సాక్షి,హైదరాబాద్ : ఫార్ములా-ఈ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు ప్రకటించే వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.
- మంగళవారం ఉదయం కేటీఆర్ తరుఫు న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు విన్న కోర్టు మధ్యాహ్నం నుంచి ఏసీబీ తరుఫు వాదనల్ని వింటోంది.
- ఏసీబీ తరుఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు ప్రారంభించారు
- ఈ కార్ రేసు కేసు విచారణ పురోగతి ఏంటని.. ఏజీ సుదర్శన్‌రెడ్డిని ప్రశ్నించిన జస్టిస్ లక్ష్మణ్
- ఫిర్యాదుదారు స్టేట్‌మెంట్ రికార్డ్ పూర్తైందన్న ఏజీ
- ఏసీబీ విచారణ కొనసాగుతోందని తెలిపిన ఏజీ
- నగదు బదిలీ పై ప్రోజీర్ ఫాల్ కాలేదన్న ఏసీబీ తరుపు వాదనలు
- బిజినెస్ రూల్స్ కాపీ అడిగిన న్యాయమూర్తి
- రూల్స్ కాపీని అందించిన ఏసీబీ న్యాయవాది
- ఈడీ సైతం నోటీసులు జారీ చేసిందని తెలిపిన ఏసీబీ న్యాయవాది
- FEO తో అగ్రిమెంట్ చేసుకున్నారు .. కానీ దాని ద్వారా ఎలా లాభాలు వస్తాయో చెప్పలేదు .. AG సుదర్శన్ రెడ్డి
- మూడు దఫాలుగా నగదు బదిలీ చేశారు
- 55 కోట్లు ఎలాంటి అనుమతులు లేకుండా FEO కి బదిలీ చేశారు
- ఏసీబీ దర్యాప్తు ఎక్కడ వరకు వచ్చింది - హైకోర్టు
- ఈ కేసులో ఎంత మంది స్టేట్మెంట్ రికార్డ్ చేశారు - హైకోర్టు
- ఇప్పటి వరకు ఫిర్యాదు దారుడు దాన కిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశామన్న ప్రభుత్వ తరుఫు న్యాయ వాది
- ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఎలాంటి ఆధారాలు సేకరించారని ప్రశ్నించిన న్యాయస్థానం
- కేసు విచారణ కొనసాగుతుంది .. విచారణ దశలో అన్ని ఆధారాలు బయట పడుతాయన్న ప్రభుత్వ తరుఫు న్యాయ వాది
- కేటీఆర్ తరుపున న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు ప్రారంభం
- అవినీతి జరిగిందని ఏసీబీ అధికారులు సెక్షన్లు పెట్టారు
- ఎక్కడ, ఎలా జరిగిందో మాత్రం పేర్కొనలేదు
- లబ్ధి చేకూర్చినట్లు చెబుతున్న సంస్థపై కేసు పెట్టలేదు
- బిజినెస్ రూల్స్ ఉల్లంఘన అని చెబుతున్నారు..
- ప్రతి ఉల్లంఘన క్రిమినల్ నేరం కిందకు రాదన్న దవే
- దర్యాప్తు ప్రారంభ దశలోనే ఉందన్న ఏజీ
- ఫిర్యాదుదారు స్టేట్‌మెంట్ రికార్డు చేశాం
- విచారణలో నిందితులను చేరవచ్చు.. తొలగించవచ్చు
- ఆ అధికారం దర్యాప్తు సంస్థలకు ఉంటుంది
- బిజినెస్ రూల్స్‌ను ఉల్లంఘించి నగదు బదిలీ చేశారు
- పారెన్ కరెన్సీలో చెల్లింపులు నిబంధనలకు విరుద్ధమన్న ఏజీ
- 3 గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగిన వాదనలు
- కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు పూర్తి..
- తీర్పు రీజర్వ్ చేసిన హైకోర్టు.
- తీర్పు ప్రకటించే వరకు కేటీఆర్ అరెస్ట్ చెయ్యొద్దన్న హైకోర్టు
- ఏసీబీ దర్యాప్తు చేయోచ్చు
- తీర్పు వెలువరించే వరకు... కేటీఆర్ అరెస్టు వద్దు
- మధ్యంతర ఉత్తర్వులను పొడిగించిన హైకోర్టు
- ఫార్పులా ఈ కార్ రేసింగ్ కేసుపై ముగిసిన వాదనలు
- తీర్పు రిజర్వు చేసిన జస్టిస్ కె.లక్ష్మణ్
క్వాష్ పిటిషన్‌పై ముగిసిన కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు.. మధ్యాహ్నం లంచ్ బబ్రేక్ తర్వాత ఏసీబీ న్యాయవాది వాదనలు
కేటీఆర్ న్యాయవాది దవే వాదనలు
కేటీఆర్ ఈ కేసులో లబ్ధి పొందినట్లు ఎఫ్‌ఐఆర్‌లో ఎక్కడా లేదు
ఈ కేసులో అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు వర్తించవు
ఫార్ములా- ఈ రేసుల సీజన్ 10 నిర్వహణ కోసం మంత్రిగా కేటీఆర్ అనుమతులిచ్చారు
కొత్తగా వచ్చిన బీఎన్‌ఎస్ చట్టం కాకుండా ఐపీసీ సెక్షన్లు ఎందుకున్నాయని ప్రశ్నించిన హైకోర్టు
14 నెలల క్రితం నేరం జరిగింది కాబట్టి పాత చట్టం ప్రకారం కేసు నమోదు చేశారని తెలిపిన కేటీఆర్ తరఫున న్యాయవాది దవే
- ఐపీసీ 409పై కొనసాగుతున్న వాదనలు
- కేటీఆర్ ఎఫ్‌ఈవోతో జరిగిన ఒప్పందం ఎలాంటి లాభం పొందలేదు
- అసలు ఈ కేసులో ఐపీసీ 409 సెక్షన్ వర్తించదు.. ఆధారాలు కూడా లేవు
- ఫార్ములా ఈ రేసుల ఆపరేషన్స్ ఎఫ్‌ఈఓ చేసినందున వాళ్లను ఎందుకు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదు
- ఈ కేసులో నిందితుడు కేటీఆర్ చేర్చినప్పుడు ఎఫ్‌ఈఓను కూడా చేర్చాలి కదా
- ఎఫ్‌ఈఓతో అగ్రీమెంట్ పై సంతకం చేసింది అరవింద్ కుమార్ కేటీఆర్ కాదు
ఫార్ములా-ఈ కేసు: కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం
హైకోర్టులో ప్రారంభమైన కేటీఆర్ పిటిషన్‌పై విచారణ
కేటీఆర్ తరపున వాదనలు వినిపిస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ దవే
నేటితో ముగియనున్న కేటీఆర్ నాట్ టు అరెస్టు గడువు
ఫార్ములా-ఈ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైకోర్టు ఇచ్చిన ఊరట ‘నాట్ టు అరెస్ట్’ గడువు మంగళవారం(డిసెంబర్31)తో ముగియనుంది. కేసును హైకోర్టు నేడు తిరిగి విచారించనుంది. ఎఫ్‌ఐఆర్ కొట్టేయాలంటూ కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పై ఏసీబీ ఇప్పటికే కౌంటర్ దాఖలుచేసింది. కేటీఆర్ పిటిషన్‌కు విచారణార్హత లేదని ఏసీబీ కౌంటర్‌లో పేర్కొంది.
కేటీఆర్ ఆదేశాలతోనే ఎఫ్‌ఈఓ కంపెనీకి నిధుల బదిలీ జరిగిందని తెలిపింది. అన్ని అనుమతులు తీసుకొని ఎఫ్‌ఐఆర్ నమోదుచేశామని పేర్కొంది. విచారణ ప్రాధమిక దశలో ఉన్నందున బెయిల్, క్వాష్ ఊరట ఇవ్వొద్దని ఏసీబీ కోర్టును కోరింది. ఏసీబీ కౌంటర్‌పై హైకోర్టులో కేటీఆర్ కౌంటర్ అఫిడవిట్ దాఖలుచేశారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని తెలిపారు.
మంత్రిగా నిధుల బదిలీ మంత్రిగా తనకు సంబంధం లేని వ్యవహారమని పేర్కొన్నారు. విదేశీ సంస్థలకు నిధుల బదిలీ అనుమతి బ్యాంక్‌కు చెందిన అంశమని తెలిపారు. రాజకీయ కక్ష సాదింపుతో తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు. కాగా, ఈడీ సైతం ఈ కేసులో కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. జనవరి 7న కేటీఆర్ విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో కోరింది.
Comments
Please login to add a commentAdd a comment