chennamaneni ramesh babu
-
TG: చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టు తీర్పు కాసేపట్లో
సాక్షి,హైదరాబాద్:మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదంపై తెలంగాణ హైకోర్టు బుధవారం(అక్టోబర్ 23) మధ్యాహ్నం తీర్పు వెలువరించనుంది. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వం తీసుకున్నారని ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ ఆరేళ్లుగా సాగింది. తుది వాదనలు విన్న హైకోర్టు మంగళవారం ఈ కేసులో తీర్పు రిజర్వు చేసింది. రమేష్ బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆది శ్రీనివాస్ ఆయనపై పిటిషన్ దాఖలు చేశారు. రమేష్ జర్మనీ పౌరుడైనందున ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడని తీర్పు ఇవ్వాల్సిందిగా పిటిషన్లో ఆది శ్రీనివాస్ కోరారు. 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రమేష్ పోటీ చేయలేదు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆదిశ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్నారు. -
గెలిపిస్తేనే వేములవాడకు వస్తా మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!
ఆ నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీల కంటే సొంత పార్టీలోని ప్రత్యర్థులే ప్రమాదకరంగా తయారయ్యారు. అధికార గులాబీ పార్టీ అభ్యర్థికే ఈ కష్టం రావడం హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎదుర్కొంటున్న సమస్యలే ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారాయి. ఇక్కడి అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఓ యువనేత చాలా కష్టాలు పడుతున్నారట. తనదగ్గర ఉన్న అన్ని అస్త్రాలు ఆ అభ్యర్థి కోసం ప్రయోగిస్తున్నారట. ఇంతకీ ఆ అభ్యర్థి ఎవరు? ఆ యువనేత ఎవరు? రాజన్న సిరిసిల్ల: తాను పోటీ చేస్తున్న సెగ్మెంట్‌కు పక్కనే ఉన్న నియోజకవర్గంలో తన పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి కల్వకుంట్ల తారకరాముడు నానా కష్టాలు పడుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబుకు టిక్కెట్ నిరాకరించిన గులాబీ పార్టీ బాస్ చల్మెడ లక్ష్మీకాంతారావుకు వేములవాడ టిక్కెట్ కేటాయించారు. టిక్కెట్ వచ్చినప్పటి నుంచే చల్మెడకు కష్టాలు మొదలయ్యాయి. తనకు టిక్కెట్ ఇవ్వనందుకు నిరసనగా సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్‌బాబు పార్టీ అభ్యర్థికి సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఉధృతంగా ప్రచారం చేయాల్సిన సమయంలో ఆయన జర్మనీ వెళ్లిపోయారు. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. తన పక్క నియోజకవర్గమే కావడంతో ఇప్పుడు వేములవాడ అభ్యర్థిని గెలిపించడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వేములవాడలో చల్మెడకు విజయం చేకూర్చండి...నేనే దత్తత తీసుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు. చల్మెడను గెలిపిస్తే వేములవాడను దత్తత తీసుకుంటా..చల్మెడను కాదు..కేసీఆర్‌ను చూసి గెలిపించండి..అంటూ వేములవాడలో జరిగిన యువ సమ్మేళనంలో కేటీఆర్ మాట్లాడారు. స్వయంగా ఆయనే వేములవాడలో పోటీ చేస్తున్నారా అన్నట్లుగా కేటీఆర్ చేసిన ప్రసంగం విన్నవారు...అక్కడ పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి బలహీనతలను ఆయనే బయటపెట్టారా అనే చర్చ ప్రారంభించారు. చల్మెడను గెలిపించకపోతే ఇక వేములవాడకు రానని చెప్పడం అంటే కేటీఆర్ తనవద్ద ఉన్న అస్త్రాలన్నీ వాడేసారా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రమేష్‌బాబు సహాయ నిరాకరణ..పార్టీ అభ్యర్థి చల్మెడ తీరు.. ప్రజలతో కలిసే విషయంలోనూ.. ముఖ్యంగా క్యాడర్ ను కలుపుకుపోవడంలో ఆయన పూర్తిగా వెనుకబడి పోవడంతో.. చల్మెడ విజయంపై నీలినీడలు కమ్ముకున్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. గతంలో నాల్గుసార్లు ఓటమిపాలైన కాంగ్రెస్ అభ్యర్థి, బీసీ నేత ఆది శ్రీనివాస్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆది శ్రీనివాస్ మీద సానుభూతి పవనాలు వీయడంతో పాటు.. కాంగ్రెస్ వేవ్ కొంత కనిపిస్తుండటం.. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు, ఆయన అనుచరవర్గం పెద్దగా సపోర్ట్ చేయకపోవడంతో.. అధికార బీఆర్ఎస్ అభ్యర్థి మరింత కష్టిస్తేగానీ.. కనీసం ఫైట్ లో ఉండే పరిస్థితి కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓవైపు బీఆర్ఎస్ అభ్యర్థి బలహీనతలు.. మరోవైపు స్థానిక నేతలు జీర్ణించుకోలేని స్థాయిలో ఆయన వైఖరి.. కేటీఆర్ మీటింగ్ అయిపోయిందో, లేదో.. వేములవాడ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడైన పుల్కంరాజు, ఆయన సతీమణితో సహా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇంకొందరు కౌన్సిలర్లు కూడా గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. వీరంతా సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు అనుచరగణం కావడం విశేషం. అధికార బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు పెద్దగా ప్రభావితం చేయగల నేత కాకపోవడంతో పాటు.. ఆయన వైఖరి నచ్చక చాలామంది పార్టీకి దూరమవుతున్నారు. అందుకే తన పక్క నియోజకవర్గమైన వేములవాడలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం తారకరాముడికి తలబొప్పి కట్టినంత పనవుతోంది. అయితే యువసమ్మేళనంలో కేటీఆర్ చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు నియోజకవర్గంలో చర్చకు దారి తీసాయి. చల్మెడను గెలిపించకపోతే వేములవాడ రానంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్...పార్టీ అభ్యర్థి చల్మెడ నిస్సహాయతను తెలియచేస్తోందని అంటున్నారు. మరి చివరకు వేములవాడ రాజన్న ఎవరిని కరుణిస్తాడో చూడాలి.. -
Assembly Elections: వేములవాడ రాజన్న ఎవరిని కరుణిస్తాడో..
ఆ నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీల కంటే సొంత పార్టీలోని ప్రత్యర్థులే ప్రమాదకరంగా తయారయ్యారు. అధికార గులాబీ పార్టీ అభ్యర్థికే ఈ కష్టం రావడం హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎదుర్కొంటున్న సమస్యలే ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారాయి. ఇక్కడి అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఓ యువనేత చాలా కష్టాలు పడుతున్నారట. తనదగ్గర ఉన్న అన్ని అస్త్రాలు ఆ అభ్యర్థి కోసం ప్రయోగిస్తున్నారట. ఇంతకీ ఆ అభ్యర్థి ఎవరు? ఆ యువనేత ఎవరు? తాను పోటీ చేస్తున్న సెగ్మెంట్‌కు పక్కనే ఉన్న నియోజకవర్గంలో తన పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి కల్వకుంట్ల తారకరాముడు నానా కష్టాలు పడుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబుకు టిక్కెట్ నిరాకరించిన గులాబీ పార్టీ బాస్ చల్మెడ లక్ష్మీ నర్సింహారావుకు వేములవాడ టికెట్ కేటాయించారు. టిక్కెట్ వచ్చినప్పటినుంచే చల్మెడకు కష్టాలు మొదలయ్యాయి. తనకు టిక్కెట్ ఇవ్వనందుకు నిరసనగా సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్‌బాబు పార్టీ అభ్యర్థికి సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఉధృతంగా ప్రచారం చేయాల్సిన సమయంలో ఆయన జర్మనీ వెళ్లిపోయారు. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. తన పక్క నియోజకవర్గమే కావడంతో ఇప్పుడు వేములవాడ అభ్యర్థిని గెలిపించడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వేములవాడలో చల్మెడకు విజయం చేకూర్చండి...నేనే దత్తత తీసుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు. చల్మెడను గెలిపిస్తే వేములవాడను దత్తత తీసుకుంటా.. చల్మెడను కాదు.. కేసీఆర్‌ను చూసి గెలిపించండి..అంటూ వేములవాడలో జరిగిన యువ సమ్మేళనంలో కేటీఆర్ మాట్లాడారు. స్వయంగా ఆయనే వేములవాడలో పోటీ చేస్తున్నారా అన్నట్లుగా కేటీఆర్ చేసిన ప్రసంగం విన్నవారు...అక్కడ పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి బలహీనతలను ఆయనే బయటపెట్టారా అనే చర్చ ప్రారంభించారు. చల్మెడను గెలిపించకపోతే ఇక వేములవాడకు రానని చెప్పడం అంటే కేటీఆర్ తనవద్ద ఉన్న అస్త్రాలన్నీ వాడేసారా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రమేష్‌బాబు సహాయ నిరాకరణ..పార్టీ అభ్యర్థి చల్మెడ తీరు.. ప్రజలతో కలిసే విషయంలోనూ.. ముఖ్యంగా క్యాడర్ ను కలుపుకుపోవడంలో ఆయన పూర్తిగా వెనుకబడి పోవడంతో.. చల్మెడ విజయంపై నీలినీడలు కమ్ముకున్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. గతంలో నాల్గుసార్లు ఓటమిపాలైన కాంగ్రెస్ అభ్యర్థి, బీసీ నేత ఆది శ్రీనివాస్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆది శ్రీనివాస్ మీద సానుభూతి పవనాలు వీయడంతో పాటు.. కాంగ్రెస్ వేవ్ కొంత కనిపిస్తుండటం.. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు, ఆయన అనుచరవర్గం పెద్దగా సపోర్ట్ చేయకపోవడంతో.. అధికార బీఆర్ఎస్ అభ్యర్థి మరింత కష్టిస్తేగానీ.. కనీసం ఫైట్‌లో ఉండే పరిస్థితి కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓవైపు బీఆర్ఎస్ అభ్యర్థి బలహీనతలు.. మరోవైపు స్థానిక నేతలు జీర్ణించుకోలేని స్థాయిలో ఆయన వైఖరి.. కేటీఆర్ మీటింగ్ అయిపోయిందో, లేదో.. వేములవాడ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడైన పుల్కంరాజు, ఆయన సతీమణితో సహా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇంకొందరు కౌన్సిలర్లు కూడా గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. వీరంతా సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు అనుచరగణం కావడం విశేషం. అధికార బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు పెద్దగా ప్రభావితం చేయగల నేత కాకపోవడంతో పాటు.. ఆయన వైఖరి నచ్చక చాలామంది పార్టీకి దూరమవుతున్నారు. అందుకే తన పక్క నియోజకవర్గమైన వేములవాడలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం తారకరాముడికి తలబొప్పి కట్టినంత పనవుతోంది. అయితే యువసమ్మేళనంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు నియోజకవర్గంలో చర్చకు దారి తీసాయి. చల్మెడను గెలిపించకపోతే వేములవాడ రానంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు.. పార్టీ అభ్యర్థి చల్మెడ నిస్సహాయతను తెలియచేస్తోందని అంటున్నారు. మరి చివరకు వేములవాడ రాజన్న ఎవరిని కరుణిస్తాడో చూడాలి.. -
తిరగబడతా.. పోరాటం చేస్తా.. ఎమ్మెల్యే చెన్నమనేని మరోసారి హాట్ కామెంట్స్
సాక్షి, కరీంనగర్ జిల్లా: వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. వేములవాడ అర్బన్ మండలం అనుపురంలో.. వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహరావుతో కలిసి గ్రామపంచాయితీ భవన ప్రారంభోత్సవంలో మిడ్ మానేరు ముంపు గ్రామాలనుద్ధేశించి తన మనసులో మాటలన్నీ వెళ్లగక్కారు. మిడ్ మానేరు ప్రాజెక్ట్ ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం కాకుంటే తానే తిరగబడి పోరాటం చేస్తానంటూ తనదైన ధిక్కారస్వరాన్ని వినిపించిన చెన్నమనేని.. ముంపు గ్రామాలు సిరిసిల్ల నియోజకవర్గంలో ఉండి ఉంటే ఎప్పుడో సమస్యలు పరిష్కారం అయ్యేవన్నారు. ఆ విషయాన్ని సూటిగా కేటీఆర్‌తో కూడా ప్రస్తావించినట్టు చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో ముంపు గ్రామాల సమస్యలపై అధికార పక్షంలాగా కాకుండా.. ఓ ప్రతిపక్ష నేతగా పోరాటం చేశానన్న చెన్నమనేని రమేష్ బాబు.. తాను మంత్రినైనా బాగుండేదేమో, ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం సులభమయ్యేదేమోనన్నారు. మిడ్ మానేరు ముంపు గ్రామాల సమస్యలపై నేను ప్రశ్నించానన్న విషయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టే చెబుతున్నానన్న చెన్నమనేని.. ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కోసం ఎక్కని గడప, దిగని గడప లేదన్నారు. కాళ్లు పట్టుకోవడం తప్ప అన్నీ చేశానని.. చెన్నమనేని రాజేశ్వరరావు కూమారుడిని కాబట్టి, ఆత్మగౌరవం ఉంది కాబట్టి, ఆ పని చేయలేకపోయానన్నారు. సమస్యలు పరిష్కారం కాకుంటే మళ్లీ పోరాటం చేస్తానన్న రమేష్‌బాబు.. మిడ్ మానేరు ముంపు నిర్వాసితుల విషాదగాథల నుండి పాఠాలు నేర్చుకోవాలని తమ అభ్యర్థి చల్మెడకు సూచిస్తున్నానన్నారు. రమేష్ బాబు షాకింగ్ కామెంట్స్‌తో బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ నిశ్ఛేష్ఠుడై చూస్తూ కూర్చుండిపోయారు. మరోవైపు ముఖ్యమంత్రి వ్యవసాయ సలహాదారుగా చెన్నమనేనిని నియమించాక.. చెన్నమనేని, చల్మెడ మధ్య సయోధ్య కుదిరిందనుకుంటున్న తరుణంలోనూ ఎమ్మెల్యే రమేష్‌బాబు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. చదవండి: కాంగ్రెస్ కీలక నిర్ణయం!.. అక్కడి నుంచి బరిలో బండ్ల గణేష్? -
వేములవాడ పాలిటిక్స్.. పరోక్షంగా చెన్నమనేని కౌంటర్
సాక్షి, రాజన్న సిరిసిల్ల: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో పార్టీలో కోల్డ్ వార్ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. చెన్నమనేనికి కేబినెట్ హోదాతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు(వ్యవసాయ రంగ వ్యవహారాలుగా నియమించిన విషయం తెలిసిందే. అనంతరం, సీఎం కేసీఆర్‌ను చెన్నమ్మనేని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఇక, తాజాగా చెన్నమనేని వేములవాడలో నెలకొన్న అంతర్గత సంక్షోభం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, గురువారం చెన్నమనేని తన తండ్రి రాజేశ్వర రావు శతజయంతి ఉత్సవాల కోసం వేములవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాజకీయాలంటే స్వచ్చంద సంస్థలు, ఫౌండేషన్ల పెట్టి ప్రచారం చేసుకోవడం కాదు. తాము చేసిన నిస్వార్థ సేవతో ప్రజల గుండెల్లో నిలవాలి. అందుకు నా తండ్రి చెన్నమనేని రాజేశ్వర రావు ఒక ఉదాహరణ అంటూ ప్రత్యర్థులకు పరోక్షంగా చురకలు అంటించారు. ఇదే క్రమంలో ఆయన.. తెలంగాణ సాయుధ పోరాటంలో రావి నారాయణరెడ్డి సారథ్యంలో మా తండ్రి చేసిన పోరాటం మరువలేనిది. సాగునీటి ప్రాజెక్టుల కొరకు ఆయన చేసిన ఉద్యమాలు, పాదయాత్రలు, నిరసన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అందుకే కాళేశ్వరం ప్యాకేజ్-9లోని మల్కపేట రిజర్వాయర్‌కు చెన్నమనేని రాజేశ్వర్ రావు పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ చెప్పడం విశేషం. అందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: సస్పెన్స్ ఓవర్.. కేసీఆర్‌ను కలిసిన చెన్నమనేని -
కేసీఆర్‌ను కలిసినా మౌనం వీడని చెన్నమనేని!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేల వేములవాడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పటి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్ నుంచి మరోసారి టికెట్ ఆశించి భంగపడిన చెన్నమేనని పంచాయితీ వారం రోజులుగా ఓ కొలిక్కి రావడం లేదు. ఈ క్రమంలో ఎమ్మెల్యే బుధవారం సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. నిన్న సాయంత్రం మాజీ ఎంపీ వినోద్ మధ్యవర్తిత్వంతో కేసీఆర్‌తో చెన్నమనేని భేటీ అయ్యారు. సీఎంను కలిసినా రమేష్ బాబు మౌనం వీడలేదు. చెన్నమనేనితో పాటు చల్మెడకూ ప్రగతీభవన్ పిలుపురాగా.. ఇద్దరి సమక్షంలో సీఎం మంతనాలు జరిపారు. అయితే భేటీకి సంబంధించి విషయాన్ని చెన్నమనేని, చల్మెడ వర్గీయులు గోప్యంగా ఉంచుతున్నారు. దీంతో భేటీ సారాంశంపై ఉత్కంఠ నెలకొంది. చదవండి: మైనంపల్లికి సన్‌స్ట్రోక్ తప్పదా? కాగా బీఆర్ఎస్ అధిష్టానం మేములవాడ టికెట్ చల్మెడ లక్ష్మీ నర్సింహరావుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో చెన్నమనేని అలకబూనారు. అప్పటి నుంచి అధిష్టానంపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి హరీష్ రావు కలుస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రికి వ్యవసాయ రంగ సలహాదారు పదవి ప్రకటించినా సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబులో జ్వాలలు ఆరడం లేదు. ఇప్పటికే వేములవాడ బీఆర్ఎస్లో రెండు వర్గాలుగా చీలిపోయి అంతర్గతంగా ప్రతిష్ఠంభన నెలకొంది. చల్మెడ వర్సెస్ చెన్నమనేని అనుచరుల మధ్య వార్ కొనసాగుతోంది. అంతేగాక రమేష్ బాబు సలహాదారు పదవిపైనా ఇప్పటివరకూ అధికారికంగా ఉత్తర్వులు జారీ కాలేదు. గులాబీ బాస్‌తో భేటీ తర్వాతైనా వేములవాడ బీఆర్ఎస్ అంతర్గత కలహాలకు చెక్ పడుతుందా అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. శుక్రవారం తన తండ్రి శత జయంతి ఉత్సవాలకు రమేష్ బాబు వేములవాడ రానున్నారు. ఈ నేపథ్యంలో రమేష్ బాబు ఏం చెప్పబోతున్నారనే దానిపై ప్రాధాన్యత సంతరించుకుంది. -
రోజుకో ప్రచారం.. కేసీఆర్-చెన్నమనేని భేటీపై ఉత్కంఠ
సాక్షి, రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో వేములవాడ టికెట్ చల్మెడ లక్ష్మీ నర్సింహరావుకు కేటాయించడంతో బీఆర్ఎస్ పార్టీలో రాజుకున్న చిచ్చు ఆరడం లేదు. ముఖ్యమంత్రికి వ్యవసాయ రంగ సలహాదారు పదవి ప్రకటించినా సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబులో జ్వాలలు ఆరడం లేదు. ఈ నేపథ్యంలో వేములవాడలో చల్మెడ వర్సెస్ చెన్నమనేని అనుచరుల మధ్య వార్ కొనసాగుతోంది. అలక వీడని రమేష్ బాబు పంతంతో వేములవాడ బీఆర్ఎస్ అంతర్గత సంక్షోభం ఇంకా నివురుగప్పిన నిప్పులాగే ఉంది. చెన్నమనేని తీరు గులాబీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. సీఎం కేసీఆర్‌తో సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని భేటీపై రోజుకో తీరు ప్రచారం సాగుతోంది. గత మూడురోజుల నుంచి కేసీఆర్‌ను కలువనున్నట్టు ప్రచారం సాగుతోంది. కానీ ఇప్పటి వరకూ సీఎంను ఆయన కలవలేదు. ముఖ్యమంత్రి వ్యవసాయ రంగ సలహాదారుగా నియమించినా ఎక్కడా తన స్పందనను తెలియజేయలేదు. ఈ నేపథ్యంలో వేములవాడలో చల్మెడ వర్సెస్ చెన్నమనేని అనుచరుల మధ్య వార్ కొనసాగుతోంది. ఈ క్రమంలో సీఎంను నేడు కలవనున్నట్లు మళ్లీ ప్రచారం మొదలైంది. సోమవారం హరీష్ రావును కలిసిన చెన్నమనేని.. నేడు సాయంత్రం వేములవాడకు చేరుకొని ముఖ్య కార్యకర్తలతో భేటీ కానున్నారు. ఎల్లుండి ఆగస్ట్ 31న తన తండ్రి దివంగత కమ్యూనిస్ట్ నేత రాజేశ్వర్ రావు శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఏర్పాట్లు ఇప్పటికే మొదలు కాగా.. ఈ మొత్తం పరిణామాలపై చెన్నమనేని స్పందనేంటనేదానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. చదవండి: -
కేసీఆర్ అపాయింట్మెంట్.. నో ఇంట్రెస్ట్?
సాక్షి, రాజన్న సిరిసిల్ల: తెలంగాణలో మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే.. వేములవాడలో రాజకీయాలు కాస్త ప్రత్యేకంగా సాగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబును బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కనపెట్టేయడంతో.. ఆయన నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం అపాయింట్ మెంట్ దక్కినా చెన్నమనేని కలవకపోవడం చర్చనీయాంశంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుకు కాకుండా.. చల్మెడ లక్ష్మీనరసింహారావుకు వేములవాడ టికెట్ కేటాయించింది బీఆర్ఎస్ అధిష్టానం. చెన్నమనేని మంచి లీడర్ అని, కానీ, పౌరసత్వ వివాదం ఉన్నందునే ఆయన పక్కకి పెడుతున్నట్లు ఆవేదనపూరితంగానే కేసీఆర్ మీడియా ముందు ప్రకటించారు కూడా. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రికి వ్యవసాయ రంగ సలహాదారుగా చెన్నమనేనిని నియమించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే టికెట్ ఇవ్వకపోవడంతో పాటు ఈ నియామకంగాపై చెన్నమనేని తీవ్ర అసంతృప్తితో రలిగిపోతున్నట్లు తెలుస్తోంది. టిక్కెట్ ఇవ్వకపోవడంపై నిరసన తెలిపే క్రమంలోనే ఆయన అపాయింట్మెంట్ ఇచ్చినా వెళ్లలేదని స్పష్టమవుతోంది. చల్మెడకు నో సపోర్ట్! వేములవాడలో ప్రస్తుతం బీఆర్ఎస్ రాజకీయం గందరగోళంగా తయారైంది. టికెట్ ప్రకటన తర్వాత రెండు గ్రూపులుగా విడిపోయాయి బీఆర్ఎస్ శ్రేణులు. ఇక తమ రాజకీయ వారసత్వానికి గండి పడటాన్ని జీర్ణించుకోలేని స్థితిలో చెన్నమనేని ఉన్నారు. అదే సమయంలో చెల్మెడ్కు మద్దతుగా వచ్చిన నాయకులపైనా ఆయన రుసరుసలాడినట్లు తెలుస్తోంది. మీరు చేస్తున్న బ్యాక్ డోర్ పాలిటిక్స్‌తో ప్రత్యర్థి పార్టీ నాయకుడి గెలుపు ఖాయం అంటూ చెన్నమనేని తనను కలిసేందుకు వచ్చిన నాయకులపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థి చల్మెడకు అంతగా మద్దతు దొరకడం లేదు. మరోవైపు రమేష్ బాబుకు పార్టీకి మించిన మద్దతు ఉందక్కడ. ఈ నేపథ్యంలో.. చెన్నమనేని తదుపరి అడుగులపై ఆసక్తి నెలకొంది. -
వేములవాడ బీఆర్ఎస్లో ఆరని చిచ్చు..
హైదరాబాద్: బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్‌బాబుకు వ్యవసాయ రంగ సలహాదారు పదవి ఇచ్చినా ఆయనలో మాత్రం ఇంకా నిరసన జ్వాలలు చల్లారలేదు. వేములవాడ టికెట్‌కు తనను కాదని చల్మెడ లక్ష్మీనరసింహారావుకు కేటాయించడంతో రమేష్‌బాబు కినుక వహిస్తున్నారు. ఇంకా గుర్రుగానే ఉన్న రమేష్‌బాబు.. హైదరాబాద్‌లో తనను కలిసి బుజ్జగించే యత్నం చేసిన సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్యపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు రమేష్‌బాబు. మీరంతా ముందో మాట.. వెనుకో మాట మాట్లాడుతూ బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఆగయ్యపై సీరియస్ అయ్యారు. అలక వీడని రమేష్ బాబు పంతంతో ఇంకా నివురుగప్పిన నిప్పులాగే వేములవాడ బీఆర్ఎస్లో అంతర్గత సంక్షోభం కొనసాగుతోంది. ఇది గులాబీ అధిష్టానానికి మరింత తలనొప్పిగా మారింది. -
కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. చెన్నమనేనికి కీలక పదవి
సాక్షి, వేములవాడ: తెలంగాణలో పొలిటికల్ వాతావరణం ఆసక్తికరంగా మారింది. అధికార బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇటీవలే తొలి విడతలో భాగంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో టికెట్ ఆశావహులు.. అసంతృప్తితో రగిలిపోతున్నారు. కొందరు నేతలు బహిరంగంగానే బీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈసారి టికెట్ దక్కని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు కేసీఆర్ కీలక పదవి ఇచ్చారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేనికి తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా నియమించింది. వ్యవసాయ శాస్త్రవేత్త అయిన ప్రొఫెసర్ చెన్నమనేని రమేష్ బాబును ఈ పదవిలో నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు సీఎంవో ప్రకటన విడుదల చేసింది. కేబినెట్ హోదా కలిగిన ఈ పదవిలో ఆయన ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. సీఎం నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుందని సీఎంవో తెలిపింది. ఇదిలా ఉండగా.. చెన్నమనేనిని కాదని చల్మెడ లక్ష్మీనర్సింహారావును టికెట్ ప్రకటించడంతో వేములవాడ బీఆర్ఎస్లో అలజడి చోటుచేసుకుంది. దీంతో చెన్నమనేని మద్దతుదారులు నిరాశకు గురయ్యారు. అలాగే, సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రమేశ్ బాబు తన ఫేస్బుక్ ఖాతాలో రాజకీయాలు ప్రజల కోసం తప్ప పదవుల కోసం చేయొద్దంటూ తన తండ్రి రాజేశ్వర్‌రావు మాటలను గుర్తు చేసుకుంటూ చేసిన పోస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కేసీఆర్.. చెన్నమనేనిని కీలక పదవి ఇచ్చారు. కేసీఆర్ నిర్ణయంతో వేములవాడలో చల్మెడ ప్రచారానికి లైన్ క్లియర్ అయ్యింది. ఇది కూడా చదవండి: తుమ్మల ఎపిసోడ్లో ఊహించని ట్విస్ట్ -
బీజేపీవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని !
సాక్షి, రాజన్న సిరిసిల్ల: బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో టికెట్ ఆశించి భంగపడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. 115 స్థానాలకు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. 9 స్థానాల్లో సిట్టింగ్‌లను మార్చిన విషయం తెలిసిందే ఈ క్రమంలో చోటు దక్కని నేతలు కేసీఆర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తిరుగుబావుట ఎగురవేస్తున్నారు. ఎలాగైనా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేయాలనే ఆశతో పార్టీ మారేందుకు యత్నిస్తున్నారు. ప్రత్నామ్నాయ బీజేపీ, కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే అసంతృప్తి నేతలను తమవైపు తిప్పుకునేందుకు ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి టికెట్ రాని నేతలతో చర్చలు జరుపుతున్నాయి. ఇక అనుకున్నట్టుగానే వేములవాడ చెన్నమనేనికి కాకుండా పోయింది. అంతా భావించినట్టుగానే చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థల చైర్మన్ చల్మెడ లక్ష్మీనర్సింహారావుకే దక్కింది. అయితే, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు దారెటు..? బీఆర్ఎస్ లోనే ఉంటూ చల్మెడ కోరినట్టుగా ఆయనకు సహకరిస్తారా..? లేక, ఇంకో మార్గమేదైనా చూసుకుంటారా..? చెన్నమనేని రాజకీయ వారసత్వానికి కామానో.. లేక, ఫుల్ స్టాప్ పడేందుకు ఆయన సుముఖంగా ఉంటారా..? టిక్కెట్ కొట్లాటకు ముందు ఎంత ఉత్కంఠైతే నెలకొందో.. అదే ఆసక్తి టిక్కెట్ కన్ఫర్మేషన్ తర్వాత కూడా వేములవాడలో కనిపిస్తోంది. చదవండి: వామపక్షాలతో పొత్తులేదని తేల్చేసిన కేసీఆర్.. కమ్యూనిస్టుల కీలక భేటీ వేములవాడ అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు అంతా ఊహించినట్టుగానే ఈసారి టిక్కెట్ దక్కలేదు. అందుకోసం గులాబీబాస్ కేసీఆర్ చెప్పిన కారణం.. చెన్నమనేనిపై వేములవాడ కాంగ్రెస్ నాయకుడు ఆది శ్రీనివాస్ ఎప్పట్నుంచో పోరాటం చేస్తూ కోర్టుల్లో రచ్చరచ్చగా మారి ద్వంద్వ పౌరసత్వ వివాదమే. అయితే, అది ఆయన్ను పక్కకు పెట్టేందుకు కేవలం సాకు మాత్రమేనని వాదనా ఇప్పుడు రమేష్ బాబు వర్గం నుంచి వినిపిస్తోంది. అలాగైతే.. 2014, 2018కి ముందు నుంచే ఈ వివాదం కొనసాగుతున్నప్పుడు.. అప్పుడెలా మరి రమేష్ బాబు అధికార బీఆర్ఎస్ అభ్యర్థయ్యారో చెప్పాలన్న వాదన ఇప్పుడు రమేష్ బాబు, ఆయన అనుచరవర్గం నుంచి వినిపిస్తోంది. అయితే గతంలో తన తండ్రి ప్రాతినిథ్యం వహించిన వేములవాడ.. చెన్నమనేని ఫ్యామిలీకి ఓ కంచుకోటగా మారిపోయింది. ఈసారి తమ ప్రాతినిథ్యమే లేకపోతే.. అది కామాగా భావించాలని ఎవరైనా చెప్పినా.. ఆ తర్వాత అదే పూర్తిగా ఫుల్ స్టాప్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే మరొకరు వచ్చి జెండా పాతారంటే.. కచ్చితంగా దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం అంత సులువు కాదు. ఈ నేపథ్యంలోనే రమేష్ బాబు వేములవాడలో తన తదుపరి భవిష్యత్ కార్యాచరణకై సీరియస్ గా యోచిస్తున్నట్టు తెలుస్తోంది. చదవండి: ఖానాపూర్‌లో నా సత్తా ఏంటో చూపిస్తా: రేఖా నాయక్ సంచలన వ్యాఖ్యలు పైగా నిన్న తనకు టిక్కెట్ దక్కదన్న ప్రచారం నేపథ్యంలోనే.. కేసీఆర్ ప్రకటన కంటే ముందే ఓ భావోద్వేగంతో.. ఒకింత నిర్వేదంతో తన తండ్రి మాటలను ఉటంకిస్తూ.. ఆత్మగౌరవం అనే పదాన్ని వాడుతూ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఆయన అంతరగాన్ని తెలియజెప్పింది. ఈ క్రమంలో అనుకున్నట్టుగానే వేములవాడ టిక్కెట్ ను కేటీఆర్ కు సన్నిహితంగా ఉన్న చల్మెడకు కేటాయించడంతో వేములవాడలో ఒకవైపు చల్మెడ అనుచరుల్లో ఆనందం కనిపిస్తే.. ఇంకోవైపు ఒకింత నైరాశ్యం, మరింత స్తబ్దత వాతావరణం కనిపించింది. తన తండ్రి నుంచి కొనసాగుతూ వస్తున్న రాజకీయ వారసత్వాన్ని వదలుకోవడానికి చెన్నమనేని ఫ్యామిలీ సిద్ధంగా లేదన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే బాబాయ్ అబ్బాయ్ తో పాటు.. చెన్నమనేని ఫ్యామిలీ సభ్యుల్లో కీలకమైనవారంతా వేములవాడలో నెక్స్ట్ జరుగబోయే రాజకీయమెలా ఉండబోతోంది.. తామేం చేయాలనే సమాలోచనల్లో పడ్డట్టుగా సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే బీజేపి ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్.. చెన్నమనేనితో మాట్లాడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జర్మనీలో ఉన్న రమేష్ బాబు.. ఈనెల ఆగస్ట్ 25వ తేదీన వేములవాడకు రానున్నారు. మొత్తంగా రమేష్ బాబు చూపు కూడా బీజేపీ వైపు పడినట్టుగా తెలుస్తోంది. అందుకు తన బాబాయ్ సపోర్ట్ తో పాటు.. ఈటెల కూడా చొరవ తీసుకోవడంతో.. వేములవాడ నుంచి బీజేపి అభ్యర్థిగా బరిలోకి దిగాలన్న యోచనలో రమేష్ బాబు కూడా యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. నర్సాపూర్‌లో నువ్వా నేనా? సిట్టింగ్ మదన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి మధ్య పోటీ ఇప్పటికే ఈ విషయాన్ని బీజేపీ అధిష్ఠానం పెద్దలకు కూడా ఈటెల చేరవేసినట్టు తెలుస్తుండగా.. మరి రమేష్ బాబు పయనమెటు...? ప్రచారం జరుగుతున్నట్టుగా ఆయన బీజేపీలో చేరతారా...? ఈసారి తన టిక్కెట్ కు గండికొట్టే సాకుగా మారిన ద్వంద్వ పౌరసత్వ వివాదాన్నీ.. కేంద్రంలో ఉన్న పార్టీతో కలిస్తే ఏమైనా తొలగించుకునే అవకాశం దొరుకుతుందా వంటి పలు విశ్లేషణలతో కూడిన చర్చలకు ఇప్పుడు తెర లేస్తోంది. మొత్తంగా టిక్కెట్ కన్ఫర్మేషన్కు ముందు రసవత్తరంగా సాగిన రాజన్న క్షేత్రంలోని రాజకీయం.. టిక్కెట్ కన్ఫర్మేషన్ తర్వాత కూడా అంతకంతకూ రసకందాయంగా మారుతుండటం ఇక్కడి విశేషం. -
గులాబీ కోటలో కొత్త టెన్షన్.. ఆ ఐదు సెగ్మెంట్లలో ఏం జరుగుతోంది?
ఉమ్మడి కరీంనగర్ జిల్లా గులాబీ పార్టీకి కంచుకోటగా మారింది. ప్రత్యర్థులకు ఆనవాళ్ళు కూడా లేకుండా చేశాయి బీఆర్ఎస్ శ్రేణులు. కానీ ఇప్పుడు పార్టీలోనే ప్రత్యర్థులు తయారయ్యారు. ముఖ్యంగా అయిదు సెగ్మెంట్లలో గులాబీ పార్టీ నేతలు కుమ్ములాడుకుంటున్నారు. ప్రతిపక్షాలు లేని కొరతను సొంత పార్టీ వారే తీరుస్తున్నారు. నియోజకవర్గాల్లో రణరంగాన్ని సృష్టిస్తున్నారు. ఇంతకీ ఆ ఐదు సెగ్మెంట్ల కథేంటీ... ఉత్తర తెలంగాణలో కీలకమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఐదు నియోజవర్గాల్లో గులాబీ పార్టీలో అంతర్గత కలహాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. రామగుండం నియోజకవర్గంలో ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై గెలిచిన కోరుకంటి చందర్ తర్వాతి కాలంలో కారెక్కి విహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చందర్‌కు సీటిస్తే మద్దతిచ్చే ప్రసక్తి లేదని ఆయన వ్యతిరేకులు గులాబీ పార్టీ నాయకత్వానికి తేల్చి చెప్పేశారు. బీఆర్ఎస్కు చెందిన పలువురు నేతలు కోరుకంటి చందర్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. కేసీఆర్‌ను మళ్ళీ సీఎం చేయాలంటూ ఆశయసాధన పేరుతో యాత్ర చేస్తున్న అసమ్మతి నేతలు ఎమ్మెల్యే ఫోటోను మాత్రం పెట్టలేదు. మరోవైపు ఎమ్మెల్యే వర్గం కూడా పాదయాత్ర నిర్వహించగా.. రెండు వర్గాలు రామగుండంలో వీధిపోరాటానికి దిగాయి. చదవండి: డోలాయమానంలో గడల శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్ నిర్వేదంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజన్న కొలువై ఉన్న వేములవాడలోనూ గులాబీ పార్టీలో గ్రూప్‌లు ఏర్పడి కుమ్ములాడుకుంటున్నాయి. నియోజకవర్గంలో రెండు పార్టీ ఆఫీసులతో భిన్నమైన పరిస్థితి కొనసాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు టిక్కెట్‌కు చల్మెడ లక్ష్మీనర్సింహారావు అడ్డుపడుతున్నారు. కొద్దికాలంగా రమేష్ బాబు వర్సెస్ చల్మెడ ఎపిసోడ్ వేములవాడ రాజకీయాల్ని రసవత్తరంగా మార్చాయి. ఇద్దరి మధ్యా ఉప్పునిప్పూ అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. ఈ క్రమంలో ఈసారి రమేష్ బాబు టికెట్‌కు గండి కొట్టి.. చల్మెడకే కన్ఫర్మ్ అనే టాక్ వేములవాడలో చాలా రోజులుగా నడుస్తోంది. టికెట్ రాదేమోనన్న నిర్వేదంతో పాటు.. పార్టీలోని ప్రత్యర్థులపై అక్కసు, ఆక్రోశమూ సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు మాటల్లో కనిపిస్తోంది. తనను ధిక్కరించిన ఈటల రాజేందర్‌కు ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని గులాబీ బాస్ కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. ఈటలతో యుద్ధానికి పంపిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి నిత్యం వివాదాలతో సహవాసం చేస్తూ కేసీఆర్ ఆశల్ని తుంచేస్తున్నారు. కౌశిక్‌రెడ్డిని నియోజకవర్గ ఇంఛార్జ్‌గా తొలగించాలంటూ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి వంటివారు మీడియా ముందుకు రావడం.. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తే.. మరింత రెబల్‌గా సమ్మిరెడ్డి మాట్లాడిన తీరు ఇప్పుడు హుజూరాబాద్ రాజకీయాల్లో బీఆర్ఎస్ పరిస్థితిని కళ్లకు కడుతోంది. అంతేకాదు కొందరు సర్పంచులు, ఎంపీటీసీలు కూడా కౌశిక్‌కు వ్యతిరేకంగా మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. దీంతో హుజూరాబాద్‌లో అభ్యర్థెవ్వరన్న ప్రశ్నలతో పాటు.. ఎవరు అభ్యర్థిగా బరిలో ఉన్నా.. మిగిలిన వర్గాలు ఎంతవరకూ మద్దతిస్తాయన్నది కూడా సందేహమే. ఇక పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తీరుపై కూడా పార్టీలో అంతర్గతంగా అసహనం వ్యక్తమవుతోంది. మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ రాజయ్య ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఓ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఎమ్మెల్యే దాసరి తీరుపై అలిగి ఆయన కీలక అనుచరుడైన ఉప్పు రాజ్ కుమార్ పార్టీనుంచే బయటకు వెళ్ళిపోయాడు. అయితే అతణ్ని బ్రతిమాలి మళ్ళీ పార్టీలోకి తీసుకువచ్చారు. చదవండి: ఎల్లారెడ్డిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ... స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న భానుప్రసాద్ రావు కూడా ఈసారి టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డీతో ఎమ్మెల్సీ భానుప్రసాద్‌కు సఖ్యత లేకపోవడం వల్ల ఆయనకు ప్రత్యర్థులు పెరిగిపోతున్నారు. ఈసారి బీసీలకే పెద్దపెల్లి టిక్కెట్ ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి రావడంతో పాటు.. సామాజిక సమీకరణలు కూడా పార్టీకి తలబొప్పి కట్టిస్తున్నాయి. జూలపల్లి జెడ్పీటీసి లక్ష్మణ్ కేసీఆర్ సేవాదళం పేరుతో కార్యక్రమాలు చేస్తూ.. ఎమ్మెల్యే దాసరిపై కనిపించని యుద్ధం చేస్తున్నారు. జూలపల్లి జడ్పీటీసీ కూడా పెద్దపల్లి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. చొప్పదండి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. పైకి సిట్టింగ్ ఎమ్మెల్యేకే టిక్కెట్ అని ప్రచారం జరుగుతున్నా..వెనుక పెద్ద పెద్ద గోతులు తవ్వుతున్నట్టు టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఎవ్వరినీ కలుపుకుపోలేని ఆయన తీరు, అవినీతి, అక్రమాల ఆరోపణలతో ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు టిక్కెట్ వస్తుందా, రాదా అనే చర్చ జరుగుతోంది. రవిశంకర్‌కు టిక్కెట్ ఇస్తే పార్టీ పరంగానే మద్దతు లభించని పరిస్థితులు కనిపిస్తున్నాయి. పైగా చొప్పదండిలో పోటీకి రెండు మూడు పేర్లను నియోజకవర్గ నేతలు తెరపైకి తెస్తున్నారు. మొత్తంగా ఈ ఐదు నియోజకవర్గాల్లో ప్రస్తుతం అధికార బీఆర్ఎస్ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. క్యాడర్ బలంగా ఉన్నా.. లీడర్స్ మధ్య సమన్వయం లేకపోవడంతో రాబోయే రోజుల్లో ఇక్కడి గులాబీ కోటకు ప్రమాదమే అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మరి గులాబీ బాస్ తన కోటకు మరమ్మతులు చేస్తారా? రాబోయే ప్రమాదాన్ని నివారిస్తారా? వేచి చూడాల్సిందే. -
వేములవాడలో ‘రూ. వంద కోట్ల’ ప్రకంపనలు
వేములవాడ: వేములవాడలో రూ.100 కోట్ల కుంభకోణం జరిగిందని, కొందరు అడ్డగోలుగా భూములు, గుట్టలు కబ్జాలు చేసుకున్నారని, ఆ విషయాలను త్వరలోనే బహిర్గతం చేస్తానని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన రమేశ్‌బాబు వ్యాఖ్యలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో సొంతపార్టీ నేతలున్నా వదలబోనని హెచ్చరించడంపై స్థానికంగా జోరుగా చర్చలు సాగుతున్నాయి. వేములవాడలో ఈ నెల 5న జరిగిన టీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొందరు తుపాకీ, మైనింగ్ లైసెన్సులు తీసుకొని రాజ్యమేలాలని చూస్తున్నారని రమేశ్ వ్యాఖ్యానించడంతో స్థానికంగా దుమారం చెలరేగుతోంది. వేములవాడ పట్టణ శివారులోని అగ్రహారం గుట్టలు, నందికమాన్ ప్రాంతంలో భూములను విచ్చలవిడిగా కబ్జా చేస్తున్నారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. దీంతో అధికార పార్టీ నేతలు ఎవరికి వారుగా భుజాలు తడుముకుంటున్నారు. ఇప్పటికే చాలామంది అధికార పార్టీ నాయకులు మైనింగ్ వ్యాపారంలో ఉన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో ఇప్పుడు వారంతా ఆందోళన చెందుతున్నారు. వేములవాడ చుట్టుపక్కల ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి ఎమ్మెల్యే వ్యాఖ్యలు దడ పుట్టిస్తున్నాయి. -
వేములవాడకు త్వరలో ఉపఎన్నిక.. బీజేపీని నాలుగుసార్లు ఓడించా..
తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుంది. పౌరసత్వ వివాదంలో ఇరుక్కున్న రమేశ్‌బాబుకు పదవీ గండం ఉందని, త్వరలోనే వేములవాడకు ఉప ఎన్నిక వస్తుందని రఘునందన్‌రావు జోస్యం చెప్పారు. దీనిపై రమేశ్‌బాబు దీటుగా స్పందించారు. మునుగోడు నుంచి అసెంబ్లీకి మరో ‘ఆర్’ వేములవాడ: ఇప్పటికే అసెంబ్లీలో బీజేపీ తరఫున ట్రిపుల్ ‘ఆర్’ ఉందని, మునుగోడు ఎన్నికతో మరో ‘ఆర్’ అసెంబ్లీలోకి అడుగు పెడుతుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పర్యవేక్షకుడు తిరుపతిరావు, అర్చకుల బృందం స్వామివారి ప్రసాదం అందించి, సత్కరించారు. అనంతరం బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. వేములవాడ ఎమ్మెల్యే పౌరసత్వం అంశంపై కోర్టు తీర్పు వస్తుందని, త్వరలోనే ఇక్కడ కూడా ఉపఎన్నిక జరుగుతుందని చెప్పారు. వేములవాడలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ చేసిన అభివృద్ధి, ఎమ్మెల్యే రమేశ్‌బాబు చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సమైక్యత దినంగా పేరు మార్చి, ఎంఐఎం అనుమతితో ప్రభుత్వం వేడుకలు నిర్వహించిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసింది సెక్యులరిజమా లేక మతతత్వమా? సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వేములవాడ రాజన్న ఆలయానికి ఏటా రూ.100 కోట్లు ఇస్తామని మాట తప్పారన్నారు. మునుగోడులో బీజేపీ గెలుస్తుందని తెలిసి, ఆయనకు నిద్ర పట్టడం లేదని పేర్కొన్నారు. వేములవాడ ఎమ్మెల్యే 8 ఏళ్లుగా చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలన్నారు. కేవలం రంగురంగుల బ్రోచర్లు తప్ప నయాపైసా పని చేయలేదన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, నాయకులు సంతోష్‌బాబు, శ్రీనివాస్, సుదర్శన్‌యాదవ్, అన్నారం శ్రీనివాస్, కిష్టస్వామి, రమేశ్ తదితరులున్నారు. (క్లిక్ చేయండి: కరీంనగర్ జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయాలు) రాజన్న గుడికొచ్చి రాజకీయం చేయొద్దు వేములవాడ: నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను నాలుగుసార్లు ఓడించానని, సొంత బాబాయ్, బీజేపీ అభ్యర్థి సీహెచ్.విద్యాసాగర్‌రావుపై 20 వేల ఓట్లతో గెలిచానని ఎమ్మెల్యే రమేశ్‌బాబు అన్నారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన పౌరసత్వ వివాదం కోర్టు పరిధిలో ఉందని, దానిపై నో కామెంట్ అన్నారు. రాజన్నను దర్శించుకునేందుకు వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు రాజకీయం చేయడం సరికాదని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ చాలా సార్లు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారని, ఆయన వేసుకునే దుస్తులు ఆయన ఇష్టమని తెలిపారు. మంత్రి సారథ్యంలో జిల్లా అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. రాజన్న గుడి చెరువులో 365 రోజులు గోదావరి జలాలు ఉండేలా చూస్తున్నామని, గుడికొచ్చిన మీకు ఇది కనిపించలేదా అని ప్రశ్నించారు. పోచమ్మ ఆలయ అభివృద్ధికి ఇప్పటికే నిధులు కేటాయించామన్నారు. మీరిప్పటి వరకు కేంద్రం నుంచి ఒక్క పైసానన్న రాజన్న ఆలయానికి తీసుకొచ్చారా అని మండిపడ్డారు. వేములవాడలో ఉపఎన్నిక అంటూ ఊదరగొడుతున్నారని అన్నారు. ప్రస్తుత బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ కౌన్సిలర్‌గా ఓడిపోయారని, ఇదీ వేములవాడలో ఆ పార్టీకి ఉన్న బలం అంటూ ఎద్దేవా చేశారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, కౌన్సిలర్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. (క్లిక్ చేయండి: టీఆర్ఎస్లో బయటపడ్డ అంతర్గత విభేదాలు) -
ఎమ్మెల్యే పౌరసత్వంపై వీడని సస్పెన్స్
సాక్షి, హైదరాబాద్ : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై సస్పెన్స్ కొనసాగుతోంది. గతకొంత కాలంగా సాగుతున్న ఈ వివాదంపై మంగళవారం హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నారని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అఫిడవిట్లో తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్ర రావు కోర్టుకు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు గడువుకోసం కోర్టును కోరారు. కేంద్రం మాత్రం వారంలో విచారణ పూర్తిచేయాలని కోరుతోంది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేస్తు.. సిద్ధంగా ఉండాలని హైకోర్టు ఇరుపక్షాలకు సూచించింది. జర్మనీ పౌరసత్వం కలిగి పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలని పిటిషనర్ ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది రవికిరణ్ కోర్టుకు తెలిపారు. చెన్నమనేని రమేష్ పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే అమలుచేయాలని విజ్ఞప్తి చేశారు. రమేష్ పౌరసత్వం వివాదంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా స్పందించింది. చెన్నమనేని పౌరసత్వంపై కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని, ప్రస్తుతం ఆయన దేశంలోని ఉన్నాడని, రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలు అందిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వలన శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలుగటంలేదన్నారు. కాగా 2017లో కేంద్ర హోంశాఖ చేపట్టిన మొదటి విచారణలో రమేష్ భారత పౌరుడు కారని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మళ్లీ ఓ సారి సమీక్షించాలని రమేష్ అభ్యర్తించగా రెండోసారి కేంద్ర హోంశాఖ పౌరసత్వం పై సమీక్షించి.. భారత పౌరుడు కాదని తేల్చింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలను సవాలు చేస్తూ రమేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. సహజ న్యాయ సూత్రాలు పాటించలేదని కోర్టును అభ్యర్థించాడు. దీంతో జూలై 23. 2019 తేదిన గతంలో కేంద్ర హోం శాఖ ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేస్తూ త్రిమెన్ ఇచ్చిన నివేదికను నుంచి పున: పరిశీలించాలని, పౌరసత్వం లో 10(3) నిబంధనను కూడా చట్టప్రకారం పరిశీలించాల్సిందిగా తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. 12 వారాలలో తేల్చాలని కేంద్రహోం శాఖకు తిరిగి అదేశించింది. అక్టోబర్ 31, 2019 న ఢిల్లీలోని కేంద్ర హోం శాఖ బోర్డర్ మేనేజ్ మెంట్ సెక్రటరీ నార్త్ బ్లాక్‌లోని ఓ గది లో ఇరుపక్షాలను విచారించారు. హైకోర్టు ఇచ్చిన 12 వారాల గడువు అనంతరం మళ్లీ కేంద్ర హోం శాఖ చెన్నమనేని భారతదేశ పౌరుడు కాదని తేల్చి చెప్పింది. కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మళ్ళీ చెన్నమనేని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై న్యాయస్థానం విచారిస్తోంది. మరో రెండు వారాల్లో ఇరుపక్షాలు దాఖలు చేసిన కౌంటర్ అనంతరం తిరిగి విచారించనుంది. తుది వాదనలకు అన్ని పార్టీలు సిద్ధంగా ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్ట్ ఎలాంటి ఆదేశాలు జారీచేస్తుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
జర్మనీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. భిక్షాటనతో నిరసన
సాక్షి, కరీంనగర్ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్ట సమయంలో అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే.. కరోనా కాలంలోనూ కంటికి కనిపించడంలేదని మండిపడుతున్నారు. నియోజకవర్గంలో రైతులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నా ఎమ్యెల్యే జాడలేకపోవడంతో నిరసన తెలియజేస్తున్నారు. ప్రజల ఓట్లతో గెలిసి.. జర్మనీలో ఉంటున్న ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గత అసెంబ్లీ ఎన్నికల్లో రమేష్‌పై స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వారు వినూత్న నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జర్మనీలో ఉన్న రమేష్ బాబును నియోజకవర్గానికి రప్పించేందుకు విమాన చార్జీల కోసం గురువారం వేములవాడ రాజన్న ఆలయం ముందు భిక్షాటనకు దిగారు. జర్మనీ నుంచి తమ ఎమ్మెల్యేను ప్రత్యేక విమానం ద్వారా తీసుకురావాలని డబ్బు జమ చేస్తున్నామని వారు తెలిపారు. సొంత నియోజకవర్గ ఎమ్మెల్యే అయినప్పటికీ ప్రజా సమస్యలపై పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని గతంలోనూ రమేష్ విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తమ ఎమ్మెల్యే కనపడుటలేదంటూ పోలీసులు సైతం స్థానికులు ఫిర్యాదు చేసిన సందర్భాలున్నాయి. అయినప్పటికీ ఎమ్మెల్యే తీరు మార్చుకోకపోవడంతో భిక్షాటన చేస్తూ వినూత్న నిరసనకు దిగారు. -
పౌరసత్వం రద్దుపై స్పందించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
హైదరాబాద్: తన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఇచ్చిన ఆదేశాలపై టీఆర్ఎస్ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు స్పందించారు. భారతీయ పౌరుడిగా తన పౌరసత్వ పరిరక్షణకు మళ్ళి హైకోర్టును ఆశ్రయిస్తానని ఆయన తెలిపారు. ద్వంద్వ పౌరసత్వ వివాదంలో జూలై 15, 2019న హైకోర్టు తీర్పు కచ్చితమైన ఆదేశాలను ఇచ్చిందని, ఈ ఆదేశాలను కేంద్ర హోంశాఖ పరిగణలోకి తీసుకోకపోవడం శోచనీయమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘నా పౌరసత్వాన్ని 2017లో కేంద్ర హోంశాఖ రద్దు చేయడంతో దీనిపై హైకోర్టు వెంటనే స్టే ఇచ్చింది. అనంతరం సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం గత జూలై 15న నా పౌరసత్వ రద్దును కొట్టివేసింది. పౌరసత్వ చట్టం నియమ నిబంధనల ప్రకారం నా దరఖాస్తులను సమగ్రంగా, హేతుబధ్ధంగా, వ్యక్తి సామాజిక నిబద్దతను పరిగణిస్తూ (సెక్షన్ 10.3) చూడాలే తప్ప సాంకేతికంగా విడదీసి విశ్లేషించరాదని హైకోర్టు ఆదేశించింది. ఇదే విషయంలో మా రీ-అప్పీలుపై హైకోర్టు స్పందిస్తూ ఒక వేళ సెక్షన్ 10.3ను పరిగణించకుండా ఏ నిర్ణయం తీసుకున్నా.. న్యాయం కోసం మళ్లీ తమ వద్దకు రావచ్చని తేల్చిచెప్పింది. ఈ ఆదేశాల మేరకే గత నెల 31న ఢిల్లీలో మరోసారి వాదనలు జరిగాయి. అయినప్పటికీ హైకోర్టు ఆదేశాలను హోంశాఖ పరిగణనలోకి తీసుకోకపోవడం శోచనీయం’ అని అన్నారు. తన పౌరసత్వ పరిరక్షణకు మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తానని, తనకు తప్పక న్యాయం జరుగుతుందని చెన్నమనేని రమేష్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. -
రైతుబంధు దేశానికే ఆదర్శం...
మేడిపెల్లి : రైతుబందు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే భూమిలేని వారికి కూడా రైతుబీమా వర్తింపజేసేలా సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని వేములవాడ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. గురువారం మేడిపెల్లి మండల కేంద్రంతో పాటు కమ్మరిపేట, భీమారం, రంగాపూర్, కొండాపూర్, విలాయతబాద్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో మహిళలు మంగళహారతులు, బతుకమ్మలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం డప్పు చప్పుళ్ల మధ్య అన్ని గ్రామాలలోని ప్రధాన వీధులలో తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాలలో రమేశ్‌బాబు పార్టీ జెండాలను ఎగురవేసారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాలలో ఆయన మాట్లాడుతూ రైతులను రాజుగా చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకొన్నట్లు చెప్పారు. దీని కోసం ఇప్పటికే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుండగా పంట పెట్టుబడి కింద ఏడాదికి ఏకరానికి రూ.8వేలు, రైతుభీమా కింద చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.5లక్షల ప్రమాద భీమా ఇస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని చూసి మరోసారి అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, ఎంపీపీ కుందారపు అన్నపూర్ణ, జడ్పీటీసీ నెల్లుట్ల పూర్ణిమ, పార్టీ మండల శాఖ అధ్యక్షులు సుధవేని గంగాధర్‌గౌడ్, ఏనుగు మనోహర్‌రెడ్డి, యూత్ అధ్యక్షుడు నల్ల మహిపాల్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు వొద్దినేని హరిచరణ్‌రావు, మిట్టపెల్లి భూమరెడ్డి, కాటిపెల్లి లింగారెడ్డి, ఎంపీటీసీలు, పాల్గొన్నారు. ఎన్ఆర్ఐలకు ప్రత్యేక ప్యాకేజీ ఎన్ఆర్ఐలకు ప్రత్యేక ప్యాకేజీ విషయమై టీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో చేర్చనున్నట్లు వేములవాడ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడిపెల్లి మండలంలోని భీమారంకు వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబును స్థానిక యువకులు ఎన్ఆర్ఐ పాలసీపై అడిగారు. ఈ విషయమై రంగాపూర్‌లో విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్ఆర్ఐలకు ప్రత్యేక ప్యాకేజీ విషయం చేర్చినట్లు చెప్పారు. మేడిపెల్లి మండల కేంద్రంలోని పీఎన్ఆర్ గార్డెన్లో గురువారం నాయిబ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో పలువురు నాయీ బ్రాహ్మణులు టీఆర్ఎస్లో చేరారు. మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, ఎంపీపీ కుందారపు అన్నపూర్ణ, జడ్పీటీసీ నెల్లుట్ల పూర్ణిమ, నాయకులు ఏనుగు మనోహర్‌రెడ్డి, నాయీబ్రాహ్మణులు పాల్గొన్నారు. -
‘చెన్నమనేని’కి అసమ్మతి చిచ్చు!
మేడిపల్లి (వేములవాడ): వేములవాడ టీఆర్ఎస్లో విభేదాలు భగ్గుమన్నాయి. తాజా మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుకు టికెట్ ఇవ్వొద్దని అసమ్మతి నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మేడిపల్లిలో అసమ్మతివాదులు భేటీ అయ్యారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 2,500 మంది పాల్గొన్నారు. టికెట్ రమేశ్‌బాబుకు తప్ప ఎవరికిచ్చినా గెలిపించుకుంటామని, లేకపోతే పార్టీ ఓడిపోవడం ఖాయమని పలువురు అభిప్రాయపడ్డారు. ఎంపీపీ వెంకటేశ్ మాట్లాడుతూ పార్టీలో సీని యర్లపట్ల అణచివేసే ధోరణి అవలంబిస్తున్నారన్నారు. రమేశ్‌బాబుకు టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని మేడిపల్లి మాజీ సర్పంచ్ రాజాగౌడ్ హెచ్చరించారు. సీనియర్ నేతలకు కనీస గౌరవం ఇవ్వడం లేదని చందుర్తి మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య అన్నారు. టికెట్ రమేశ్‌బాబుకు ఇవ్వొద్దని మేడిపల్లి నుంచి వేములవాడ వరకు పాదయాత్రకు ఏర్పాట్లు చేసుకున్నారు. -
మళ్లీ తెరపైకి రమేశ్‌బాబు పౌరసత్వ వివాదం
కరీంనగర్ : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు పౌరసత్వం కేసు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. జర్మనీ పౌరసత్వం కలిగిన రమేశ్ బాబుపై గతంలోనే ఆయన ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. దీనిపై సంవత్సరాలుగా విచారణ కొనసాగుతూనే ఉంది. మరోసారి వేములవాడ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడంతో, తాజాగా ఈ కేసు తిరగతోడడానికి కాంగ్రెస్ సన్నద్దమవుతోంది. డీసీసీ కార్యాలయంలో వేములవాడ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, అసెంబ్లీ అభ్యర్థి బొమ్మ వెంకటేశ్వర్‌తో సమావేశమయ్యారు. రమేశ్ బాబు పౌరసత్వంపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ రమేశ్ బాబును అనర్హుడిగా ప్రకటించేందుకు కృషి చేయాలని, వేములవాడలో ఉప ఎన్నికను అనివార్యం చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మొత్తానికి రమేశ్ బాబు పౌరసత్వం కేసు మరోసారి తెరపైకి వస్తుండడంతో పార్టీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.