న్యూఢిల్లీ: రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి చంద్రకాంత గోయల్ వృద్ధాప్యంతో శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఈ మేరకు తల్లి మరణవార్తను పీయూష్ గోయల్ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. 'తన తల్లి జీవితాన్ని ప్రజలకు సేవచేయడానికే అంకితం చేసిందని, ఇతరులను కూడా అదే విధంగా సమాజ శ్రేయస్సుకు పాటుపడేలా ప్రేరేపించారంటూ' ట్వీట్ చేశారు. కాగా.. ఆమెను శనివారం ఉదయం దహనం చేసినట్లు మహరాష్ట్ర బీజేపీ నాయకులు, మాజీ మంత్రి వినోద్ తవ్డే తెలిపారు. చదవండి: 40 వేలు దాటిన కరోనా మరణాలు
ఎమర్జెన్సీ తర్వాత చంద్రకాంత గోయల్ ముంబై కార్పొరేటర్‌గా పనిచేశారు. అనంతరం మాతుంగా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు బీజేపీ తరుపున ప్రాతినిధ్యం వహించారు. ఆమె భర్త, దివంగత వేద్ ప్రకాష్ గోయల్ బీజేపీ జాతీయ కోశాధికారిగా చాలా కాలంపాటు పనిచేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో షిప్పింగ్ మంత్రిగా కూడా పనిచేశారు. చదవండి: ఆరుగురికి కరోనా; ఈడీ ప్రధాన కార్యాలయం సీజ్
अपने स्नेह, और प्रेम से मुझे हमेशा राह दिखाने वाली मेरी पूज्य माता जी का आज सुबह स्वर्गवास हो गया।
— Piyush Goyal (@PiyushGoyal) June 6, 2020
उन्होंने अपना पूरा जीवन सेवा करते हुए बिताया, और हमें भी सेवाभाव से जीवन बिताने को प्रेरित किया। ईश्वर उन्हें अपने श्री चरणों मे स्थान दें। ॐ शांतिः pic.twitter.com/mwlIks6TBJ
Comments
Please login to add a commentAdd a comment