విలన్గా మారుతున్న మరో హీరో | Allari Naresh brother Aaryan Rajesh As Villain | Sakshi
Sakshi News home page

విలన్గా మారుతున్న మరో హీరో

Published Tue, Jul 5 2016 11:45 AM | Last Updated on Mon, Sep 4 2017 4:11 AM

విలన్గా మారుతున్న మరో హీరో

విలన్గా మారుతున్న మరో హీరో

స్టార్ డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరో ఆర్యన్ రాజేష్. కెరీర్ స్టార్టింగ్లో కాస్త ఫరవాలేదనిపించినా.. తరువాత వరుస ఫ్లాప్లతో నిరాశపరిచాడు. తరువాత వ్యాపారాలతో బిజీగా కావటంతో సినీరంగానికి పూర్తిగా దూరమయ్యాడు. అదే సమయంలో ఆర్యన్ తమ్ముడు అల్లరి నరేష్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకొని 50పైగా సినిమాలు చేసి సత్తా చాటాడు.

సినీ నిర్మాణంతో పాటు ఇతర వ్యాపారాల్లోనూ బిజీగా ఉన్న ఆర్యన్ రాజేష్కు నటనమీద ఆసక్తితగ్గలేదు. అందుకే త్వరలో రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. అయితే టాలీవుడ్ హీరోల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో ప్రస్తుతం ప్రతినాయక పాత్రలకు మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకే త్వరలో విలన్గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు రాజేష్. ఎక్కువగా లవర్ బాయ్ తరహా సినిమాలు చేసిన రాజేష్, విలన్గా ఎంట్రీ ఇస్తే, అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement