వేములవాడ బీఆర్ఎస్‌లో ఆరని చిచ్చు.. | MLA Chennamanenis Headache For The BRS | Sakshi
Sakshi News home page

వేములవాడ బీఆర్ఎస్‌లో ఆరని చిచ్చు..

Published Sun, Aug 27 2023 1:32 PM | Last Updated on Sun, Aug 27 2023 2:43 PM

MLA Chennamanenis Headache For The BRS - Sakshi

హైదరాబాద్‌:  బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ వేములవాడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రమేష్‌బాబుకు వ్యవసాయ రంగ సలహాదారు పదవి ఇచ్చినా ఆయనలో మాత్రం ఇంకా నిరసన జ్వాలలు చల్లారలేదు. వేములవాడ టికెట్‌కు తనను కాదని చల్మెడ లక్ష్మీనరసింహారావుకు కేటాయించడంతో రమేష్‌బాబు కినుక వహిస్తున్నారు.  

ఇంకా గుర్రుగానే ఉన్న రమేష్‌బాబు.. హైదరాబాద్‌లో తనను కలిసి బుజ్జగించే యత్నం చేసిన సిరిసిల్ల జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు తోట ఆగయ్యపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు రమేష్‌బాబు. మీరంతా ముందో మాట.. వెనుకో మాట మాట్లాడుతూ బ్యాక్‌ డోర్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారంటూ ఆగయ్యపై సీరియస్‌ అయ్యారు.  అలక వీడని రమేష్ బాబు పంతంతో ఇంకా నివురుగప్పిన నిప్పులాగే వేములవాడ బీఆర్ఎస్‌లో అంతర్గత సంక్షోభం కొనసాగుతోంది. ఇది గులాబీ అధిష్టానానికి మరింత తలనొప్పిగా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement