ఈవీవీ ఇంట్లో విషాదం | EVV Satyanarayana Mother Passes Away | Sakshi
Sakshi News home page

ఈవీవీ ఇంట్లో విషాదం

Published Tue, May 28 2019 9:26 AM | Last Updated on Tue, May 28 2019 5:40 PM

EVV Satyanarayana Mother Passes Away - Sakshi

ఈదర వెంకటరత్నమ్మ(ఫైల్‌).. అంత్యక్రియల్లో పాల్గొన్న అల్లరి నరేష్, ఆర్యన్‌ రాజేష్‌

సాక్షి, నిడదవోలు రూరల్‌: నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామానికి చెందిన సినీ దర్శకుడు, స్వర్గీయ ఈవీవీ సత్యనారాయణ తల్లి, సినీ నటుడు అల్లరి నరేష్‌ నాయనమ్మ ఈదర వెంకటరత్నమ్మ(87) సోమవారం ఆమె స్వగృహంలో కన్నుమూశారు. ఈవీవీ సత్యనారాయణ 2011లో మరణించగా.. అప్పటి నుంచి తల్లి వెంకటరత్నమ్మ కోరుమామిడిలోనే నివసిస్తున్నారు.

అల్లరి నరేష్, ఆర్యన్‌ రాజేష్, దర్శకుడు ఈవీవీ సత్తిబాబు, నిర్మాత కానుమిల్లి అమ్మిరాజు, సరిదే బాలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈదర వెంకట్రావు, వెంకరత్నమ్మ దంపతులకు ఈవీవీ సత్యనారాయణ, గిరి, శ్రీనివాస్‌ ముగ్గురు కుమారులుండగా, కుమార్తె ముళ్లపూడి మంగ ఉన్నారు. పలువురు సినీ ప్రముఖులు, గ్రామపెద్దలు వెంకటరత్నమ్మ మృతికి సంతాపం తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement