ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదు: హైకోర్టు
కరీంనగర్ జిల్లా వేములవాడ ఎమ్మెల్మే చెన్నమనేని రమేష్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అసలు ఆయన భారత పౌరుడే కాదని హైకోర్టు తేల్చిచెప్పింది. తాను భారత దేశ పౌరుడినంటూ ఆయన తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించారని, అందువల్ల అసలు ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక కూడా చెల్లదని కోర్టు తెలిపింది.
రమేష్ పౌరసత్వ వివాదంపై ఆయన సమీప ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు దీనిపై విచారించి, తన తీర్పు వెల్లడించింది. దీంతో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తన పదవిని కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురైంది. గతంలో పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు కేవలం రమేష్ ఒక్కరిదే సరిగా ఉందంటూ దాన్ని స్పీకర్ మనోహర్ ఆమోదించిన విషయం తెలిసిందే. తర్వాత ఆయన మళ్లీ ఎన్నికయ్యారు. అప్పటి ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ ఆయన పౌరసత్వం వివాదంపై కోర్టుకు వెళ్లారు.