ఇద్దరు హీరోయిన్లు నన్ను అవమానించారు: గీతా సింగ్‌ | Geetha Singh Shares Her Bad Incident | Sakshi
Sakshi News home page

Geetha Singh: ఆ హీరోయిన్లు అవమానిస్తే అల్లరి నరేశ్‌ నా పరువు కాపాడారు

Published Sun, Nov 6 2022 7:58 PM | Last Updated on Sun, Nov 6 2022 10:17 PM

Geetha Singh Shares Her Bad Incident - Sakshi

కితకితలు సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది గీతా సింగ్‌. లావుగా ఉన్నా కూడా హీరోయిన్‌గా చేయొచ్చని నిరూపించింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఇప్పటికీ ఆమెను కితకితలు గీతాసింగ్‌గానే గుర్తు చేసుకుంటారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చేదు అనుభవాలను పంచుకుంది. ఓ ఇద్దరు హీరోయిన్స్‌ తనను అందరిముందు అవమానించారని తెలిపింది. 'అల్లరి నరేశ్‌ సినిమాలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించాను. షూటింగ్‌ గ్యాప్‌లో క్యారవాన్‌ ఎక్కాను. అప్పటికే అందులో బాంబే హీరోయిన్స్‌ ఉన్నారు. వారు నన్ను చూసి ఏంటి? ఈమె క్యారవాన్‌ ఎక్కింది, జూనియర్‌ ఆర్టిస్ట్‌ అని చులకనగా మాట్లాడారు.

అప్పుడు మిగతా నటులు నిన్ను ఇలా అంటున్నారేంటి అని అడిగారు. వారికేదో తెలియక అలా అంటున్నారులే అని క్యారవాన్‌ దిగి లొకేషన్‌లో ఓ చోటున కూర్చున్నా. ఈ విషయం తెలిసి అల్లరి నరేశ్‌.. నన్ను హీరోయిన్స్‌ దగ్గరకు తీసుకెళ్లాడు. ఈమె నా ఫస్ట్‌ హీరోయిన్‌, తన నుంచే నాకు బ్రేక్‌ వచ్చింది అని చెప్పాడు. దీంతో ఆ హీరోయిన్స్‌ అప్పటినుంచి నన్ను మేడమ్‌ అని పిలవడం ప్రారంభించారు. నరేశ్‌కు తన గురించి బాంబే హీరోయిన్స్‌ దగ్గర చెప్పాల్సిన అవసరం లేకపోయినా చెప్పారు. అదే ఆయనకు ఉన్న గొప్ప లక్షణం' అని చెప్పుకొచ్చింది గీతా సింగ్‌.

చదవండి: తండ్రిని ఇష్టపడని టబు, ఎందుకంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement