quash petetion
-
హైకోర్టులో ఎదురుదెబ్బ..స్పందించిన కేటీఆర్
సాక్షి,హైదరాబాద్:ఫార్ములా-ఈ కార్ రేసుల కేసులో తన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన తర్వాత కేటీఆర్ తొలిసారి స్పందించారు. ఈ విషయమై మంగళవారం(జనవరి 7) కేటీఆర్ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. ‘నా మాటలను నమ్మండి, ఈ ఎదురుదెబ్బ కంటే నా పునరాగమనం బలంగా ఉంటుంది.మీ అబద్ధాలు నన్ను విచ్ఛిన్నం చేయవు. నేటి అడ్డంకులు రేపటి విజయానికి దారి తీస్తాయి. సత్యం..కాలంతో పాటు ప్రకాశిస్తుంది.నేటి అడ్డంకులు రేపటి విజయానికి దారి తీస్తాయి.మన న్యాయవ్యవస్థను గౌరవిస్తాను. న్యాయం గెలుస్తుందనే అచంచలమైన నమ్మకం నాకుంది. సత్యం కోసం నా పోరాటం కొనసాగుతుంది. ప్రపంచమే దీనికి సాక్ష్యంగా నిలుస్తుంది’అని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు.Mark my words, Our comeback will be stronger than this setback Your lies won't shatter meYour words won't diminish meYour actions won't obscure my visionThis cacophony won't silence me!Today's obstacles will give way to tomorrow's triumph.Truth will shine brighter with…— KTR (@KTRBRS) January 7, 2025మరోవైపు క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంపై కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారని సమాచారం. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఎలాంటి నిర్ణయం వెలువరించే ముందైనా తమ వాదన వినాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఇదీ చదవండి: కేటీఆర్‌కు మరోసారి ‘ఈడీ’ నోటీసులు -
అప్పటి వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దు : హైకోర్టు
సాక్షి,హైదరాబాద్ : ఫార్ములా-ఈ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు ప్రకటించే వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం ఉదయం కేటీఆర్ తరుఫు న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు విన్న కోర్టు మధ్యాహ్నం నుంచి ఏసీబీ తరుఫు వాదనల్ని వింటోంది.ఏసీబీ తరుఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు ప్రారంభించారుఈ కార్ రేసు కేసు విచారణ పురోగతి ఏంటని.. ఏజీ సుదర్శన్‌రెడ్డిని ప్రశ్నించిన జస్టిస్ లక్ష్మణ్ఫిర్యాదుదారు స్టేట్మెంట్ రికార్డ్ పూర్తైందన్న ఏజీఏసీబీ విచారణ కొనసాగుతోందని తెలిపిన ఏజీనగదు బదిలీ పై ప్రోజీర్ ఫాల్ కాలేదన్న ఏసీబీ తరుపు వాదనలుబిజినెస్ రూల్స్ కాపీ అడిగిన న్యాయమూర్తిరూల్స్ కాపీని అందించిన ఏసీబీ న్యాయవాదిఈడీ సైతం నోటీసులు జారీ చేసిందని తెలిపిన ఏసీబీ న్యాయవాది FEO తో అగ్రిమెంట్ చేసుకున్నారు .. కానీ దాని ద్వారా ఎలా లాభాలు వస్తాయో చెప్పలేదు .. AG సుదర్శన్ రెడ్డిమూడు దఫాలుగా నగదు బదిలీ చేశారు55 కోట్లు ఎలాంటి అనుమతులు లేకుండా FEO కి బదిలీ చేశారుఏసీబీ దర్యాప్తు ఎక్కడ వరకు వచ్చింది - హైకోర్టుఈ కేసులో ఎంత మంది స్టేట్మెంట్ రికార్డ్ చేశారు - హైకోర్టుఇప్పటి వరకు ఫిర్యాదు దారుడు దాన కిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశామన్న ప్రభుత్వ తరుఫు న్యాయ వాదిఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఎలాంటి ఆధారాలు సేకరించారని ప్రశ్నించిన న్యాయస్థానంకేసు విచారణ కొనసాగుతుంది .. విచారణ దశలో అన్ని ఆధారాలు బయట పడుతాయన్న ప్రభుత్వ తరుఫు న్యాయ వాదికేటీఆర్ తరుపున న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు ప్రారంభంఅవినీతి జరిగిందని ఏసీబీ అధికారులు సెక్షన్లు పెట్టారు ఎక్కడ, ఎలా జరిగిందో మాత్రం పేర్కొనలేదులబ్ధి చేకూర్చినట్లు చెబుతున్న సంస్థపై కేసు పెట్టలేదుబిజినెస్ రూల్స్ ఉల్లంఘన అని చెబుతున్నారు..ప్రతి ఉల్లంఘన క్రిమినల్ నేరం కిందకు రాదన్న దవేదర్యాప్తు ప్రారంభ దశలోనే ఉందన్న ఏజీఫిర్యాదుదారు స్టేట్మెంట్ రికార్డు చేశాంవిచారణలో నిందితులను చేరవచ్చు.. తొలగించవచ్చుఆ అధికారం దర్యాప్తు సంస్థలకు ఉంటుందిబిజినెస్ రూల్స్‌ను ఉల్లంఘించి నగదు బదిలీ చేశారుపారెన్ కరెన్సీలో చెల్లింపులు నిబంధనలకు విరుద్ధమన్న ఏజీ3 గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగిన వాదనలుకేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు పూర్తి..తీర్పు రీజర్వ్ చేసిన హైకోర్టు.తీర్పు ప్రకటించే వరకు కేటీఆర్ అరెస్ట్ చెయ్యొద్దన్న హైకోర్టుఏసీబీ దర్యాప్తు చేయోచ్చు తీర్పు వెలువరించే వరకు... కేటీఆర్ అరెస్టు వద్దుమధ్యంతర ఉత్తర్వులను పొడిగించిన హైకోర్టుఫార్పులా ఈ కార్ రేసింగ్ కేసుపై ముగిసిన వాదనలుతీర్పు రిజర్వు చేసిన జస్టిస్ కె.లక్ష్మణ్క్వాష్ పిటిషన్‌పై ముగిసిన కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు..మధ్యాహ్నం లంచ్ బబ్రేక్ తర్వాత ఏసీబీ న్యాయవాది వాదనలు కేటీఆర్ న్యాయవాది దవే వాదనలుకేటీఆర్ ఈ కేసులో లబ్ధి పొందినట్లు ఎఫ్ఐఆర్లో ఎక్కడా లేదుఈ కేసులో అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు వర్తించవుఫార్ములా- ఈ రేసుల సీజన్ 10 నిర్వహణ కోసం మంత్రిగా కేటీఆర్ అనుమతులిచ్చారుకొత్తగా వచ్చిన బీఎన్ఎస్ చట్టం కాకుండా ఐపీసీ సెక్షన్లు ఎందుకున్నాయని ప్రశ్నించిన హైకోర్టు14 నెలల క్రితం నేరం జరిగింది కాబట్టి పాత చట్టం ప్రకారం కేసు నమోదు చేశారని తెలిపిన కేటీఆర్ తరఫున న్యాయవాది దవేఐపీసీ 409పై కొనసాగుతున్న వాదనలుకేటీఆర్ ఎఫ్ఈవోతో జరిగిన ఒప్పందం ఎలాంటి లాభం పొందలేదుఅసలు ఈ కేసులో ఐపీసీ 409 సెక్షన్ వర్తించదు.. ఆధారాలు కూడా లేవుఫార్ములా ఈ రేసుల ఆపరేషన్స్ ఎఫ్ఈఓ చేసినందున వాళ్లను ఎందుకు ఎఫ్ఐఆర్లో చేర్చలేదుఈ కేసులో నిందితుడు కేటీఆర్ చేర్చినప్పుడు ఎఫ్ఈఓను కూడా చేర్చాలి కదాఎఫ్ఈఓతో అగ్రీమెంట్ పై సంతకం చేసింది అరవింద్ కుమార్ కేటీఆర్ కాదుఫార్ములా-ఈ కేసు: కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై విచారణ ప్రారంభంహైకోర్టులో ప్రారంభమైన కేటీఆర్ పిటిషన్‌పై విచారణ కేటీఆర్ తరపున వాదనలు వినిపిస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ దవేనేటితో ముగియనున్న కేటీఆర్ నాట్ టు అరెస్టు గడువు ఫార్ములా-ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైకోర్టు ఇచ్చిన ఊరట ‘నాట్ టు అరెస్ట్’ గడువు మంగళవారం(డిసెంబర్31)తో ముగియనుంది. కేసును హైకోర్టు నేడు తిరిగి విచారించనుంది. ఎఫ్ఐఆర్ కొట్టేయాలంటూ కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పై ఏసీబీ ఇప్పటికే కౌంటర్ దాఖలుచేసింది. కేటీఆర్ పిటిషన్‌కు విచారణార్హత లేదని ఏసీబీ కౌంటర్లో పేర్కొంది.కేటీఆర్ ఆదేశాలతోనే ఎఫ్ఈఓ కంపెనీకి నిధుల బదిలీ జరిగిందని తెలిపింది. అన్ని అనుమతులు తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదుచేశామని పేర్కొంది. విచారణ ప్రాధమిక దశలో ఉన్నందున బెయిల్, క్వాష్ ఊరట ఇవ్వొద్దని ఏసీబీ కోర్టును కోరింది. ఏసీబీ కౌంటర్‌పై హైకోర్టులో కేటీఆర్ కౌంటర్ అఫిడవిట్ దాఖలుచేశారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని తెలిపారు.మంత్రిగా నిధుల బదిలీ మంత్రిగా తనకు సంబంధం లేని వ్యవహారమని పేర్కొన్నారు. విదేశీ సంస్థలకు నిధుల బదిలీ అనుమతి బ్యాంక్‌కు చెందిన అంశమని తెలిపారు. రాజకీయ కక్ష సాదింపుతో తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు. కాగా, ఈడీ సైతం ఈ కేసులో కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. జనవరి 7న కేటీఆర్ విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో కోరింది. -
హైకోర్టులో హరీష్ రావుకు ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు ఊరట లభించింది. పంజాగుట్ట పోలీసు స్టేషన్లో హరీష్‌పై నమోదైన కేసులో ఆయనను అరెస్ట్ చేయవద్దంటూ కోర్టు ఆదేశించింది.వివరాల ప్రకరారం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన కేసుపై ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్బంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హరీష్‌ను పోలీసులు అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. నోటీసులు ఇచ్చి విచారించుకోవచ్చు అని తెలిపింది. -
చిక్కుల్లో నటుడు దిలీప్.. హైకోర్టు షాక్
మలయాళ స్టార్ నటుడు దిలీప్‌కు కేరళ హైకోర్టు షాక్ ఇచ్చింది. తనకు వ్యతిరేకంగా దాఖలైన హత్య కుట్ర కేసును కొట్టేయాలంటూ దిలీప్ దాఖలు చేసిన అభ్యర్థన పిటిషన్‌ను మంగళవారం కొట్టేసింది. మలయాళ ప్రముఖ నటి లైంగిక వేధింపుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దిలీప్ తాజా అభ్యర్థనను హైకోర్టు జస్టిస్ జియాద్ రెహమాన్ తోసిపుచ్చారు. ఈ కేసులో విచారణ జరిపిన ఓ అధికారి ఫిర్యాదు మేరకు.. క్రైమ్ బ్రాంచ్ ఈ ఏడాది జనవరి 9వ తేదీన మరో కేసు నమోదు చేసింది. విచారణ అధికారులను హత్య చేయాలని దిలీప్ కుట్ర పన్నాడంటూ అందులో అభియోగం నమోదు చేశారు. హత్య చేయాలనే.. దిలీప్ గొంతుగా భావిస్తున్న ఆడియో క్లిప్ ఒకటి ఆ మధ్య ఓ టీవీ ఛానెల్లో టెలికాస్ట్ అయ్యింది. దానిని ఆయన సన్నిహితుడు బాలచంద్ర కుమార్ బయటపెట్టడం విశేషం. అందులో ఈ కేసులో విచారణ చేపట్టిన అధికారులకు హాని తలపెట్టాలన్న ఆలోచనతో దిలీప్ ఉన్నట్లు స్పష్టమైంది. దీంతో క్రైమ్ బ్రాంచ్ హత్య కుట్ర నేరం మీద కేసు నమోదు చేశారు. అంతేకాదు.. దిలీప్ మాజీ భార్య, నటి మంజు వారియర్‌ను సైతం క్రైమ్ బ్రాంచ్ వాయిస్ కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించింది. ఆ ఫోన్ సంభాషణల్లో దిలీప్‌తో పాటు దిలీప్ కుటుంబ సభ్యులకు చెందిన మరో ఇద్దరి గొంతులను మంజు గుర్తుపట్టింది. ఈ తరుణంలో ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. హత్య కుట్ర కేసు కొట్టేయాలంటూ దిలీప్ దాఖలు చేసిన అభ్యర్థనను కొట్టేసింది. మరోవైపు దిలీప్ బెయిల్ రద్దు చేయాలని, దిలీప్ బయట ఉంటే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కేరళ క్రైమ్ బ్రాంచ్, కేరళ పోలీసులు కోర్టును కోరుతున్నారు. ఈ పిటిషన్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. 2017 కేరళ నటి దాడి కేసు 2017, ఫిబ్రవరి 17వ తేదీ రాత్రిపూట మలయాళంతో పాటు సౌత్‌లోని పలు భాషల్లో నటించిన ఓ హీరోయిన్ను బలవంతంగా ఎత్తుకెళ్లి, కారులోనే రెండు గంటలపాటు వేధింపులకు పాల్పడ్డారు కొందరు దుండగులు. ఆపై ఆ వేధింపుల పర్వాన్ని ఫోన్లలో రికార్డు చేసి.. బ్లాక్‌మెయిల్‌కు పాల్పడాలని చూశారు. ఈ కేసులో దిలీప్‌తో పాటు పది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆపై బెయిల్‌పై విడుదల చేశారు. -
‘బిగ్ బాస్’పై మరో వివాదం
సాక్షి, హైదరాబాద్ : తెలుగులో రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకొని మూడో సీజన్లోకి అడుగిడుతున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్’.కి ఆదిలోనే అవాంతరాలు ఏర్పడుతున్నాయి. షో ప్రసారం కాకముందే వివాదాలు చుట్టుముట్టాయి. ఇప్పటికే ఈ షో నిర్వాహకులపై యాంకర్, జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రియాల్టీ షోపై మరో పిటిషన్ దాఖలైంది. షో హోస్ట్ నాగార్జునతో పాటు మరో 10 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ పిల్ దాఖలైంది. ఈ షోలో అభ్యంతరకర సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని, అందుకే సినిమాలాగే ప్రతి ఎపిసోడ్‌ను సెన్సార్ చేసి ప్రసారం చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా రాత్రి 11 గంటల తర్వాతే బిగ్‌బాస్ 3 షో ప్రసారం చేయాలంటూ పిటిషినర్ కోరినట్లుగా తెలుస్తోంది. (చదవండి : గాయత్రీ గుప్తా ఫిర్యాదుపై దర్యాప్తు) హైకోర్టును ఆశ్రయించిన ‘బిగ్‌బాస్’ టీం బిగ్‌బాస్ షో కోఆర్డీనేషన్ టీం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ షోపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో మంగళవారం క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. ‘బిగ్‌బాస్ 3’ పై బంజారాహిల్స్, రాయదుర్గం పోలీసు స్టేషన్లతో నమోదైన కేసులను వెంటనే కొట్టివేయాలని పిటిషన్లో పేర్కొంది. కాగా బిగ్‌బాస్ టీం దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను అనుమతించొద్దంటూ జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా హైకోర్టు వద్ద నిరసనకు దిగారు. -
క్వాష్ పిటిషన్ ఎప్పుడు వేస్తారు?
-
క్వాష్ పిటిషన్ ఎప్పుడు వేస్తారు?
ఏసీబీ కోర్టులో తన మీద విచారణ జరగకుండా ఆపాలంటూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సాధారణంగా ఆ కేసుతో తనకు ఏమాత్రం సంబంధం లేకున్నా.. తప్పుడు ఆరోపణలున్నా క్వాష్ పిటిషన్ వేస్తారు. కేసులో తనకు సంబంధం లేకున్నా ఇన్వాల్వ్ చేశారని వాదిస్తారు. సిఆర్‌పిసిలోని సెక్షన్ 482 కింద దాఖలు చేసే క్వాష్ పిటిషన్‌ను కేవలం హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో మాత్రమే వేస్తారు. అయితే, ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా పక్కాగా సాక్ష్యాధారాలు ఉన్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఓటుకు కోట్లు కేసులో స్టీఫెన్సన్కు రేవంత్ డబ్బులు ఇస్తూ దొరికిపోవడం, దీంట్లో సహ నిందితుడిగా అరెస్టయిన సెబాస్టియన్ సెల్ ఫోన్లో సంభాషణలు దొరకడం, ఆ సంభాషణల్లో చంద్రబాబు నేరుగా స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్టు నిర్దారణ కావడం సంచలనం సృష్టించింది. ఆ టేపుల్లో ఉన్న గొంతు కూడా చంద్రబాబుదేనని తాజాగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లు నిర్ధారించాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో చంద్రబాబు మాట్లాడిన స్వరాన్ని, టేపుల్లో మనవాళ్లు దే బ్రీఫ్డ్ మీ అంటూ మాట్లాడిన స్వరాన్ని పోల్చి రెండూ ఒకటేనని తేల్చింది. ఫోరెన్సిక్ నివేదికతో ఈ టేపులు ఓ కీలక సాక్ష్యంగా మారాయి. దాంతో కేసుకు సూత్రధారి చంద్రబాబు అనే అభిప్రాయం వ్యక్తమైంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే చంద్రబాబు క్వాష్ పిటిషన్‌తో హైకోర్టు ముందుకొచ్చారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ నేపథ్యంలో .. ఏసీబీ కోర్టు ఉత్తర్వుల్లో ఏముందున్నది ఆసక్తికరంగా మారింది. గత సోమవారం వచ్చిన ఏసీబీ కోర్టు ఉత్తర్వులు చాలా స్పష్టంగా, సూటిగా ఉన్నాయి. ఉత్తర్వుల్లో ఎక్కడా ఎవరి పేరునూ పేర్కొనలేదు. తమ ముందు దాఖలైన పిటిషన్లో పిటిషన్ దారు కొన్ని సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచారని, అవి నిజమైనవంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన ధ్రువీకరణను ఇచ్చారని, వాటిని సంబంధిత పోలీసు అధికారులకు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాక్ష్యాలను పరీక్షించి, వాటిపై దర్యాప్తు చేసి, విచారణ నివేదికను నెల రోజుల్లోగా కోర్టుకు సమర్పించాలని సూచించారు. దీంట్లో చంద్రబాబు పేరు ఎక్కడా పేర్కొనలేదు. ఈ సమయంలో ఏసీబీ కోర్టు ఆదేశాలను నిలిపివేయాలంటూ చంద్రబాబు కోరడం కోర్టుల ముందు నిలబడదన్నది న్యాయనిపుణుల వాదన. ఉత్తర్వుల్లో పోలీసులను దర్యాప్తు చేయాలని చెప్పారే కానీ చంద్రబాబు పేరు పేర్కొనలేదని, అలాంటప్పుడు కేసు ఎలా నిలబడుతుందని న్యాయ నిపుణులు అంటారు.