సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. లగచర్ల ఘటన తన రిమాండ్‌ను సవాల్ చేస్తూ నరేందర్ రెడ్డి.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
తన రిమాండ్‌ను క్వాష్ చేయాలని ఆయన పిటిషన్ కోరారు. ఈ నేపథ్యంలో పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్‌ను తాజాగా తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఇక, లగచర్ల ఘటనకు సంబంధించిన కేసులో నరేందర్ రెడ్డి ఏ1గా ఉన్న విషయం తెలిసిందే. నరేందర్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. ఇదే సమయంలో పట్నం బెయిల్‌పై మెరిట్ ఆధారంగా వికారాబాద్ కోర్టు నిర్ణయం తీసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment