తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని ఎమ్మెల్యే రమేశ్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చెన్నమనేనికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఇక, కేసీఆర్‌తో భేటీ తర్వాత వేములవాడ బీఆర్ఎస్ రాజకీయాల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు ఒకింత బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. చెన్నమనేని ఏం చెబుతారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇది కూడా చదవండి: ఎన్నికలకు ఇంకా మూడు నెలలుంది.. ఎమ్మెల్యే రాజయ్య షాకింగ్ కామెంట్స్ -
వేములవాడ నియోజకవర్గం చరిత్ర ఇదే..
వేములవాడ నియోజకవర్గం వేముల వాడ నియోజకవర్గం నుంచి చెన్నమనేని రమేష్ నాలుగోసారి విజయం సాదించారు. ఒకసారి టిడిపి నుంచి, ఒక ఉప ఎన్నికతో సహా మూడుసార్లు టిఆర్ఎస్ పక్షాన గెలుపొందారు. ఆయన జర్మని పౌరసత్వం కలిగి ఉన్నారన్న వివాదం ఉన్నప్పటికీ, దానిని అదిగమించి గెలుస్తుండడం విశేషం. ఆయన తండ్రి, సీనియర్ నేత చెన్నమనేని రాజేశ్వరరావు గతంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంటే తండ్రి, కొడుకులు పదిసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారన్నమాట. చెన్నమనేని రమేష్ ఈసారి తన సమీప ప్రత్యర్ధి కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన ఆది శ్రీనివాస్‌పై 28186 ఓట్ల మెజార్టీతో గెలిచారు. రమేష్‌కు 84040 ఓట్లు, ఆది శ్రీనివాస్‌కు 55864 ఓట్లు వచ్చాయి. ఈ నాలుగుసార్లు ఇక్కడ వీరిద్దరే ప్రదాన ప్రత్యర్దులుగా ఉన్నారు. ఇక్కడ బిజెపి అభ్యర్ది ప్రతాప్ రామకృష్ణకు సుమారు 5500 ఓట్లు వచ్చాయి. రమేష్ వెలమ సామాజికవర్గానికి చెందిన నేత. ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఈయనే గెలుపొందుతున్నారు. వేములవాడ, అంతకుముందు నియోజకవర్గంగా ఉండి రద్దయిన మెట్ పల్లి నియోజకవర్గంలో కలిపి పన్నెండు సార్లు వెలమ సామాజికవర్గ నేతలు ఎన్నిక కాగా, ఒకసారి రెడ్డి, రెండుసార్లు బిసిలు, ఒకసారి ఇతరులు ఎన్నికయ్యారు. 2009లో కేంద్ర మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగరరావు బిజెపి పక్షాన పోటీ చేయగా, స్వయాన ఆయన అన్న రాజేశ్వరరావు కుమారుడు అయిన రమేష్ టిడిపి తరుపున రంగంలో దిగారు. రమేష్ తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ అభ్యర్ధి ఆది శ్రీనివాస్‌పై గెలుపొందగా, విద్యాసాగరరావు మూడోస్థానంలో మిగిలారు. విద్యాసాగరరావు 2010 ఉప ఎన్నికలో రమేష్‌కు మద్దతు ఇవ్వడం విశేషం. విద్యాసాగర్‌రావు గతంలో మెట్పల్లి నుంచి మూడుసార్లు శాసనసభకు, రెండుసార్లు కరీంనగర్ నుంచి లోక్‌సభకు గెలుపొందారు. 2014లో లోక్ సభకు పోటీచేసి ఓడిపోయారు. వాజ్‌పేయి క్యాబినెట్లో హోం శాఖ సహాయ మంత్రిగా విద్యాసాగర్ రావు వున్నారు. తదుపరి మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు. రాజేశ్వరరావు ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 1985, 94లలో వేర్వేరు పక్షాల తరుఫున అన్నదమ్ములు రాజేశ్వరరావు, విద్యాసాగరరావులు శాసనసభలో ఉన్నారు. గతంలో మెట్పల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన వారిలో సిహెచ్ సత్యనారాయణ రావు రెండుసార్లు, వర్ధినేని వెంకటేశ్వరరావు రెండుసార్లు గెలుపొందారు. 1998 ఉప ఎన్నికలో గెలుపొందిన కొమిరెడ్డి జ్యోతి, 2004లో గెలుపొందిన రాములు భార్యభర్తలు. మెట్‌పల్లికి 13సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిపి ఐదుసార్లు, భారతీయ జనతా పార్టీ నాలుగుసార్లు, జనతా ఒకసారి, పిడిఎఫ్ ఒకసారి గెలుపొందాయి, ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా గెలిచారు. ఇక్కడ గెలిచినవారిలో వర్ధినేని వెంకటేశ్వరరావు 1981 నుంచి అంజయ్య, భవనం, కోట్ల క్యాబినెట్లలో పనిచేసారు. వేములవాడ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కొత్త టెన్షన్.. కేటీఆర్ అనుచరుడికి సీటు!
ఆ నియోజకవర్గంలో టిక్కెట్ వార్తతో పాటు ఫ్లెక్సీల వార్ కూడా తీవ్రమవుతోంది. టిక్కెట్ రాదేమో అన్న ఆందోళనతో సిటింగ్ ఎమ్మెల్యే అసహనానికి గురవుతున్నారట. ఇంతకుముందు ప్రత్యర్థి పార్టీలతో యుద్ధం చేశారు. ఇప్పుడు పార్టీలోనే కోల్డ్ వార్ సాగుతోంది. టిక్కెట్ కోసం మరో ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? ఆ ఎమ్మెల్యే ఎవరు?.. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబును ఒకవైపు పౌరసత్వ కేసు.. మరోవైపు సొంతపార్టీలో సీటు గొడవ నిద్రలేకుండా చేస్తున్నాయి. అనేక సంవత్సరాల నుంచి సాగుతున్న పౌరసత్వ కేసు ఇంకా కొలిక్కి రాకపోవడం.. ఇంటిగోల కలిసి రమేష్ బాబును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎమ్మెల్యే కావాలన్న తన చిరకాల కోరిక తీర్చుకోవాలనుకున్న చల్మెడ లక్ష్మీనర్సింహారావు కొద్దికాలం క్రితమే కాంగ్రెస్‌ను వీడి కారెక్కడంతో రచ్చ మొదలైంది. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, చల్మెడ లక్ష్మీ నరసింహారావు ఇద్దరూ కోనరావుపేట మండలానికి చెందినవారే. పైగా ఇద్దరూ ఒకే సామాజికవర్గం వారే. ఈ ఈక్వేషన్స్‌తోనే ఇద్దరి మధ్యా పార్టీలో కోల్డ్ వార్ మొదలైంది. ఇదిలాఉంటే.. గులాబీ పార్టీ అంతర్గత రాజకీయాల్లో కొంతకాలంగా సాగుతున్న ఫ్లెక్సీల గొడవ ఓ ఆరని చిచ్చులా మారింది. ఈ చిచ్చును ఆర్పే ఫైరింజన్స్ కూడా లేకపోవడంతో.. అవి ఇంకా భగ్గున మండుతూనే ఉన్నాయి. ఈమధ్యే చల్మెడ బర్త్ డే వేడుకల సందర్భంగా వేములవాడ పట్టణ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్.. చల్మెడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. అందులో ఎమ్మెల్యే ఫోటో చిన్నగా వేయడం.. చల్మెడ లక్ష్మీనర్సింహారావు ఫోటో పెద్దగా వేయడంతో వివాదం మొదలైంది. పోలీసులు రాత్రికి రాత్రే విజయ్‌ని పిలిచి మందలించారు. ఫ్లెక్సీలను తొలగించాలని పోలీసులు బెదిరించినట్టు విజయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏదైనా ఉంటే పార్టీ పరంగా ఫిర్యాదు చేయాలి. కానీ.. పోలీసుల జోక్యం ఎందుకు అని విజయ్ ప్రశ్న. గతంలో మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీలు కట్టినా ఇదే విధంగా రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారని వాపోయాడు. ఈ ఫ్లెక్సీల వివాదం ఇదే మొదటిసారి కాదు.. చివరిదీ కాదన్నట్టుగా తయారైంది. గత శివరాత్రి సమయంలో చల్మెడతో పాటు.. వేములవాడ టిక్కెట్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్న ఏనుగు మనోహర్ రెడ్డి ఫ్లెక్సీలనూ భారీగా ఏర్పాటు చేయడం ఎమ్మెల్యే కోపానికి కారణమైంది. అంతేకాదు ఈమధ్య కొన్ని సమావేశాల్లో రమేష్ బాబు అసహనంగా మాట్లాడటం.. పార్టీలోని అంతర్గత ప్రత్యర్థులకు తాకేలా కామెంట్స్ చేయడమూ అలవాటుగా మారింది. తన టిక్కెట్ పై నెలకొన్న సందేహాలపై మీడియాలో వార్తలు రావడాన్ని కూడా రమేష్ బాబు జీర్ణించుకోలేకపోతున్నారనే టాక్ నడుస్తోంది. చల్మెడ లక్ష్మీనర్సింహారావు వేములవాడలో యాక్టివ్ అవుతుండటంతో ఇద్దరి మధ్యా వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఆఫీస్ విడుదల చేసిన ఓ ప్రెస్ నోట్లో.. ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు, పరువునష్టం దావా వేస్తామన్న వార్నింగ్‌పై ఇప్పుడు వేములవాడలో చర్చ నడుస్తోంది. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావుకు ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొనడం కంటే పార్టీలో అంతర్గత ప్రత్యర్థులతో ఫైట్ చేయడమే టఫ్ టాస్క్‌లా మారింది. పౌరసత్వ సమస్యతో ఈసారి రమేష్ బాబుకు టిక్కెట్ వస్తుందా? రాదా అన్న సందేహాల నడుమ చల్మెడ యాక్టివ్ కావడం.. కేటీఆర్ అనుచరుడుగా ఉన్న ఏనుగు మనోహర్ రెడ్డి కూడా టికెట్‌పై ధీమాగా ఉండటం మొత్తంగా గందరగోళం కొనసాగుతోంది. మరోవైపు ఎన్ఆర్ఐ గోలి మోహన్ కూడా తనకే టిక్కెట్ వస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాలన్నీ సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇది కూడా చదవండి: కూతురు ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.. ఏమన్నారంటే! -
మహాశివరాత్రి జాతరకు సీఎంకు ఆహ్వానం
వేములవాడ : ఈ నెల 18న జరిగే వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో జరిగే మహా శివరాత్రి జాతరకు హాజరు కావాల్సిందిగా సీఎం కేసీఆర్‌ను వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ఆహ్వానించారు. ఆలయ ఈవో కృష్ణప్రసాద్, వేద పండితులు సీఎంకు శాలువాకప్పి ఆహ్వాన పత్రిక, తీర్థ ప్రసాదాలు అందజేశారు. 33 జిల్లాల్లో కార్మిక భవనాలు మంజూరు చేసినందుకు కేసీఆర్‌కు మంత్రి మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
చెన్నమనేని పౌరసత్వంపై తీర్పు వాయిదా
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తన పౌరస త్వాన్ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ వేములవా డ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ దాఖలు చేసిన పిటిషన్లో హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. రమేశ్ 2009లో భారత పౌరసత్వం పొందారు. ఆపై వరుసగా 4సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ఆయన ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ వేము లవాడలో ఆయనపై పోటీ చేసిన ఆది శ్రీనివాస్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఏడాదిన్నర క్రితం కేంద్ర హోంశా ఖ చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీన్ని సవాల్ చేస్తూ రమేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వై.రామా రావు వాదనలు వినిపించారు. ప్రయాణానికి పాత పాస్‌పోర్టు ఉపయోగించినంత మాత్రాన రమేశ్ తమ దేశ పౌరుడు అనలేమని లిఖితపూ ర్వంగా జర్మనీ రాయబార కార్యాలయం చెప్పిందని నివేదించారు. రాజకీయ ప్రత్యర్థి వరుసగా ఎన్నికల్లో ఓడిపోవడంతోనే ఈ కేసు వేశారని చెప్పారు. రమేశ్.. ముమ్మాటికి భారతీయుడే అని, పౌరసత్వ చట్టం సెక్షన్ 10(3) ధ్రువీకరి స్తోందన్నారు. సెక్షన్ 10(2) ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి పౌరసత్వం రద్దు చేసే అధికారాలు న్నాయని.. అయితే రమేశ్‌కు అందులోని ఏ అంశాలు వర్తించవని వెల్లడించారు. విదేశీ పౌరసత్వాన్ని వదులుకోలేదు... కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ టి.సూర్యకరణ్‌రెడ్డి వాదిస్తూ, భారత పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 10, 7బీ ప్రకారం రమేశ్ భార త సంతతికి చెందిన విదేశీ పౌరుడని చెప్పారు. జర్మనీ పౌరసత్వం ఉన్నందున ఆయన విదేశీ పౌరుడేనని అన్నారు. 2009 నుంచి ఈ వివాదం కొనసాగుతున్నప్పటికీ ఇప్పటివరకు రమేశ్ విదేశీ పౌరసత్వాన్ని వదులుకోలేదని, జర్మనీ పౌరసత్వాన్ని పునరుద్ధరించుకుంటూ వస్తున్నా రని తెలిపారు. ఇది అసాధారణ వ్యాజ్యంగా పరిగణించాలని కోరారు. సెక్షన్ 10(3) ప్రకారం పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. చట్టసభ సభ్యుడిగా ఉన్న చెన్నమనేని ద్వంద్వ పౌరసత్వ విషయంలో చట్టనిబంధనలను కచ్చితంగా అమలు చేయా ల్సి వుంటుందని ఆది శ్రీనివాస్ తరఫు సీనియర్ న్యాయవాది రవికిరణ్‌రావు వాదించారు. దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే చర్యలకు పాల్పడి తేనే పౌరసత్వంపై చర్యలు తీసుకోవాలని రమేశ్ చెప్పడంలో ఔచిత్యం లేదన్నారు. చివరకు న్యాయమూర్తి.. తీర్పును వాయిదా వేశారు. -
ఐదోసారికి కేటీఆర్ సిద్ధం.. వేములవాడ నుంచి బండి సంజయ్ బరిలోకి?
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా పారిశ్రామిక ప్రాంతం రామగుండంలో రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా మూడు ప్రధాన పార్టీలు అప్పుడే నువ్వా నేనా అన్నట్టు ప్రచారబరిలోకి దిగాయి. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేలా అన్ని పార్టీలు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాయి. కారు జోరుకు బ్రేకులు వేయాలని కాంగ్రెస్, కమలం పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. సింగరేణి కార్మికులే ఇక్కడ గెలుపోటములు డిసైడ్ చేస్తారు. ఎత్తుకు పై ఎత్తులు రామగుండం నియోజకవర్గంలో మళ్లీ గులాబీ జెండా ఎగురవేసేలా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. మరోవైపు గులాబీ పార్టీ ఎత్తుకు బీజేపీ పై ఎత్తులు వేస్తోంది. కాంగ్రెస్ మాత్రం ఈ సారి ఎలాగైనా సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఓటరు దేవుళ్ళను ప్రసన్నం చేసుకునేందుకు అప్పుడే ఇంటింటికి తిరుగుతూ ప్రచారం మొదలుపెట్టేశారు మూడు పార్టీల నాయకులు. టీఆర్ఎస్లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీజేపీలో మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, కాంగ్రెస్‌లో రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ రానున్న ఎన్నికలు సవాల్తీగాసుకుని తమ పంతం నెగ్గించుకునేలా పావులు కదుపుతున్నారు. సింగరేణి కార్మికులదే రామగుండం నియోజకవర్గంలో గోదావరిఖని పట్టణం, రామగుండం, పాలకుర్తి, అంతర్గాం మండలాలు ఉంటాయి. సింగరేణి కార్మికులు మొత్తం గోదావరిఖని 8 ఇంక్లైన్ కాలనీల్లో ఉంటారు. ఇక్కడ కార్మికుల కుటుంబాలు, మహిళా ఓటర్లు ఎక్కువ. సింగరేణి కార్మికులు యూనియన్ల పరంగా పోటాపోటీగా ఉంటాయి. కారుణ్య నియామకాలు, పేరు మార్పిడి జీఓ, బోనస్ లాంటి అంశాలు ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. పింఛన్లు టీఆర్ఎస్కు అనుకూలమే. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యే చందర్ అనుచరుల తీరు వల్ల కొంత ఇబ్బంది ఉంటుందనే చర్చ నడుస్తోంది. గతంలో ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ది కలిసి వస్తుందని బీజీపీ నేత సోమారపు భావిస్తున్నారు. చదవండి: పార్టీకి గుడ్‌బై! గులాం నబీ ఆజాద్‌పై కాంగ్రెస్ సీనియర్ నేతల సెటైర్లు ద్విముఖ పోటీనే మంథని నియోజకవర్గం పేరు వినగానే కాళేశ్వరం ప్రాజెక్టు గుర్తుకొస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ నియోజక వర్గంలోనిదే. మహాదేవ్ పూర్ ప్రాంతం భూపాలపల్లి జిల్లాలోకి వెళ్లడంతో కాళేశ్వరం ఆలయం, మేడిగడ్డ బ్యారేజ్ లక్ష్మి పంపు హౌజ్ ఉన్న ప్రాంతాలు ఆ జిల్లా పరిధిలోకి వెళ్లాయి. పార్వతీ బ్యారేజ్ సరస్వతీ పంపు హౌజ్ మంథని నియోజక వర్గంలోనే ఉన్నాయి. ఎన్నికలు మరో ఏడాదిలో జరిగే అవకాశాలు కన్పిస్తుడంతో రాజకీయ నాయకులు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నారు. అనేక ఏండ్లుగా ఇక్కడ ద్విముఖ పోటీనే ఎక్కువగా జరుగుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ కొసాగుతోంది. కానీ ఈసారి మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో త్రిముఖ పోటీ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. శ్రీధర్‌బాబుపై అసంతృప్తి మంథని నియోజకవర్గంలో శ్రీధర్ బాబు కాంగ్రెస్ తరపున మూడు సార్లు ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుపై శ్రీధర్‌బాబు విజయం సాధించారు. నాటి నుంచి నియోజకవర్గంలో పర్యటిస్తూనే ఉన్నారు. అక్కడక్కడ అయనపై ఇంకా అసంతృప్తి కన్పిస్తోంది. కార్యకర్తల ఫోన్లు లిఫ్ట్ చేయరనే విమర్శలు ఎదుర్కొంటున్నారు శ్రీధర్‌బాబు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా చందుపట్ల సునీల్ రెడ్డి పేరు ఖరారు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన చందుపట్ల బీజేపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అధిష్టానం దృష్టిలో వడినట్లు సమాచారం. పుట్టమధుపై ఆరోపణలు న్యాయవాది వామన్ రావు హత్య విషయంలో టీఆర్ఎస్నేత, జడ్పీ చైర్మన్ పుట్ట మధుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. తమ వద్దే ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తమకు ఇబ్బందులే తప్ప ప్రయోజనం లేదని స్థానికులు భావిస్తున్నారు. ఈ రెండు అంశాలు గులాబీ పార్టీకి మైనస్‌అని భావిస్తున్నారు. పుట్ట మధు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సన్నిహితంగా ఉంటారనే టాక్ ఉంది. గులాబీ పార్టీ టికెట్ రాకపోతే పుట్ట మధు బీజేపీలోకి వెళ్ళవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. రెండుసార్లు పట్టం వరుసగా రెండుసార్లు ఏ పార్టీని ఆదరించని పెద్దపల్లి ప్రజలు ఒక్క టీఆర్ఎస్కు మాత్రమే రెండుసార్లు పట్టం కట్టారు. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నందున ఈసారి అధిష్టానం టికెట్ ఇవ్వదని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. టిక్కెట్ఇవ్వని పక్షంలో తాను ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని మనోహర్ రెడ్డి చెబుతున్నట్లు సమాచారం. బండి సంజయ్ వర్గీయుడికి టికెట్? ఇక కాంగ్రెస్ నుంచి ఒకసారి గెలిచి రెండుసార్లు ఓడిపోయిన చింతకుంట విజయరమణారావు ఈసారయినా గెలిచి తీరాలనే పట్టుదలగా ఉన్నారు. అయితే ఆయనకు జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య, ఓదెల ఎంపిపి గంట రాములు పక్కలో బల్లెంలా తయారయ్యారని టాక్. పెద్దపల్లిలో పోటీలో ఉండే కమలనాధులెవరనే ప్రశ్న వినిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డికి ఈసారి టికెట్ అనుమానమేనంటున్నారు. బండి సంజయ్ వర్గీయుడు ప్రదీప్ రావుకు పెద్దపల్లి టికెట్ ఇవ్వచ్చని సమాచారం. 100 కోట్ల ఆదాయం వస్తున్నా అభివృద్ధి సున్నా దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ రాజ రాజేశ్వర స్వామి కొలువై ఉన్న నియోజక వర్గ కేంద్రం అది. ఏడాదికి 100 కోట్ల ఆదాయం వస్తున్నా రాజన్న ఆలయం అభివృద్ధి కాలేదు. నియోజక వర్గం కూడా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. స్వయానా సీఎం కేసీఆర్ ప్రకటించిన టెంపుల్ మాస్టర్ ప్లాన్ కూడా అమలుకు నోచుకోవడం లేదు. ఇక్కడ 2009 నుంచి చెన్నమనేని రమేష్ బాబు గెలుస్తూ వస్తున్నారు. రమేష్ బాబుకు జర్మనీ పౌరసత్వం ఉండేది. దీనిపై కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో కోర్టులోను, కేంద్ర హోమ్ శాఖ ఆధ్వర్యంలో కూడా విచారణ జరుగుతోంది. పోటీలోకి మాజీ గవర్నర్ కొడుకు! సీనియర్ కాంగ్రెస్ నేత చల్మెడ లక్ష్మీ నరసింహా రావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో వేములవాడ టీఆర్ఎస్ టికెట్ చల్మెడకే అనే టాక్ వినిపిస్తోంది. మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న కొండ దేవయ్య కూడా టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన సీహెచ్. విద్యాసాగర్ రావు కొడుకు వికాస్ పోటీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పోటీ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నారు. సిరిసిల్లలో నేత కార్మికులకు చేతి నిండా పని సిరిసిల్ల అనగానే చేనేత.. సీనియర్ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరావు గుర్తుకు వస్తారు. ఇప్పుడు మంత్రి కేటీఆర్ పేరు వినగానే సిరిసిల్ల గుర్తుకు వచ్చే పరిస్తితి వచ్చింది. చెన్నమనేని రాజేశ్వరావు లాగే కేటీఆర్ కూడా సిరిసిల్లలో నాలుగు సార్లు గెలుపొందారు. ఐదోసారి కూడా విజయకేతనం ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారు కేటీఆర్. కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్‌తోపాటు మంత్రి కావడం, ముఖ్యమంత్రి కుమారుడు కావడం సిరిసిల్లకు కలిసి వచ్చింది. ఎన్నడూ లేని విధంగా సిరిసిల్లలో నేత కార్మికులకు చేతి నిండా పని దొరుకుతోంది. సిరిసిల్లలో చాలా అభివృద్ధి పనులు కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈసారి కూడా కేకేనే సిరిసిల్ల టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకుల్లో కుమ్ములాటలు జనాల్లో పార్టీకి చెడ్డపేరు తెస్తోంది.. నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. 2009లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కకేకే మహేందర్‌రెడ్డి 171 ఓట్ల స్వల్ప తేడాతో కేటీఆర్ చేతిలో ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్తరపున పోటీచేసినా ఓడారు. కేకేకు కాంగ్రెస్ నేతల నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతూనే ఉంది. ఈసారి కూడా కేకే మహేందర్ రెడ్డినే పోటీకి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. ఇక సిరిసిల్లలో బీజేపీ పుంజుకుంటోంది. ఈసారి బీజేపీ తరపున మృత్యుంజయం లేదా జిల్లా ఉపాధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పోటీ చేస్తారని తెలుస్తోంది. -
పాస్‌పోర్టు వినియోగించినంత మాత్రాన జర్మనీ పౌరుడు కాలేడు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణానికి పాత పాస్‌పోర్టు ఉపయోగించినంత మాత్రాన ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ తమ దేశ పౌరుడు కాలేరని లిఖితపూర్వకంగా జర్మనీ రాయబార కార్యాలయం చెప్పిందని ఆయన తరఫు న్యాయవాది వై.రామారావు కోర్టుకు నివేదించారు. చెన్నమనేని నిబంధనలకు అనుగుణంగా 2009లో భారత పౌరసత్వం పొందారని, రాజకీయ ప్రత్యర్థి వరుసగా ఎన్నికల్లో ఓటమి కావడంతోనే ఈ కేసు వేశారని చెప్పారు. చెన్నమనేని రమేశ్ 2009లో భారత పౌరసత్వం పొందారు. ఆ తరువాత వరుసగా నాలుగుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ వేములవాడలో ఆయనపై పోటీ చేసిన ఆది శ్రీనివాస్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో దాదాపు ఏడాదిన్నర క్రితం కేంద్ర హోంశాఖ చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చెన్నమనేని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. చెన్నమనేని తరఫున వై.రామారావు వాదనలు వినిపిస్తూ.. భారత పౌరసత్వం ఇచ్చిన 30 రోజుల్లో అతని పౌరసత్వంపై అభ్యంతరాలు తెలిపాలని నిబంధన ఉందన్నారు. కానీ, ఎన్నికల్లో ఓటమి తర్వాత(120 రోజుల) ప్రత్యర్థి అభ్యంతరం తెలుపడం.. హోంశాఖ దాన్ని స్వీకరించడం చట్టవిరుద్ధమన్నారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా హోంశాఖ పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. భారత పౌరసత్వం తీసుకున్న నాటికి రమేశ్ రాజకీయాల్లో లేరని వెల్లడించారు. వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను బుధవారానికి(ఆగస్టు 24) వాయిదా వేసింది. -
ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదంపై హైకోర్టు విచారణ
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఇప్పటికే చెన్నమనేని జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నట్లు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయగా, కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌పై చెన్నమనేని కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. కౌంటర్ పిటిషన్లపై ఇరుపక్షాలు తమ వాదనలను హైకోర్టుకు వినిపించారు. ఎన్నికల్లో పాల్గొనడానికి పూర్తి అర్హత ఉందని చెన్నమనేని తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఇప్పటికీ చెన్నమనేని జర్మనీలో ఉన్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. భారత ప్రభుత్వానికి ఓసిఐ కార్డు కోసం అప్లయ్ చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. హోంశాఖ కూడా చెన్నమనేని జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నట్లు తెలిపిందని న్యాయవాది వివరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది. -
జర్మనీ పౌరసత్వం వెనక్కి ఇచ్చేశా: చెన్నమనేని
హైదరాబాద్: పౌరసత్వ వివాదంపై వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌పై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. జర్మనీ పౌరసత్వం వెనక్కి ఇచ్చేసినట్లు హైకోర్టుకు తెలిపారు. చెన్నమనేని దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌పై వివరణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గడువు కోరింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు రెండు వారాల గడువు ఇచ్చింది. మరోసారి ఎవరూ గడువు కోరవద్దని తుది వాదనలకు సిద్ధం కావాలని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు విచారణను మరో రెండు వారాల పాటు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ గతంలో ఆది శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఏడాది క్రితం కేంద్ర హోంశాఖ చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ కొనసాగుతోంది. రమేష్ పౌరసత్వం వివాదంపై గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. చెన్నమనేని పౌరసత్వంపై కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని, ప్రస్తుతం ఆయన దేశంలోని ఉన్నాడని, రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వలన శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలుగటంలేదన్నారు. చదవండి: గోల్డ్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్! -
కేంద్రం తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై తెలంగాణలో హైకోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. అయితే, అఫిడవిట్ దాఖలు చేయకుండా.. మెమో దాఖలు చేసిన కేంద్ర హోంశాఖ కేంద్ర హోమ్ శాఖ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంబసీ నుంచి వివరాలు రాబట్టలేకపోతే ఎందుకు మీ హోదాలు? అని హైకోర్టు ప్రశ్నించింది. పాత మెమోనే సమర్పించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు జర్మనీ ఎంబీసీ నుంచి పూర్తి సమాచారంతో అఫిడవిట్ వేయాలని హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా వేసింది. -
చెన్నమనేని పౌరసత్వంపై హైకోర్టు విచారణ
సాక్షి, హైదరాబాద్ : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై తెలంగాణ హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. రమేష్ కుమార్ పౌరసత్వం చెల్లదంటూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని పిటిషనర్ ఆది శ్రీనివాస్ కోర్టును కోరారు. మరోవైపు మరోవైపు కేంద్ర హోంశాఖ పౌరసత్వం రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని చెన్నమనేని రమేష్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం జూన్ 16న మరోసారి పూర్తి వాదనలు వింటామని తెలుపుతూ.. తదుపరి విచారణను జూన్ 16 కు వాయిదా వేసింది. లాక్డౌన్ కారణంగా ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టింది. కాగా వేములవాడ శాసన సభ్యుడైన చెన్నమనేని రమేష్‌కు జర్మని దేశంలో పౌరసత్వం ఉందంటూ ఆయన సమీప అభ్యర్థి ఆది శ్రీనివాస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. -
సమగ్ర గల్ఫ్ విధానానికి ఇదే తరుణం
గల్ఫ్‌లోని 87 లక్షల మంది భారతీయ శ్రామికుల్లో 17 శాతం, అంటే 15 లక్షల మంది తెలంగాణ వాళ్లు. ప్రవాసిమిత్ర, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రకారం, కరోనా కారణంగా ఇందులో 25 శాతం అనగా 3.7 లక్షల మంది ఉపాధిని కోల్పోవచ్చు. వీళ్లు రానున్న ఆరు నెలల్లో తెలంగాణకు తిరిగి రావచ్చు. ఈ సంక్షోభంతో పాటు, ప్రతియేటా వచ్చే సుమారు రూ. 6,300 కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని కోల్పోవాల్సిన పరిస్థితిని ఎదుర్కోవడం ప్రభుత్వానికి పెద్ద సవాలు. గల్ఫ్ కార్మికుల చిరకాల వాంఛ అయిన సమగ్ర ప్రవాసీ విధానాన్ని రూపొందించడానికీ, క్షేత్ర స్థాయి సమస్యలను వ్యక్తిగతంగా అధ్యయనం చేయడానికీ తెలంగాణ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫిబ్రవరి 26 నుంచి గల్ఫ్ దేశాల్లో పర్యటించాలని అనుకున్నారు. తెలంగాణలో తగినంత పని ఉంది, వారు స్వదేశానికి తిరిగి రావాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేద, తక్కువ ఆదాయ వర్గాల వారికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో ఆకట్టుకునే మూలధన పెట్టుబడులతో ముందుకు వెళుతున్నప్పటికీ నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత ఉంది. మరోవైపు కేరళ ఎన్నారై విధానాన్ని అధ్యయనం చేయ డానికి అధికారుల బృందాన్ని తెలంగాణ ప్రభుత్వం పంపింది. వివిధ దేశాల్లో నివసిస్తున్న కేరళీయుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలపై ఈ బృందం సమగ్ర చర్చలు జరిపింది. రాష్ట్రంలోని ముఖ్యమైన పనుల ఒత్తిడితోపాటు, కరోనా సంక్షోభం కారణంగా ముఖ్యమంత్రి గల్ఫ్ పర్యటన వాయిదా పడింది. ఈ నేపథ్యంలో చాలాకాలంగా రగులు తున్న గల్ఫ్ వలస కార్మికుల సమస్యలకు సంబంధించిన ఒక దీర్ఘకాలిక పరిష్కారం వెతకడం ముఖ్యం. భారత్ కార్మికులు గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రె యిన్, ఒమన్, కువైట్లలో పని చేస్తున్నారు. భారత్‌కు అనేక శతాబ్దాలుగా అరబ్ దేశాలతో నాగరికత సంబంధ మూలా లున్నాయి. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) ప్రకారం, గల్ఫ్‌కు వలస కార్మి కులను పంపే రెండు ప్రధాన దేశాలలో ఒకటి భారత్ (మరొకటి ఫిలిప్పీన్స్). ఈ వలసదారులు విదేశీ మారక ద్రవ్య బదిలీ ద్వారా మన దేశానికి ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉంటున్నారు, అదే సమయంలో గల్ఫ్ దేశాల ఆర్థిక అభివృద్ధిలోనూ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. 1970 లలో చమురు వికాసం తరువాత గల్ఫ్‌కు భారత కార్మికుల వలసలు పెరిగాయి. తక్కువ జీతానికి చేయడానికి సిద్ధంగా ఉన్న కారణంగా భారత్, ఇతర దక్షిణాసియా దేశాల కార్మి కులను నియమించుకోవడానికి గల్ఫ్ దేశాలు ఆసక్తి చూపాయి. 2018–19 కాలంలో ఎన్నారైలు భారత్‌కు పంపిన మొత్తం విదేశీ మారకద్రవ్యంలో అమెరికన్ ఎన్ఆర్ఐల వాటా కేవలం 12.5 శాతం. మిగిలిన 87.5 శాతం సొమ్ము ప్రధానంగా గల్ఫ్, ఐరోపా దేశాల నుంచి వచ్చింది. మన ఆర్థిక వృద్ధికి తోడ్పడే గల్ఫ్ ఎన్ఆర్ఐల కొరకు మన విధానాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. భారతీయ వలసదారుల్లో పాక్షిక నైపుణ్యం కలిగిన, నైపుణ్యం లేని కార్మికులు 70 శాతం, వైట్ కాలర్ ఉద్యోగులు 20 శాతం, నిపుణులు 10 శాతం ఉన్నారు. దక్షిణాసియా కార్మికులు గల్ఫ్ దేశాల్లో రాజకీయ హక్కులను కోరలేదు, ఆ దేశాల రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో జోక్యం చేసుకో లేదు. ఇది అక్కడి పాలకవర్గాలు తమ అధికారాన్ని స్థిరీక రించుకోవడానికి ఉపయోగపడింది. గల్ఫ్ వలసదారులు రెండు రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. మొదటిది చట్టపరమైన ప్రక్రియకు సంబంధించినది; రెండవది వారి జీవన, పని పరిస్థితులకు సంబంధించినది. అందులో ముఖ్యమైనవి: తాత్కాలిక నుంచి శాశ్వత ఉద్యోగానికి మారడం (పర్యాటక వీసాలతో సహా), ఉద్యోగ ఒప్పం దాలను ముందస్తుగా రద్దుచేయడం, కాంట్రాక్టు నిబంధన లను కార్మికుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా మార్చడం, చెల్లింపుల్లో ఆలస్యం, కనీస వేతన ప్రమాణాలను ఉల్లం ఘించడం, ప్రతిఫలం ఇవ్వకుండా అధిక సమయం పని చేయించుకోవడం, పాస్‌పోర్టు, ఇతర చట్టపరమైన పత్రాలను యజమాని స్వాధీనంలో ఉంచుకోవడం. చాలా మంది కార్మికులు ప్రాథమిక సదుపాయాలు లేని బహిరంగ ప్రదే శాల్లో తాత్కాలిక లేదా అక్రమ స్థావరాలు ఏర్పాటు చేసుకొని వంతులవారీగా ఆశ్రయం పొందుతున్నారు. వారికి ఆహా రాన్ని రాయితీ ధరలకు అందించే స్థానిక రేషన్ కార్డులు లేవు. వారు వృత్తిపరమైన ఆరోగ్య ప్రమాదాలకు, అంటు వ్యాధులకు గురయ్యే అవకాశముంది. సంవత్సరాలకొద్దీ నివసించినప్పటికీ, వారి కుటుంబాలను తెప్పించుకోవడా నికి అనుమతిలేదు. ఆదాయం పెరిగే అవకాశముంటేనే ఎవరైనా వలస వెళతారు. మనవాళ్ళు పెద్ద సంఖ్యలో యూఎస్, యూరప్, ఆస్ట్రేలియాకు వలస వెళ్లడాన్ని గమనించవచ్చు. కానీ గల్ఫ్ సోదరులు కనీస జీవనోపాధి దొరక్క వలస పోతున్నారు. ప్రజలు తగిన జీవనోపాధిని పొందే పరిస్థితులను కల్పించ డంలో గత ఆరు దశాబ్దాలుగా మన ప్రభుత్వాలు, అభివృద్ధి సంస్థల సుదీర్ఘ విధాన వైఫల్య ఫలితమే ఈ వలసలు. గల్ఫ్ ఎన్నారై విధానాన్ని ఎందుకు రూపొందించు కోవాలి అనే దానికి మరో ముఖ్యమైన వాదన ఉంది. 2018–19 కాలంలో ఎన్నారైలు విదేశాల నుంచి భారత్‌కు పంపిన మొత్తం విదేశీ మారకద్రవ్యం 80 బిలియన్ డాలర్లు (సుమారు ఆరు లక్షల కోట్ల రూపాయలు). ఇందులో అమెరికన్ ఎన్ఆర్ఐల వాటా కేవలం 12.5 శాతం. మిగిలిన 87.5 శాతం సొమ్ము ప్రధానంగా గల్ఫ్, ఐరోపా దేశాల నుంచి వచ్చింది. గల్ఫ్‌లోని చాలా మంది స్వదేశానికి తిరిగి రావాలని కోరుకుంటారు. దానికి అనుగుణంగానే కుటుం బం కోసం పెట్టుబడులు పెట్టారు. కానీ యూఎస్, కెనడా, యూరప్, ఆసియా–పసిఫిక్ భారతీయుల్లో స్వదేశానికి వచ్చి స్థిరపడాలనే ఆలోచన లేదు. కాబట్టి వారు ఆయా దేశాల్లోనే గణనీయమైన పెట్టుబడి పెడతారు. ఇక్కడ పెట్టుబడి పెడితే ఆస్తిని కిరాయికి ఇస్తారు, లేదా కొన్నేళ్ల తర్వాత అధిక లాభాలకు అమ్ముకుంటారు. పెట్టుబడులను ఆకర్షించడా నికి ప్రోత్సాహకాల ద్వారా ప్రాధాన్యతలను ఇవ్వాలను కుంటే విధాన రూపకర్తలు ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలి. మన సొంత ఆర్థిక వృద్ధికి తోడ్పడే గల్ఫ్ ఎన్ఆర్ఐల కొరకు మన విధానాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రవాసీ కేరళీయ వ్యవహారాల విభాగం (నోర్కా) వలస వెళ్లాలనుకునే వ్యక్తులకు త్వరగా, సజావుగా డాక్యుమెంటే షన్ చేయడంలోనూ, వారి నైపుణ్యాలు మెరుగుపరిచే శిక్షణ ఇవ్వడంలోనూ సాయపడుతుంది. విదేశీ కార్మికుల డేటా బేస్ ఏర్పాటు చేయడం, మరణిస్తే మృతదేహాన్ని తెప్పిం చడం, తిరిగి వచ్చిన వారికి బీమా, ఆర్థిక సహాయ పథకాలు, పునరావాస సబ్సిడీ ఇవ్వడం లాంటివన్నీ చేస్తుంది. 35 లక్షల కేరళ ప్రవాసుల అవసరాలు తీర్చడానికి నోర్కాకు రూ.80 కోట్ల బడ్జెట్ ఉంది. గల్ఫ్‌లో పనిచేస్తున్న 15 లక్షల మంది తెలంగాణ ప్రవాసులు అలాంటి విధానం కోసం ఎదురు చూస్తున్నారు. డా. రమేశ్ చెన్నమనేని వ్యాసకర్త వేములవాడ శాసనసభ్యులు -
‘రాజన్న’ భక్తులకు హెలికాఫ్టర్ సదుపాయం
సాక్షి, హైదరాబాద్ : శివరాత్రి సందర్భంగా వేములవాడకు వెళ్లే భక్తులకు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది. ఈ నెల 20 నుంచి 23 వరకు హైదరాబాద్ నుంచి వేములవాడ వెళ్లడానికి హెలికాప్టర్ సదుపాయాన్ని కల్పించింది. హైదరాబాద్ నుంచి వేములవాడకు వెళ్లి తిరిగి రావడానికి టికెట్ ధర రూ.30వేలుగా నిర్ణయించారు. ఈ మేరకు గురువారం బేగంపేట విమానాశ్రయంలో మంత్రి శ్రీనివాస గౌడ్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కేటీఆర్ సూచన మేరకే వేములవాడకు హెలికాఫ్టర్ సదుపాయాన్ని కల్పించామన్నారు. రూ.100 కోట్లు పెట్టి వేములవాడలో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ఒక్క టూరిజం ప్రాంతాన్ని ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. -
'చెన్నమనేని బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే'
సాక్షి, సిరిసిల్లా : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమ్మనేని రమేశ్ పౌరసత్వంపై కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కీలక వాఖ్యలు చేశారు. రమేశ్ తాను భారతదేశ పౌరున్ని అంటూనే జర్మనీ పాస్‌పోర్టుపై జర్మనీ ఎలా ప్రయాణం చేస్తున్నాడని శ్రీనివాస్ పేర్కొన్నాడు. జర్మనీ పాస్‌పోర్టుపై మద్రాస్ నుంచి జర్మనీ వెళ్లే పరిస్థితి ఎందుకు వచ్చిందని, దీనిపై ప్రజలకు వివరణ ఇవ్వాల్పిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ మూడు సార్లు చెన్నమనేని రమేశ్ భారతదేశ పౌరుడు కాదని తేల్చి చెప్పినా గత 11 సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలను, దేశాన్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. సాక్షాత్తు భారతదేశ న్యాయస్థానం ఈ దేశ పౌరుడు కాదని తేల్చి చెప్పినా దొంగ చాటుగా పౌరసత్వం పొంది వివాదంలో కూరుకుపోయిన వ్యక్తికి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఎలా ఇచ్చిందని మండిపడ్డారు. ఇప్పటికే కోర్టు పలుమార్లు మొట్టికాయలు వేసినా ఆయనకు బుద్ధి రాలేదని , వెంటనే నియోజకవర్గ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. -
చెన్నమనేనిని ప్రశ్నించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దుపై స్టేను హైకోర్టు మరోసారి పొడిగించింది. చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు గత నవంబర్‌లో స్టే ఇచ్చింది. తాజాగా ఆ ఉత్తర్వులను ఈ నెల 24 వరకు పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం జరిగిన విచారణలో చెన్నమనేని రమేశ్ ఇప్పటికీ జర్మనీ పాస్‌పోర్టుతోనే విదేశాలకు వెళ్లినట్లు కేంద్ర హోంశాఖ కోర్టుకు తెలిపింది. తద్వారా రమేష్ జర్మనీ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని పేర్కొంది. దీంతో భారత పౌరసత్వం ఉందని చెప్తూనే జర్మనీ పాస్పోర్టుతో ఎందుకు వెళ్లావని న్యాయస్థానం చెన్నమనేనిని ప్రశ్నించింది.(చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో ఊరట) దీనికి ఆయన స్పందిస్తూ జర్మనీ పౌరసత్వం ఎప్పుడో రద్దు చేసుకున్నట్లు తెలిపారు. ‘జర్మనీ సిటిజన్‌షిప్ వదులుకున్నారా? అందుకు జర్మనీ ప్రభుత్వం ఆమోదించిందా?’ అని హైకోర్టు వరుస ప్రశ్నలు సంధించింది. అనంతరం జర్మనీ పౌరసత్వం రద్దు చేసుకున్నట్లు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చెన్నమనేనికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. కాగా వాస్తవాలు దాచి మోసపూరిత విధానాల ద్వారా చెన్నమనేని రమేశ్ భారతీయ పౌరసత్వం పొందినట్లు నిర్ధారించి.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గతేడాది నవంబర్ 20న అతని పౌరసత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. (చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దు) -
చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దుపై స్టేను హైకోర్టు మరో 8 వారాలు పొడిగించింది. పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు గత నవంబర్‌లో స్టే ఇచ్చింది. ఆ ఉత్తర్వులను తాజాగా పొడిగిస్తూ న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం ఆదేశాలు జారీ చేశారు. రమేశ్ జర్మనీ పౌరసత్వం రద్దయిందో లేదో తెలపాలని కేంద్రాన్ని ఆదేశించారు. విచారణ 4 వారాలకు వాయిదా వేశారు. వాస్తవాలు దాచి మోసపూరిత విధానాల ద్వారా రమేశ్ భారతీయ పౌరసత్వం పొందినట్లు నిర్ధారించి.. భారత పౌరసత్వ చట్టం ప్రకారం పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
చెన్నమనేనికి హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ తీసుకున్న నిర్ణయం అమలును 4 వారాలపాటు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తన పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఈనెల 20 జారీ చేసిన ఉత్తర్వులను ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం విచారించారు. భారత పౌరసత్వ చట్టం–1955లోని సెక్షన్ 10 ప్రకారం చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేయడం చెల్లదని ఆయన న్యాయవాది వాదించారు. కేంద్ర హోం శాఖ 2017 డిసెంబర్ 13న జారీ చేసిన ఆదేశాల తరహాలో తిరిగి సాంకేతికంగానే నిర్ణయం తీసుకుందన్నారు. 2017 నాటి రివ్యూ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిందని, అప్పుడు జారీ చేసిన ఉత్తర్వులను కేంద్రం పట్టించుకోలేదని నివేదించారు. మళ్లీ అదే తరహాలో రద్దు నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. పాస్‌పోర్టు చట్టంలోని సెక్షన్10ని ఉల్లంఘిస్తేనే పౌరసత్వం రద్దు చేయడానికి వీల్లేదని అదే చట్టంలోని సెక్షన్ 10(3) స్పష్టం చేస్తోందని తెలిపారు. భారత పౌర సత్వం కోసం 2008 మార్చి 31న చెన్నమనేని దరఖాస్తు చేసుకుంటే 2009 ఫిబ్రవరి 3న పౌర సత్వం వచ్చిందని, ఈ మధ్యకాలంలో చెన్నమనేని జర్మనీలో పది మాసాలు ఉంటే, భారత్‌లో కేవలం 2 నెలలే ఉన్నారని కేంద్రం తరఫు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్‌రావు వాదించారు. చెన్నమనేని పౌరసత్వ రద్దు నిర్ణయంపై జోక్యం చేసుకోవాల్సినదేమీ లేదని, ఇదే విధంగా 2009 నుంచి ఆయన వాదిస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చేతిలో ఓడిపోయిన ఆదిశ్రీనివాస్ తరఫు న్యాయవాది పేర్కొ న్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి చెన్నమనేని పౌరసత్వం కోసం చేసుకున్న దరఖాస్తు, దానిపై జరిగిన లావాదేవీల ఫైళ్లను తమ ముందుంచాలని కేంద్ర హోంశాఖను ఆదేశించారు. అనంతరం విచారణను డిసెంబర్ 16కి వాయిదా వేశారు. -
పౌరసత్వ రద్దును సవాల్ చేసిన చెన్నమనేని
సాక్షి, హైదరాబాద్: తన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ బుధవారం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టును కోరారు. భారత పౌరసత్వ చట్టం–1955లోని సెక్షన్ 10 ప్రకారం ఆయన పౌరసత్వాన్ని రద్దు చేయడాన్ని సవాల్ చేశారు. కేంద్ర హోం శాఖ 2017 డిసెంబర్ 13న జారీ చేసిన ఆదేశాల తరహాలోనే తాజా ఉత్తర్వులు ఉన్నాయని, పూర్తిగా సాంకేతికంగానే కేంద్ర హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. 2017 నాటి రివ్యూ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిందని అదే తరహాలో తిరిగి జారీ చేసిన పౌరసత్వ రద్దు ఉత్తర్వులను కూడా కొట్టేయాలని కోరారు. గతంలో హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయకుండానే సాంకేతికంగా ఉత్తర్వులు ఇవ్వడం చెల్లదని పేర్కొన్నారు. పౌరసత్వం రద్దుపై చెన్నమనేని హైకోర్టును ఆశ్రయిస్తే తనకు సమాచారం ఇవ్వాలని, తమ వాదనలు కూడా వినాలని కోరుతూ.. కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ హైకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. -
చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దు
సాక్షి, న్యూఢిల్లీ/ కరీంనగర్:పౌరసత్వం వివాదంలో వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. భారత పౌరసత్వానికి ఆయన అనర్హుడని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. పౌరసత్వాన్ని పొందేందుకు ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ 2009 నుంచి న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. తప్పుడు ధ్రువపత్రాలతో మన దేశ పౌరసత్వం పొందినందున రమేశ్ ఎన్నిక చెల్లదంటూ ఆది వాదిస్తూ వస్తున్నారు. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖ మరోసారి విచారణ జరిపి, తాజాగా తన నిర్ణయాన్ని వెలువరించింది. తప్పుడు సమాచారం ఇచ్చారు.. ‘‘భారత పౌరసత్వం కోసం చెన్నమనేని రమేశ్ 31.03.2008న దరఖాస్తు చేసుకున్నారు. సెక్షన్ 5 (1) (ఎఫ్) ప్రకారం దరఖాస్తుదారు దరఖాస్తు చేసుకోవడానికి ముందు ఏడాది పాటు భారతదేశంలో నివసించి ఉండాలి. ఈ విషయంలో ఆయన తప్పుడు సమాచారం ఇచ్చారు. 21.11.2008న గత 12 నెలల్లో విదేశాలకు వెళ్లిన వివరాలను సమర్పించాలని హోంశాఖ ఆయన్ను కోరగా.. తాను విదేశాలకు వెళ్లలేదని 27.11.2008న రమేశ్ బదులిచ్చారు. ఈ నేపథ్యంలో 04.02.2009న ఆయనకు కేంద్ర హోంశాఖ భారత పౌరసత్వాన్ని ఇచ్చింది. దీనిపై ఆది శ్రీనివాస్ 15.06.2009న రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. భద్రతా సంస్థల నివేదిక ప్రకారం రమేశ్ 01.03.2007 నుంచి 26.11.2007 వరకు, 20.12.2007 నుంచి 28.02.2008 వరకు విదేశాల్లో ఉన్నారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక లేఖ ద్వారా 01.09.2009న ధ్రువీకరించింది. పౌరసత్వ చట్టం సెక్షన్ 10(5) పరిధిలో ఒక విచారణ కమిటీని నియమించగా.. ఆ కమిటీ 10.03.2017న తన నివేదిక సమర్పించింది. జర్మనీకి వెళ్లిన విషయాన్ని రమేశ్ నిజాయతీగా వెల్లడించలేదని, 27.11.2008న తప్పుడు సమాచారం ఇచ్చారని కమిటీ నిర్ణయానికి వచ్చింది. రమేశ్ భారత ప్రభుత్వాన్ని మోసగించడం ద్వారా పౌరసత్వాన్ని పొందారని తేలింది’’అని హోంశాఖ పేర్కొంది. రమేశ్ తప్పుడు అభ్యర్థన చేశారని, వాస్తవాలను మరుగున పెట్టారని, పౌరసత్వ దరఖాస్తుకు ముందు చేసిన విదేశీ పర్యటనలను దాచి ఉంచినట్టు వెల్లడైందని వివరించింది. వాస్తవాలను మరుగుపరచడం, తప్పుడు సమాచారం ద్వారా పౌరసత్వం పొందితే సెక్షన్ 10(2) వర్తిస్తుందని, అంటే ఆయన పౌరసత్వం తొలగించాల్సి వస్తుందని తెలిపింది. ఉదాహరణగా ఉండాల్సిన వారు ఇలా చేస్తే? ‘‘తాను ప్రజాసేవలో ఉన్నందున సెక్షన్ 10(3)ను పరిగణనలోకి తీసుకోవాలని చెన్నమనేని అభ్యర్థించారు. తాను సిట్టింగ్ ఎమ్మెల్యేనని, ఎలాంటి నేరచరిత్ర లేదని, క్రిమినల్ కేసు లేదని, తీవ్రవాదం వంటి వ్యవస్థీకృత నేరాలకు పాల్పడలేదని పేర్కొన్నారు. అయితే, తప్పుడు సమాచారం ఇవ్వడం, వాస్తవాలను దాచిపెట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు. దరఖాస్తు నాటికి ఏడాది ముందు కాలం పాటు పూర్తిగా భారతదేశంలో నివసించలేదని సమాచారం ఇచ్చి ఉంటే అధీకృత యంత్రాంగం ఆయనకు పౌరసత్వం ఇచ్చి ఉండేది కాదు. ఒక ప్రజాప్రతినిధిగా ఆయన ఇచ్చే సమాచారం సరైనదిగా ఉండాలి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజలకు ఆయన ప్రవర్తన ఉదాహరణగా ఉండాలి. ఒక వ్యక్తి దేశ పౌరసత్వం పొందేందుకు తప్పుడు సమాచారం ఇచ్చారంటే, సమాజానికి సదరు వ్యక్తి చేసే మంచిని ఊహించగలం. నేరారోపణలు లేనంత మాత్రాన తప్పుడు సమాచారం ఇవ్వడం మంచి చేయడానికే అని అర్థం కాదు. ప్రజాప్రతినిధిగా ఉండి అసత్య సమాచారం ఇవ్వడం ప్రజాశ్రేయస్సుకు మంచిది కాదు. ఆయన ఎలాంటి నేరాలకు పాల్పడలేదని భావించి పౌరసత్వాన్ని కొనసాగిస్తే ఇదొక ఉదాహరణగా మారి మరికొందరు ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి పౌరసత్వాన్ని పొందుతారు. వీటన్నింటి దృష్ట్యా ఆయన భారత దేశపౌరుడిగా కొనసాగడం ప్రజాశ్రేయస్సుకు దోహదం చేయదని నిర్ణయించి, రమేష్ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నాం’’అని హోంశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. పదేళ్ల న్యాయ పోరాటం చివరికి ఇలా... రమేశ్‌బాబు పౌరసత్వాన్ని సవాల్ చేస్తూ ఆయన ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ 2009 జూన్‌లో కేంద్ర హోంశాఖలో ఫిర్యాదు చేశారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్పీ విచారణ జరిపి, రమేశ్ కేవలం 96 రోజులు మాత్రమే భారతదేశంలో ఉన్నారని నివేదిక సమర్పించారు. 2010 ఉప ఎన్నికల అనంతరం రమేశ్‌బాబు ఎన్నికను సవాల్ చేస్తూ ఆది శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. 2013 ఆగస్టు 14న రమేశ్‌బాబు పౌరసత్వం రద్దు చేయడమే కాకుండా ఓటరు జాబితాలో పేరు తొలగించాలని తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రమేశ్‌బాబు 2013లో సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ నుంచి మళ్లీ ఈ వ్యవహారం కేంద్ర హోంశాఖకు మారింది. రమేశ్‌బాబు విజ్ఞప్తి మేరకు కేంద్ర హోంశాఖ ఏర్పాటు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ కూడా ఆయన మోసపూరితంగా భారత పౌరసత్వం పొందారని తేల్చి చెప్పింది. దీంతో 2017 ఆగస్టు 31న రమేశ్‌బాబు పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు హోంశాఖ ప్రకటించింది. అయితే, తాను ప్రజలకు సేవలు అందిస్తున్నానని, తన పౌరసత్వం కొనసాగించాలని మరోసారి ఆయన హోంశాఖను కోరారు. అనంతరం 2018 జనవరి 5న మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు స్టే ఇవ్వగా.. దానిని ఎత్తివేయాలని కోరుతూ ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు 2019 జూలై 10న రమేశ్‌బాబు పౌరసత్వాన్ని కేంద్ర హోంశాఖ మూడు మాసాల్లో తేల్చాలని ఆదేశించింది. మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తా: చెన్నమనేని తన పౌరసత్వ పరిరక్షణకు మరోమారు హైకోర్టును ఆశ్రయిస్తానని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ తెలిపారు. ఈ ఏడాది జూలై 15న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను హోంశాఖ పరిగణనలోకి తీసుకోకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు. ‘నా పౌరసత్వాన్ని 2017లో హోంశాఖ రద్దు చేసిన తరువాత హైకోర్టు వెంటనే స్టే మంజూరు చేసింది. సుదీర్ఘ వాదనల తర్వాత ఈ ఏడాది జూలై 15న నా పౌరసత్వాన్ని రద్దు చేయడాన్ని కొట్టివేసింది. పౌరసత్వ చట్టం, వాటి నియమ నిబంధనలు, దరఖాస్తులను సమగ్రంగా హేతుబద్దంగా, నైతిక విలువలు, వ్యక్తి సామాజిక నిబద్దతను పరిగణిస్తూ (సెక్షన్ 10.3) చూడాలి తప్ప, సాంకేతికంగా విడదీసి విశ్లేషించరాదని తన 25 పేజీల తీర్పులో హైకోర్టు స్పష్టంచేసింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని హోంశాఖను ఆదేశించింది. ఒకవేళ సెక్షన్ 10.3ని పరిగణించకుండా.. ఏ నిర్ణయం వచ్చినా న్యాయం కోసం మళ్లీ తమ వద్దకు రావచ్చని చెప్పింది. హైకోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్ 31న మరోమారు ఢిల్లీలో హోంమంత్రిత్వ శాఖ వద్ద వాదనలు జరిగాయి. అయితే హైకోర్టు తీర్పులో పేర్కొన్న ఆదేశాలను హోంశాఖ పరిగణనలోకి తీసుకోకపోవడం శోచనీయం. పౌరసత్వ పరిరక్షణకు మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తా. తప్పక న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది’అని చెన్నమనేని పేర్కొన్నారు. న్యాయం గెలిచింది: ఆది శ్రీనివాస్ రమేశ్‌బాబు భారతదేశ పౌరుడు కాదని తాను మొదటినుంచీ చెబుతూనే ఉన్నానని, ఇన్నాళ్లకు న్యాయం గెలిచిందని వేములవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. మచ్చలేని నాయకుడనని చెప్పుకుంటున్న రమేశ్‌బాబు ఈ దేశ పౌరుడు కాదని కేంద్ర హోంశాఖ ప్రకటించిందని, ఈ అంశాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. ‘ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని నేను దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ న్యాయస్థానంలో ఉంది. గతంలో వచ్చిన తీర్పుల ప్రకారం ఎన్నికైన ప్రజాప్రతినిధి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడి ఆ పదవిలోకి వస్తే సమీప ప్రత్యర్థిని విజేతగా ప్రకటించారు. ఇక్కడ కూడా అదే వర్తిస్తుందని భావిస్తున్నా’అని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. వేటా.. చెల్లుబాటా? రమేశ్ భారత పౌరసత్వం రద్దు చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసిన నేప థ్యంలో, ఆయన ఎమ్మెల్యే పదవిలో కొనసాగడంపై ఉత్కంఠ నెలకొంది. హోం శాఖ నిర్ణ యం నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతారా, సమీప ప్రత్యర్థిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తారా అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అనర్హత వేటు పడితే ఉపఎన్నిక జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అయితే హోంశాఖ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మరోమారు హైకో ర్టును ఆశ్రయిస్తానని రమేశ్ ప్రకటించిన నేపథ్యంలో, ఎమ్మెల్యేగా ఆయన భవితవ్యంపై స్పష్టత వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రమేశ్ తర్వాత టీఆర్ఎస్లో చేరి 2010 ఉప ఎన్నికతో పాటు 2014, 2018 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించారు. భారతీయుడైన రమేశ్ 1993లో జర్మనీ పౌరసత్వాన్ని స్వీకరించగా, 2008 మార్చి 31న తిరిగి భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు.