
వేములవాడ : ఈ నెల 18న జరిగే వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో జరిగే మహా శివరాత్రి జాతరకు హాజరు కావాల్సిందిగా సీఎం కేసీఆర్‌ను వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ఆహ్వానించారు. ఆలయ ఈవో కృష్ణప్రసాద్, వేద పండితులు సీఎంకు శాలువాకప్పి ఆహ్వాన పత్రిక, తీర్థ ప్రసాదాలు అందజేశారు. 33 జిల్లాల్లో కార్మిక భవనాలు మంజూరు చేసినందుకు కేసీఆర్‌కు మంత్రి మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.