సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టులో వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ గతంలో దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా చెన్నమనేని రమేష్‌కు హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది.
ఇన్ని రోజులు చెన్నమనేని రమేష్ ఏ పాస్ పోర్ట్ మీద ట్రావెల్ చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. అందుకు జర్మనీ పాస్ పోర్ట్ మీద ట్రావెల్ చేశారని చెన్నమనేని తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇప్పటికి జర్మనీ పాస్ పోర్ట్ ఉందని తెలిపిన న్యాయవాది.. పాస్ పోర్ట్ ప్రామాణికం కాదని విన్నవించారు.
వెంటనే ఇండియన్ పాస్ పోర్ట్ ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. లేదని చెన్నమనేని తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం, అన్ని వాదనలు పరిగణలోకి తీసుకుంటామంటూ తీర్పును ఈ రోజు వాయిదా వేసింది. తుది తీర్పు త్వరలోనే వెలువరిస్తామని తెలంగాణ హైకోర్టు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment