ఈవీవీ పునర్జన్మనిచ్చారు | Geeta singh interview with sakshi | Sakshi
Sakshi News home page

ఈవీవీ పునర్జన్మనిచ్చారు

Published Sun, Aug 16 2015 9:04 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

ఈవీవీ పునర్జన్మనిచ్చారు - Sakshi

ఈవీవీ పునర్జన్మనిచ్చారు

కొవ్వూరు :దర్శకుడు తేజ తనకు సినిమా పరిశ్రమలో జన్మనిస్తే, దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ పునర్జన్మనిచ్చారని నటి గీతాసింగ్ తెలిపారు. కొవ్వూరు మండలం పశివేదలలో ఓ చిత్రం షూటింగులో పాల్గొనేందుకు వచ్చిన ఆమె ‘సాక్షి’తో ముచ్చటించారు. ప్రస్తుత సినిమాలో పోలీసు కానిస్టేబుల్‌గా నటిస్తోన్న గీతాసింగ్ రాజస్థానీ అమ్మాయి.
 
 కితకితలు సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చి, తెలుగును స్వచ్ఛంగా మాట్లాడేలా తర్ఫీదునిచ్చిన ఈవీవీకి రుణపడి ఉంటాన్నారు. ఆ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా రీమైకై హిట్టయ్యిందన్నారు. ఇప్పటివరకూ 80 వరకూ తెలుగు చిత్రాల్లో నటించానని, కామెడీతో కూడిన పోలీసాఫీసర్ క్యారెక్టర్ చేయాలని ఉందని అన్నారు. ప్రస్తుతం తెలుగులో మూడు, కన్నడంలో ఒక సినిమా చేస్తున్నట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement