
ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు
ఆయన ఇంటిని పేల్చివేస్తామని కాల్.. బాంబు స్క్వాడ్ తనిఖీలు
వేములవాడ అర్బన్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు నివాసం సంగీత నిలయాన్ని పేల్చివేస్తామని అగంతకులు బెదిరించారని తెలిసింది. శనివారం వేకువజామున ఎమ్మెల్యేకు ఇంటర్నెట్ ద్వారా వాయిస్‌కాల్ చేసి ఆయన నివాసాన్ని పేల్చివేస్తామని బెదిరింపులకు దిగినట్లు సమాచారం.
అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్వా్వడ్‌తో తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం రాజన్న ఆలయంలోనూ తనిఖీలు చేశారు. ఎమ్మెల్యే నివాసానికి పటిష్టమైన భద్రత కల్పించారు. టౌన్ సీఐ శ్రీనివాస్‌ను సంప్రదించగా, వీఐపీల రాకపోకలున్నందున తనిఖీలు చేశామన్నారు.