
చెన్నమనేని రమేష్(పాత చిత్రం)
ఎంతకీ వినకపోవడంతో ఆవేశానికి లోనైన రమేష్ బాబు..
వేములవాడ(రాజన్న సిరిసిల్ల జిల్లా) : మేడిపల్లి మండలంలోని వెంకట్రావుపేటలో ఎన్నికల ప్రచారం నిమిత్తం వెళ్లిన టీఆర్‌ఎస్ వేములవాడ అభ్యర్థి చెన్నమనేని రమేష్ బాబును ఆ గ్రామానికి చెందిన యువకులు నిలదీశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఉద్యోగాలు కల్పించలేదని, కనీసం గ్రామంలోని సూల్ కోసం కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని యువకులు ప్రశ్నించారు. రమేశ్‌బాబు ప్రసంగానికి వారు అడ్డుతగలడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు.
నిరసనకారులు ఎంతకీ వినకపోవడంతో ఆవేశానికి లోనైన రమేష్ బాబు.. ఇష్టం లేకుంటే కాంగ్రెస్‌కో, బీజేపీకో ఓటు వేసుకోవాలని, తమ పార్టీ ప్రచారానికి అడ్డు తగలవద్దని చిటపటలాడారు. యువకులను సముదాయించేందుకు స్థానిక మార్కెట్‌యార్డు చైర్మన్ లోక బాపురెడ్డి చేసిన ప్రయత్నమూ ఫలించలేదు. ఒకవైపు యువకులు అడ్డుతగులుతున్నా రమేశ్ బాబు తన ప్రసంగాన్ని మాత్రం ఆపలేదు. అయితే, స్వయంగా టీఆర్‌ఎస్ అభ్యర్థే.. నచ్చకపోతే ప్రత్యర్థి పార్టీలకు ఓటు వేయమని చెప్పడం పలువురిని ఆశ్చర్యపరిచింది.