
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పౌరసత్వంపై ఆయన వేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ సందర్భంగా రమేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఆయనకు 30 లక్షలు జరిమానా విధించింది.
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. పౌరసత్వం విషయంలో రమేష్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. పదిన్నర సంవత్సరాల పాటు ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చెన్నమనేనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాదనల సందర్బంగా కోర్టును తప్పుదోవ పట్టించినందుకు హైకోర్టు సీరియస్ అయ్యింది. ఆయన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్టు తెలిపింది. రమేష్ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు.. ఫేక్ డాక్యుమెంట్స్ సమర్పించారు. కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.
జర్మనీ పౌరసత్వంతోనే ఆయన అక్కడికి వెళ్లారని కోర్టు తెలిపింది. దీంతో, చెన్నమనేనికి రూ.30 లక్షలు జరిమానా విధించింది. జరిమానాలో రూ.25 లక్షలు కాంగ్రెస్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఇవ్వాలని తెలిపింది. మిగిలిన రూ.5లక్షలను హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశం. నెల రోజుల్లో చెల్లింపులు పూర్తిచేయాలని చెన్నమనేనికి సూచించింది.

Comments
Please login to add a commentAdd a comment