
సాక్షి, రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో వేములవాడ టికెట్ చల్మెడ లక్ష్మీ నర్సింహరావుకు కేటాయించడంతో బీఆర్‌ఎస్ పార్టీలో రాజుకున్న చిచ్చు ఆరడం లేదు. ముఖ్యమంత్రికి వ్యవసాయ రంగ సలహాదారు పదవి ప్రకటించినా సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబులో జ్వాలలు ఆరడం లేదు. ఈ నేపథ్యంలో వేములవాడలో చల్మెడ వర్సెస్ చెన్నమనేని అనుచరుల మధ్య వార్ కొనసాగుతోంది.
అలక వీడని రమేష్ బాబు పంతంతో వేములవాడ బీఆర్ఎస్ అంతర్గత సంక్షోభం ఇంకా నివురుగప్పిన నిప్పులాగే ఉంది. చెన్నమనేని తీరు గులాబీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. సీఎం కేసీఆర్‌తో సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని భేటీపై రోజుకో తీరు ప్రచారం సాగుతోంది. గత మూడురోజుల నుంచి కేసీఆర్‌ను కలువనున్నట్టు ప్రచారం సాగుతోంది. కానీ ఇప్పటి వరకూ సీఎంను ఆయన కలవలేదు.
ముఖ్యమంత్రి వ్యవసాయ రంగ సలహాదారుగా నియమించినా ఎక్కడా తన స్పందనను తెలియజేయలేదు. ఈ నేపథ్యంలో వేములవాడలో చల్మెడ వర్సెస్ చెన్నమనేని అనుచరుల మధ్య వార్ కొనసాగుతోంది. ఈ క్రమంలో సీఎంను నేడు కలవనున్నట్లు మళ్లీ ప్రచారం మొదలైంది. సోమవారం హరీష్ రావును కలిసిన చెన్నమనేని.. నేడు సాయంత్రం వేములవాడకు చేరుకొని ముఖ్య కార్యకర్తలతో భేటీ కానున్నారు.
ఎల్లుండి ఆగస్ట్ 31న తన తండ్రి దివంగత కమ్యూనిస్ట్ నేత రాజేశ్వర్ రావు శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఏర్పాట్లు ఇప్పటికే మొదలు కాగా.. ఈ మొత్తం పరిణామాలపై చెన్నమనేని స్పందనేంటనేదానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
చదవండి: