
సాక్షి, న్యూఢిల్లీ : టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశాన్ని వీలైనంత త్వరగా తేల్చాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ కేంద్ర హోం శాఖను ఆశ్రయించారు. చెన్నమనేని భారత పౌరుడు కాదంటూ కాంగ్రెస్ నేత శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మరోసారి సమీక్ష చేయాలని చేయాలని జూలై 10న హైకోర్టు తీర్పు వెలువరించింది. మూడు నెలల్లోగా ఈ అంశాన్ని తేల్చాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆది శ్రీనివాస్ మరోసారి కేంద్ర హోం శాఖను ఆశ్రయించారు. ఈ అంశాన్ని వీలైనంత త్వరగా తేల్చాలని హోశాఖలో అప్పీల్ చేశారు.
(చదవండి : చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టు ఊరట)
Comments
Please login to add a commentAdd a comment