సాక్షి, రాజన్న సిరిసిల్ల: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు బీఆర్‌ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో పార్టీలో కోల్డ్ వార్ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. చెన్నమనేనికి కేబినెట్ హోదాతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు(వ్యవసాయ రంగ వ్యవహారాలుగా నియమించిన విషయం తెలిసిందే. అనంతరం, సీఎం కేసీఆర్‌ను చెన్నమ్మనేని కలిసి ధన్యవాదాలు తెలిపారు.
ఇక, తాజాగా చెన్నమనేని వేములవాడలో నెలకొన్న అంతర్గత సంక్షోభం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, గురువారం చెన్నమనేని తన తండ్రి రాజేశ్వర రావు శతజయంతి ఉత్సవాల కోసం వేములవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాజకీయాలంటే స్వచ్చంద సంస్థలు, ఫౌండేషన్ల పెట్టి ప్రచారం చేసుకోవడం కాదు. తాము చేసిన నిస్వార్థ సేవతో ప్రజల గుండెల్లో నిలవాలి. అందుకు నా తండ్రి చెన్నమనేని రాజేశ్వర రావు ఒక ఉదాహరణ అంటూ ప్రత్యర్థులకు పరోక్షంగా చురకలు అంటించారు.
ఇదే క్రమంలో ఆయన.. తెలంగాణ సాయుధ పోరాటంలో రావి నారాయణరెడ్డి సారథ్యంలో మా తండ్రి చేసిన పోరాటం మరువలేనిది. సాగునీటి ప్రాజెక్టుల కొరకు ఆయన చేసిన ఉద్యమాలు, పాదయాత్రలు, నిరసన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అందుకే కాళేశ్వరం ప్యాకేజ్-9లోని మల్కపేట రిజర్వాయర్‌కు చెన్నమనేని రాజేశ్వర్ రావు పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ చెప్పడం విశేషం. అందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: సస్పెన్స్ ఓవర్.. కేసీఆర్‌ను కలిసిన చెన్నమనేని
Comments
Please login to add a commentAdd a comment