
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ హీరో రాజశేఖర్ మాతృమూర్తి ఆండాళ్ వరదరాజ్ (82) తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురయ్యారు. దీంతో హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న ఆమె బుధవారం ఉదయం కన్నుమూశారు.
మృతదేహాన్ని చైన్నైకి తరలించి, గురువారం ఉదయం ఆమెకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. రాజశేఖర్ రెండో సంతానం.