వేములవాడ ఎమ్మెల్యేకు మాతృవియోగం
వేములవాడ(కరీంనగర్): వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుకు మాతృవియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి లలితాదేవి (80) అనారోగ్యంతో బుధవారం తుదిశ్వాస విడిచారు. తెలంగాణ సాయుధ పోరాటంలో భర్త రాజేశ్వర్ రావుతో కలసి అజ్ఞాతంలో పని చేశారు. రాజేశ్వర్ రావు ఇటీవలనే మృతిచెందారు. అప్పటి నుంచి అనారోగ్యం పాలైన లలితాదేవి హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కుమారుడు ఎమ్మెల్యే రమేష్ బాబు, జర్మనీలో ఉన్న కోడలు మరియా, మనమడు వరుణ్, మనమరాలు సంగీత హైదరాబాద్ చేరుకున్నారు.
తెలంగాణ సాయుధ పోరాటయోధుడు, సీనియర్ రాజకీయ నాయకుడు అయిన చెన్నమనేని రాజేశ్వర్ రావు భార్య లలితాదేవి. రాజేశ్వర్ రావు ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేశారు. 2009లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొని కుమారుడు రమేశ్‌కు టికెట్ ఇప్పించారు. 2016 మే 9వ తేదీన ఆయన అనారోగ్యంతో మరణించారు. రాజేశ్వరరావు సోదరుడు చెన్నమనేని విద్యాసాగరరావు ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న విషయం తెలిసిందే.