
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న టీఆర్‌ఎస్ నాయకులు
మేడిపల్లి (వేములవాడ): వేములవాడ టీఆర్‌ఎస్‌లో విభేదాలు భగ్గుమన్నాయి. తాజా మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుకు టికెట్ ఇవ్వొద్దని అసమ్మతి నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మేడిపల్లిలో అసమ్మతివాదులు భేటీ అయ్యారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 2,500 మంది పాల్గొన్నారు.
టికెట్ రమేశ్‌బాబుకు తప్ప ఎవరికిచ్చినా గెలిపించుకుంటామని, లేకపోతే పార్టీ ఓడిపోవడం ఖాయమని పలువురు అభిప్రాయపడ్డారు. ఎంపీపీ వెంకటేశ్ మాట్లాడుతూ పార్టీలో సీని యర్లపట్ల అణచివేసే ధోరణి అవలంబిస్తున్నారన్నారు. రమేశ్‌బాబుకు టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని మేడిపల్లి మాజీ సర్పంచ్ రాజాగౌడ్ హెచ్చరించారు. సీనియర్ నేతలకు కనీస గౌరవం ఇవ్వడం లేదని చందుర్తి మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య అన్నారు. టికెట్ రమేశ్‌బాబుకు ఇవ్వొద్దని మేడిపల్లి నుంచి వేములవాడ వరకు పాదయాత్రకు ఏర్పాట్లు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment