
సాక్షి, హైదరాబాద్ : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై తెలంగాణ హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. రమేష్ కుమార్ పౌరసత్వం చెల్లదంటూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని పిటిషనర్ ఆది శ్రీనివాస్ కోర్టును కోరారు. మరోవైపు మరోవైపు కేంద్ర హోంశాఖ పౌరసత్వం రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని చెన్నమనేని రమేష్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం జూన్ 16న మరోసారి పూర్తి వాదనలు వింటామని తెలుపుతూ.. తదుపరి విచారణను జూన్ 16 కు వాయిదా వేసింది. లాక్‌డౌన్ కారణంగా ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టింది. కాగా వేములవాడ శాసన సభ్యుడైన చెన్నమనేని రమేష్‌కు జర్మని దేశంలో పౌరసత్వం ఉందంటూ ఆయన సమీప అభ్యర్థి ఆది శ్రీనివాస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.