
సాక్షి,హైదరాబాద్:మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదంపై తెలంగాణ హైకోర్టు బుధవారం(అక్టోబర్ 23) మధ్యాహ్నం తీర్పు వెలువరించనుంది. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వం తీసుకున్నారని ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ ఆరేళ్లుగా సాగింది. తుది వాదనలు విన్న హైకోర్టు మంగళవారం ఈ కేసులో తీర్పు రిజర్వు చేసింది.
రమేష్ బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆది శ్రీనివాస్ ఆయనపై పిటిషన్ దాఖలు చేశారు. రమేష్ జర్మనీ పౌరుడైనందున ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడని తీర్పు ఇవ్వాల్సిందిగా పిటిషన్‌లో ఆది శ్రీనివాస్ కోరారు. 2023 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రమేష్ పోటీ చేయలేదు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆదిశ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment