mother passes away
-
కేంద్రమంత్రికి మాతృవియోగం
న్యూఢిల్లీ: రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి చంద్రకాంత గోయల్ వృద్ధాప్యంతో శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఈ మేరకు తల్లి మరణవార్తను పీయూష్ గోయల్ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. 'తన తల్లి జీవితాన్ని ప్రజలకు సేవచేయడానికే అంకితం చేసిందని, ఇతరులను కూడా అదే విధంగా సమాజ శ్రేయస్సుకు పాటుపడేలా ప్రేరేపించారంటూ' ట్వీట్ చేశారు. కాగా.. ఆమెను శనివారం ఉదయం దహనం చేసినట్లు మహరాష్ట్ర బీజేపీ నాయకులు, మాజీ మంత్రి వినోద్ తవ్డే తెలిపారు. చదవండి: 40 వేలు దాటిన కరోనా మరణాలు ఎమర్జెన్సీ తర్వాత చంద్రకాంత గోయల్ ముంబై కార్పొరేటర్‌గా పనిచేశారు. అనంతరం మాతుంగా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు బీజేపీ తరుపున ప్రాతినిధ్యం వహించారు. ఆమె భర్త, దివంగత వేద్ ప్రకాష్ గోయల్ బీజేపీ జాతీయ కోశాధికారిగా చాలా కాలంపాటు పనిచేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో షిప్పింగ్ మంత్రిగా కూడా పనిచేశారు. చదవండి: ఆరుగురికి కరోనా; ఈడీ ప్రధాన కార్యాలయం సీజ్ अपने स्नेह, और प्रेम से मुझे हमेशा राह दिखाने वाली मेरी पूज्य माता जी का आज सुबह स्वर्गवास हो गया। उन्होंने अपना पूरा जीवन सेवा करते हुए बिताया, और हमें भी सेवाभाव से जीवन बिताने को प्रेरित किया। ईश्वर उन्हें अपने श्री चरणों मे स्थान दें। ॐ शांतिः pic.twitter.com/mwlIks6TBJ — Piyush Goyal (@PiyushGoyal) June 6, 2020 -
అలీకి మాతృ వియోగం, చిరు పరామర్శ
ప్రముఖ హాస్యనటుడు అలీకి మాతృ వియోగం కలిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న అలీ తల్లి జైతున్ బీబీ బుధవారం రాత్రి 11.41 గంటలకు కన్నుమూశారు. ప్రస్తుతం రాజమండ్రిలోని అలీ సోదరి నివాసంలో ఉంటున్న ఆమె.. అక్కడే ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం రాంచీలో ఉన్న అలీ.. ఈ విషయం తెలుసుకున్న వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు. మరోవైపు అలీ తల్లి జైతున్ బీబీ మృతదేహాన్ని బంధువులు హైదరాబాద్‌కు తరలించారు. ఈ సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు అలీని పరామర్శించారు. జైతున్ బీబీ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఇక ప్రముఖ నటుడు చిరంజీవి పరామర్శ సందర్భంగా అలీ కంటతడి పెట్టారు. మరోవైపు గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో జైతున్ బీబీకి అంత్యక్రియలు నిర్వహఙంచారు. కాగా, తల్లిపై తనకున్న ప్రేమను అలీ పలు సందర్భాల్లో గుర్తుచేసుకున్న సంగతి తెలిసిందే. పలు వేదికలపై కూడా తన తల్లి గురించి అలీ ఎంతో గొప్పగా చెప్పేవారు. -
ఈవీవీ ఇంట్లో విషాదం
సాక్షి, నిడదవోలు రూరల్: నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామానికి చెందిన సినీ దర్శకుడు, స్వర్గీయ ఈవీవీ సత్యనారాయణ తల్లి, సినీ నటుడు అల్లరి నరేష్ నాయనమ్మ ఈదర వెంకటరత్నమ్మ(87) సోమవారం ఆమె స్వగృహంలో కన్నుమూశారు. ఈవీవీ సత్యనారాయణ 2011లో మరణించగా.. అప్పటి నుంచి తల్లి వెంకటరత్నమ్మ కోరుమామిడిలోనే నివసిస్తున్నారు. అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్, దర్శకుడు ఈవీవీ సత్తిబాబు, నిర్మాత కానుమిల్లి అమ్మిరాజు, సరిదే బాలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈదర వెంకట్రావు, వెంకరత్నమ్మ దంపతులకు ఈవీవీ సత్యనారాయణ, గిరి, శ్రీనివాస్ ముగ్గురు కుమారులుండగా, కుమార్తె ముళ్లపూడి మంగ ఉన్నారు. పలువురు సినీ ప్రముఖులు, గ్రామపెద్దలు వెంకటరత్నమ్మ మృతికి సంతాపం తెలిపారు. -
బీజేపీ నేత కిషన్‌రెడ్డికి మాతృవియోగం
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మాతృమూర్తి గంగాపురం ఆండాలమ్మ(80) గురువారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమెను కుటుంబసభ్యులు ఈ నెల 23న ఇక్కడి హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. తల్లి మృతితో బర్కత్‌పురలోని కిషన్‌రెడ్డి ఇంటివద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమెకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు కాగా కిషన్‌రెడ్డి అందరి కంటే చిన్నవాడు. ఆండాలమ్మ పార్థివదేహాన్ని స్వగ్రామమైన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌కు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. రాష్ట్రమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయతోపాటు వివిధ పార్టీల నేతలు, ప్రజా, కుల సంఘాల నేతలు కిషన్‌రెడ్డిని కలసి ఓదార్చారు. కిషన్‌రెడ్డికి సానుభూతి తెలిపిన రాష్ట్రపతి కిషన్‌రెడ్డి తల్లి ఆండాలమ్మ మరణించిన విషయం తెలియడంతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, పలువురు కేంద్ర, రాష్ట్రమంత్రులు, వివిధ పార్టీల నేతలు కిషన్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబసభ్యులకు సానుభూతిని ప్రకటించారు. ఏపీ, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు, యోగి ఆదిత్యనాథ్, ఫడ్నవిస్, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, బీజేపీ తెలంగాణ, ఏపీ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, కన్నా లక్ష్మీనారాయణ, నాయకులు మురళీధర్‌రావు, ఇంద్రసేనారెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, ఎన్వీఎస్ ప్రభాకర్, ఎన్.రాంచందర్‌రావు, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, టీఆర్ఎస్ నేతలు కేటీఆర్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, సీపీఐ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, జస్టిస్ నరసింహారెడ్డి, ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ తదితరులు కిషన్‌రెడ్డికి సానుభూతి తెలిపినవారిలోఉన్నారు. పలువురు నేతలు ఆండాలమ్మ పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ సంతాపం కిషన్‌రెడ్డి తల్లి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
హీరో రాజశేఖర్‌కు మాతృ వియోగం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ హీరో రాజశేఖర్ మాతృమూర్తి ఆండాళ్ వరదరాజ్ (82) తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురయ్యారు. దీంతో హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న ఆమె బుధవారం ఉదయం కన్నుమూశారు. మృతదేహాన్ని చైన్నైకి తరలించి, గురువారం ఉదయం ఆమెకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. రాజశేఖర్ రెండో సంతానం. -
వేములవాడ ఎమ్మెల్యేకు మాతృవియోగం
వేములవాడ(కరీంనగర్): వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుకు మాతృవియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి లలితాదేవి (80) అనారోగ్యంతో బుధవారం తుదిశ్వాస విడిచారు. తెలంగాణ సాయుధ పోరాటంలో భర్త రాజేశ్వర్ రావుతో కలసి అజ్ఞాతంలో పని చేశారు. రాజేశ్వర్ రావు ఇటీవలనే మృతిచెందారు. అప్పటి నుంచి అనారోగ్యం పాలైన లలితాదేవి హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కుమారుడు ఎమ్మెల్యే రమేష్ బాబు, జర్మనీలో ఉన్న కోడలు మరియా, మనమడు వరుణ్, మనమరాలు సంగీత హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటయోధుడు, సీనియర్ రాజకీయ నాయకుడు అయిన చెన్నమనేని రాజేశ్వర్ రావు భార్య లలితాదేవి. రాజేశ్వర్ రావు ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేశారు. 2009లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొని కుమారుడు రమేశ్‌కు టికెట్ ఇప్పించారు. 2016 మే 9వ తేదీన ఆయన అనారోగ్యంతో మరణించారు. రాజేశ్వరరావు సోదరుడు చెన్నమనేని విద్యాసాగరరావు ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న విషయం తెలిసిందే. -
సుబ్రతో రాయ్ కి మాతృవియోగం: విడుదలపై సందిగ్ధం
లక్నో: సహారా సంస్థల అధినేత సుబ్రతోరాయ్ మాతృమూర్తి చ్ఛబీ రాయ్ (95) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో లక్నోలోని తమ నివాసంలో తుదిశ్వాస విడిచారని సహారా అధికార ప్రతినిధులు తెలిపారు. ముదుపు దారులను మోసం చేశారనే ఆరోపణలపై గడిచిన రెండేళ్లుగా జైలులో ఉంటోన్న సుబ్రతోరాయ్ కి తన తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కోర్టు అనుమతి ఇస్తుందా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందున ఆమె దగ్గర ఉండేదుకు బెయిల్ మంజూరు చేయాలని సుబ్రతోరాయ్ పలు మార్లు సుప్రీంకోర్టుకు విన్నవించుకున్న సంగతి తెలిసిందే. అయితే సుబ్రతో తన తల్లిని ఆసుపత్రిలో చర్పించలేదని, ఇంట్లోనే ఉంచి చికిత్స చేయిస్తున్నారని సెబీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేయడంతో ఆ విషయం వివాదంగా మారింది. తల్లి సెంటిమెంట్ ను అడ్డంపెట్టుకుని సుబ్రతో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారంటూ డిఫెన్స్ న్యాయవాదులు గట్టిగా వాదించడంతో సహారా చీఫ్ కు బెయిల్ దొరకలేదు. ఇప్పుడు ఆమె మరణించినందువల్ల రాయ్ కి తప్పక అనుమతి లభించవచ్చని సమాచారం. బిహార్ లోని అరారియా జిల్లాలో జన్మించిన చ్ఛబీ రాయ్.. లక్నోవాసి సుధీర్ చంద్రరాయ్ ని పెళ్లాడారు. వారి సంతానమైన సుబ్రతో వ్యాపార రంగంలోకి ప్రవేశించి అనతికాలంలోనే అత్యున్నతస్థాయికి చేరారు. అంతలోనే పాతాళానికి పడిపోయారు. సహారా పరివార్ ప్రయాణంలో చ్ఛబీ రాయ్ చుక్కానిలా మార్గదర్శకత్వం వహించారని ఆమె మరణంపై విడుదల చేసిన ప్రకటనలో సహారా పరివార్ పేర్కొంది. చ్ఛబీ రాయ్ కి 1998 పేర్ మేకర్ ను అమర్చారు. 2008లో మరోసారి దానిని రీప్లేస్ చేశారు. దీనితోపాటు శ్వాస సంబంధమైన వ్యాధులతోనూ ఆమె బాధపడేది.