
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు ఊరట లభించింది. పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో హరీష్‌పై నమోదైన కేసులో ఆయనను అరెస్ట్ చేయవద్దంటూ కోర్టు ఆదేశించింది.
వివరాల ప్రకరారం.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన కేసుపై ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్బంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హరీష్‌ను పోలీసులు అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. నోటీసులు ఇచ్చి విచారించుకోవచ్చు అని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment