Evv Satyanarayana
-
హీరో అల్లరి నరేశ్ తండ్రి నన్ను అడ్జస్ట్మెంట్ అడిగాడు: షకీల
టాలీవుడ్‌లోని ఓ స్టార్ హీరో టార్చర్ వల్ల సినిమాలే వదిలేశానంటూ ఇటీవల నటి విచిత్ర చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి. ఆయన ప్రవర్తన వల్ల ఇండస్ట్రీని వదిలేశానని, 20 ఏళ్లుగా స్క్రీన్‌పై కనిపించనేలేదని చెప్పింది. తాజాగా షకీల.. విచిత్రకు మద్దతు తెలుపుతూ తాను కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్నట్లు తెలిపింది. టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ తండ్రి తనను అడ్జస్ట్మెంట్ గురించి అడిగాడని ఆరోపించింది. విచిత్ర అతడి పేరు చెప్పాల్సింది తమిళ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'విచిత్ర నా స్నేహితురాలు. మేమిద్దరం కొన్ని సినిమాల్లో కలిసి నటించాం కూడా! ఏ హీరో తనను గదిలోకి పిలిచాడు? ఎవరి వల్ల ఇండస్ట్రీని వదిలేయాల్సి వచ్చిందనేది చెప్తే బాగుండేది. అతడి పేరు బయటపెట్టి ఉండాల్సింది. నేను ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో పని చేస్తున్నాను. గతంలో నేను కూడా ఇక్కడ ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఒకానొక సమయంలో అల్లరి నరేశ్ తండ్రి, దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ నన్ను అడ్జస్ట్మెంట్ అడిగాడు. అడ్జస్ట్ అయిపో.. ఇంకో సినిమా ఇస్తా.. తనతో అడ్జస్ట్ అయితే నాకు నెక్స్ట్ సినిమా ఛాన్స్ ఇస్తానన్నాడు. అప్పుడు నేను.. సర్, ఇప్పుడీ సినిమాలో నటించినందుకు నాకు డబ్బులిచ్చేశారు. ఇంకో సినిమా ఛాన్స్ నాకు అక్కర్లేదు. అంత అవసరం కూడా లేదు అని ముఖం మీదే చెప్పాను. ఇప్పుడాయన బతికి లేరు. దీని గురించి నన్ను టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు పిలిచి అడిగినా చెప్తా.. అవును, ఆ రోజు ఆయన నన్ను తన గదికి పిలిచాడు. ఇదే నిజం..' అని చెప్పుకొచ్చింది షకీల. ఈమె వ్యాఖ్యలు టాలీవుడ్లో ప్రకంపనలు రేపుతున్నాయి. కాగా బోల్డ్ నటిగా పేరు తెచ్చుకున్న షకీల ఇటీవలే బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో అడుగుపెట్టింది. రెండు వారాలకే హౌస్‌లో నుంచి ఎలిమినేట్ అయింది. చదవండి: నా కూతురు సహజీవనం చేస్తానంటే బలవంతంగా మొదటి పెళ్లి చేశా.. చివరకు.. -
శ్వాస విడిచిన యాస.. ఈవీవీ బా.. ఇక లేరు..
రాజమహేంద్రవరం రూరల్ (తూర్పుగోదావరి జిల్లా): ప్రముఖ రచయిత, గోదారి యాస నా శ్వాస అంటూ గోదావరి జిల్లా యాస భాషలను కాపాడుకునేందుకు అనునిత్యం కృషిచేసిన గోదారోళ్ళ కితకితలు ఫేస్బుక్ గ్రూప్ సృష్టికర్త ఈదల వీరవెంకట సత్యనారాయణ(ఈవీవీ) గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. శుక్రవారం బొమ్మూరులోని శివాలయం సమీపంలో ఉన్న ఈవీవీ స్వగృహం వద్ద ఆయన భౌతికకాయాన్ని బంధువులు, స్నేహితులు, గ్రూపు సభ్యులు, కోకోకోలా కంపెనీ ఉద్యోగులు అధికసంఖ్యలో వచ్చి సందర్శించి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ఈవీవీ భౌతికకాయాన్ని ర్యాలీగా ఇన్నీసుపేటలో రోటరీ కైలాసభూమికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈవీవీ మరణవార్త తెలియగానే ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతో పాటు, ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ఫేస్బుక్ మిత్రులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈవీవీ భార్య, ఇద్దరు కుమార్తెలను, తల్లి, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని తెలియజేశారు. గోదారోళ్ల కితకితలు ఐదవ ఆత్మీయ కలయికలో గ్రూపు సభ్యులతో ఈవీవీ సత్యనారాయణ (పాతచిత్రం) గోదావరి యాసపై విపరీతమైన మక్కువతో... గోదావరి యాసపై విపరీతమైన మక్కువ కలిగిన ఈదల వీరవెంకట సత్యనారాయణ(ఈవీవీ) 2016లో గోదారోళ్ళ కితకితలు పేరిట ఫేస్బుక్ గ్రూప్ ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ ఉన్నవారినో ఒకటి చేశారు. ఆరోగ్యకరమైన హాస్యానికి జీవం పోస్తూ మంచి రచయితగా అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆ తరువాత జరిగిన ఓ ప్రమాదంలో ఓ స్నేహితుణ్ణి కాపాడి సంచలనంగా మారారు. ప్రాణం కాపాడిన ఫేస్బుక్ స్నేహం అంటూ అప్పట్లో వార్తకథనాలు ప్రసారం కావడంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. అనంతరం కొద్దిరోజులకే గ్రూప్ లక్షమందిని చేరుకుని ఒక ప్రత్యేకతను ఏర్పరచుకుంది. గ్రూప్ పెట్టిన దగ్గర నుంచి ఈవీవీ హాస్యకథనాలతో పాటు మధ్యతరగతి ప్రజల స్థితిగతులపై కట్టిపడేసే కథనాలను పోస్ట్ చేస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. గోదారోళ్ళకితకితలు గ్రూప్ సభ్యులందరిని ఆత్మీయ కలయిక పేరుతో ఏటా ఒకే వేదికపై తీసుకువచ్చేవారు. ప్రస్తుతం ఫేస్బుక్ గ్రూప్ సభ్యుల సంఖ్య రెండులక్షలకు పైగా చేరుకుంది. ఈవీవీ మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య, కుమార్తెలు సినిమా నటుడిగా... ఈవీవీ ఇటీవలే సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించారు. నాగార్జున, నాగచైతన్య బంగార్రాజు సినిమాలో ఒక కీ రోల్లో నటించి అందరినీ మెప్పించారు. షార్ట్ఫిల్మ్స్లో నటించారు. గోదారోళ్ల గుండెల్లో పదిలం అందరికీ నవ్వులు అందిస్తూ ఆయుష్షు పెంచే ఉద్యమంలో అహర్నిశలు శ్రమిస్తున్న ఈవీవీ ఆయుష్షు అర్థంతరంగా ముగియడమేమిటి ! గోదారోళ్ళ యాసకు, ఎటకారాలకు చావుండదు. మన ఈవీవీ చిరంజీవి, గోదారోళ్ళ యాసలో, శ్వాసలో గుండెల్లో పదిలంగా ఉంటాడు. – కర్రి రామారెడ్డి, మానసిక వైద్యనిపుణులు, రాజమహేంద్రవరం -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ ఈవీవీ సత్యనారాయణ
-
ఈవీవీ ఇంట్లో విషాదం
సాక్షి, నిడదవోలు రూరల్: నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామానికి చెందిన సినీ దర్శకుడు, స్వర్గీయ ఈవీవీ సత్యనారాయణ తల్లి, సినీ నటుడు అల్లరి నరేష్ నాయనమ్మ ఈదర వెంకటరత్నమ్మ(87) సోమవారం ఆమె స్వగృహంలో కన్నుమూశారు. ఈవీవీ సత్యనారాయణ 2011లో మరణించగా.. అప్పటి నుంచి తల్లి వెంకటరత్నమ్మ కోరుమామిడిలోనే నివసిస్తున్నారు. అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్, దర్శకుడు ఈవీవీ సత్తిబాబు, నిర్మాత కానుమిల్లి అమ్మిరాజు, సరిదే బాలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈదర వెంకట్రావు, వెంకరత్నమ్మ దంపతులకు ఈవీవీ సత్యనారాయణ, గిరి, శ్రీనివాస్ ముగ్గురు కుమారులుండగా, కుమార్తె ముళ్లపూడి మంగ ఉన్నారు. పలువురు సినీ ప్రముఖులు, గ్రామపెద్దలు వెంకటరత్నమ్మ మృతికి సంతాపం తెలిపారు. -
చమేలీ రాణి అని నన్ను ఆటపట్టించింది
‘‘జంబలకిడి పంబ’ చిత్రానికి కథే హీరో. చాలా బాగుంటుంది. అమ్మాయి ఆత్మ అబ్బాయిలోకి, అబ్బాయి ఆత్మ అమ్మాయిలోకి ప్రవేశించడం ఇందులో ప్రత్యేకత. అమ్మాయిలాగా చేయడానికి ప్రత్యేకించి హోమ్‌వర్క్ చేయలేదు. చిరంజీవిగారి ‘చంటబ్బాయి’, నరేశ్‌గారి, రాజేంద్రప్రసాద్‌గారి సినిమాలు చూశా. ఇంట్లో కూడా కాసేపు మా ఆవిడ నైటీ వేసుకుని ఎలా ఉంటుందో చూశా’’ అని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన హీరోగా, సిద్ధి ఇద్నాని హీరోయిన్గా జె.బి. మురళీకృష్ణ (మను) దర్శకత్వంలో రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి.ఎన్ నిర్మించిన ‘జంబలకిడి పంబ’ రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి పంచుకున్న విశేషాలు... ∙ఈవీవీగారి ‘జంబలకిడి పంబ’కి, మా సినిమాకి పొంతన ఉండదు. ఆ చిత్రంలో ఊర్లో వాళ్లందరూ అటూ ఇటూ మారితే, మా సినిమాలో ఒక కుటుంబంలోని భార్యాభర్తలు మాత్రమే మారతారు. ∙ఈ పాత్ర చేయడానికి ఇబ్బందులు పడలేదు. కాకపోతే నైటీలు, లిప్‌స్టిక్‌లు వేసుకుని కేరవ్యాన్ నుంచి దిగేటప్పుడు కొంత సేపు ఇబ్బందిగా అనిపించింది. నాకు ఇద్దరమ్మాయిలు. మా ఆవిడతో మా పెద్దమ్మాయి ఆకృతి ‘చూడమ్మా.. మనింటికి చమేలీ రాణి వచ్చింది’ అని ఆటపట్టించేది. ∙మను తొలి చిత్రం ‘రైట్ రైట్’ నేను చూడలేదు. ‘జంబలకిడి పంబ’ కథ బాగుందనిపించింది. రెండు సార్లు విన్నా. మొన్న సినిమా చూశాక చెప్పింది చెప్పినట్టు తీశాడనిపించింది. మనుకి సంగీత దర్శకుడు గోపీసుందర్ ఎప్పటి నుంచో ఫ్రెండ్. కథ నచ్చే గోపీసుందర్ ఈ సినిమా చేశారు. పాటలు చూసి మా అమ్మా నాన్న కూడా మెచ్చుకున్నారు. నిర్మాతలు ఖర్చుకు వెనకాడలేదు. ∙ఈ చిత్రంలో ఓ చోట పీరియడ్స్ గురించి చాలా సెన్సిటివ్‌గా చెప్పాం. సున్నితమైన అంశాలను చాలా చక్కగా డీల్ చేశారని సెన్సార్ బోర్డులోని మహిళలు అనడం సంతోషంగా ఉంది. ∙నేను హీరోని అనుకోను. మంచి కాన్సెప్ట్ సినిమాలు చేస్తున్నానని అనుకుంటా. దానివల్ల నాపై ఒత్తిడి ఉండదు. త్రివిక్రమ్‌గారు కూడా అలాంటి ప్రెజర్‌ని మోయవద్దనే చెబుతారు. నేను సెట్లోకి వెళ్లగానే ‘మనది మల్టీస్టారర్ సినిమా. శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నాడు’ అని కొందరు ఆట పట్టిస్తుంటారు. ‘ఫ్లైయింగ్ కలర్స్’ అని మేం 13 మంది ఒక గ్రూప్‌లో ఉంటాం. అందరం ఓ ప్రొడక్షన్ హౌస్ పెడతాం. ప్రతిభ ఉన్నవాళ్లతో సినిమాలు చేస్తాం. ∙‘జంబలకిడి పంబ’ క్లైమాక్స్‌లో మా చిన్నపాప ఆశ్రితి కనిపిస్తుంది. ప్రస్తుతం త్రివిక్రమ్‌గారి మూవీ, రవితేజ సినిమా, పంతం, వీరభోగ వసంతరాయలు’ సినిమాల్లో చేస్తున్నా. హీరోగానూ ఓ సినిమా ఉంది. వివరాలు త్వరలోనే చెబుతాం. ‘గీతాంజలి 2’ చిత్రం కోసం ఇంకా నన్ను ఎవరూ సంప్రదించలేదు. -
ఇ వి వి సినిమా
-
విలన్‌గా మారుతున్న మరో హీరో
స్టార్ డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరో ఆర్యన్ రాజేష్. కెరీర్ స్టార్టింగ్‌లో కాస్త ఫరవాలేదనిపించినా.. తరువాత వరుస ఫ్లాప్‌లతో నిరాశపరిచాడు. తరువాత వ్యాపారాలతో బిజీగా కావటంతో సినీరంగానికి పూర్తిగా దూరమయ్యాడు. అదే సమయంలో ఆర్యన్ తమ్ముడు అల్లరి నరేష్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకొని 50పైగా సినిమాలు చేసి సత్తా చాటాడు. సినీ నిర్మాణంతో పాటు ఇతర వ్యాపారాల్లోనూ బిజీగా ఉన్న ఆర్యన్ రాజేష్‌కు నటనమీద ఆసక్తితగ్గలేదు. అందుకే త్వరలో రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. అయితే టాలీవుడ్ హీరోల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో ప్రస్తుతం ప్రతినాయక పాత్రలకు మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకే త్వరలో విలన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు రాజేష్. ఎక్కువగా లవర్ బాయ్ తరహా సినిమాలు చేసిన రాజేష్, విలన్‌గా ఎంట్రీ ఇస్తే, అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. -
ఈవీవీ పునర్జన్మనిచ్చారు
కొవ్వూరు :దర్శకుడు తేజ తనకు సినిమా పరిశ్రమలో జన్మనిస్తే, దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ పునర్జన్మనిచ్చారని నటి గీతాసింగ్ తెలిపారు. కొవ్వూరు మండలం పశివేదలలో ఓ చిత్రం షూటింగులో పాల్గొనేందుకు వచ్చిన ఆమె ‘సాక్షి’తో ముచ్చటించారు. ప్రస్తుత సినిమాలో పోలీసు కానిస్టేబుల్‌గా నటిస్తోన్న గీతాసింగ్ రాజస్థానీ అమ్మాయి. కితకితలు సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇచ్చి, తెలుగును స్వచ్ఛంగా మాట్లాడేలా తర్ఫీదునిచ్చిన ఈవీవీకి రుణపడి ఉంటాన్నారు. ఆ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా రీమైకై హిట్టయ్యిందన్నారు. ఇప్పటివరకూ 80 వరకూ తెలుగు చిత్రాల్లో నటించానని, కామెడీతో కూడిన పోలీసాఫీసర్ క్యారెక్టర్ చేయాలని ఉందని అన్నారు. ప్రస్తుతం తెలుగులో మూడు, కన్నడంలో ఒక సినిమా చేస్తున్నట్టు చెప్పారు. -
వినోదంగా దోచేస్తాడు!
అల్లరి నరేశ్ ‘బందిపోటు’గా మారారు. అయితే... ఆయన చేసేది వినోదంతో కూడిన దోపిడి. ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ ‘బందిపోటు’కు నిర్దేశకుడు. ఈవీవీ సినిమా పతాకంపై ఆర్యన్ రాజేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో ఈవీవీ సత్యనారాయణ జయంతి సందర్భంగా ప్రారంభమైంది. ముహూర్తపు దృశ్యానికి డి.సురేశ్‌బాబు కెమెరా స్విచాన్ చేయగా, డి.రామానాయుడు క్లాప్ ఇచ్చారు. ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ -‘‘సినిమాపై నాకు అభిమానం పెరగడానికి, సినీరంగం వైపు నా అడుగులు పడటానికి కారణం ఈవీవీ సత్యనారాయణ. ఇప్పుడు ఆయన సంస్థ నిర్మించే చిత్రానికి నేను దర్శకుణ్ణి కావడం గర్వంగా ఉంది. ఇది చక్కని వినోదంతో కూడిన కథ. ఇందులో వ్యంగ్యాస్త్రాలు కానీ, పేరడీలు కానీ ఉండవు’’ అని చెప్పారు. ‘‘ఇంద్రగంటి సినిమా అనగానే ఇదేదో ప్రయోగమని అందరూ భావిస్తున్నారు. అయితే ఇది అలాంటి సినిమా కాదు... పూర్తి వినోదాత్మక చిత్రం. ఈ సినిమాకు అన్నయ్య రాజేశ్ నిర్మాత. ఇక నుంచి మా సంస్థలో బయట హీరోలతోనూ సినిమాలు చేస్తాం. అందుకని అన్నయ్య నిర్మాణానికే అంకితమవుతారని అనుకోవద్దు. మంచి పాత్రలు దొరికితే... విలన్‌గా కనిపించడానికి కూడా అన్నయ్య రెడీగా ఉన్నారు. త్వరలో ఆయన్ను తెరపై విలన్‌గా చూడొచ్చు’’అని తెలిపారు అల్లరి నరేశ్. ఆర్యన్ రాజేశ్ మాట్లాడుతూ -‘‘మా సంస్థ నిర్మించే సినిమా నాన్న గౌరవం పెంచేలా ఉండాలి. అందుకే మంచి కథ కోసం ఇన్నాళ్లూ ఎదురుచూశాం. జూలై తొలివారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి, నవంబర్‌లో సినిమాను విడుదల చేస్తాం. బాలీవుడ్ యశ్‌రాజ్ సంస్థ స్థాయిలో ‘ఈవీవీ సినిమా’ను నిలబెట్టాలనేది మా ధ్యేం. ఇక నుంచి టీవీ సీరియల్స్ కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నాం’’ అని చెప్పారు. కథానాయిక ఈషా, సంగీత దర్శకుడు కల్యాణ్ కోడూరి, కెమెరామేన్ పీజీ విందా మాట్లాడారు. -
ఆ ఒక్కటీ అడిగెయ్...
అప్పట్లో ఈవీవీ సత్యనారాయణ ‘ఆ ఒక్కటీ అడక్కు’ అన్నారు. ఇప్పుడేమో శివనాగేశ్వరరావు ‘ఆ ఒక్కటీ అడిగెయ్’ అంటున్నారు. కొంత విరామం తర్వాత శివనాగేశ్వరరావు దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి ఈ టైటిల్ ఖరారు చేశారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమాకు ఇప్పటికే కథ సిద్ధమైంది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే లక్ష్యంగా శివనాగేశ్వరరావు గత కొన్నాళ్లుగా కసరత్తులు చేసి పక్కాగా స్క్రిప్టు తయారు చేసుకున్నారు. ప్రస్తుతం తారాగణం ఎంపికలో ఆయన బిజీగా ఉన్నారు. ఇతర వివరాలు త్వరలోనే అధికారికంగా తెలుస్తాయి. -
ఈవీవీ సత్యనారాయణ సోదరుడు గిరి కన్నుమూత
దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ సోదరుడు ఈవీవీ గిరి (49) మంగళవారం హైదరాబాద్‌లో మరణించారు. ఆయన గత కొంత కాలంగా కామెర్ల వ్యాధితో బాధపడుతున్నారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకునిగా వ్యవహరించిన పలు చిత్రాలకు గిరి ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఎల్లుండి.. గురువారం నాడు హైదరాబాద్‌లో ఈవీవీ గిరి అంత్యక్రియలు జరుగుతాయి. ప్రముఖ హాస్య దర్శకుడైన ఈవీవీ సత్యనారాయణ పలు విజయవంతమైన చిత్రాలు తీశారు. ఆయన కుమారులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ హీరోలుగా ఉన్న విషయం తెలిసిందే. సత్యనారాయణ కూడా అనారోగ్యంతో తక్కువ వయసులోనే మరణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన సోదరుడు కూడా చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించడం పట్ల సినీ ప్రముఖులు పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.