aadi srinivas
-
కాంగ్రెస్‌లో దశాబ్దాల పోరాటం మాది.. నేడు కంచం లాక్కున్నట్టుంది: జీవన్ రెడ్డి
సాక్షి, జగిత్యాల: దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో ఉండి పోరాటం చేశామన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవాళ తినబోయే ముందు వేరే వాళ్ళు వచ్చి కంచం లాక్కున్నట్టుంది మా పరిస్థితి అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో కుల గణన ద్వారా వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు.జగిత్యాలలో నేడు కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ..‘దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉండి పోరాటం చేశాం. ఇవాళ తినబోయే ముందు వేరే వాళ్లు వచ్చి కంచం లాక్కున్నట్టుంది మా పరిస్థితి. విప్ లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ జగిత్యాల కాంగ్రెస్ నాయకులకు ఆత్మస్థైర్యం కల్పించే విధంగా అండగా ఉండాలి. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుకుందాం. కుల గణన ద్వారా వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుంది. నవంబర్ నెల చివరి వరకు సర్వే రిపోర్ట్ వస్తే డిసెంబర్ నెలలో ఎన్నికల నిర్వహణకు ప్రణాళిక చేసుకోవచ్చు. తద్వారా జనవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకునే అవకాశం ఉంది అంటూ కామెంట్స్ చేశారు.కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దోచుకున్నారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని పదేళ్లు నిండా ముంచారు. పదవులు లేకపోతే కేటీఆర్, కేసీఆర్ ఉండలేకపోతున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఏడు లక్షల కోట్ల అప్పులు ఉన్నట్టుగా శ్వేతపత్రం విడుదల చేశారు. చేసిన అప్పులు కొరకే ప్రజలను క్షమించమంటూ కేటీఆర్ పాదయాత్ర చేస్తున్నాడని ప్రజలకు వివరించాలి. ఈ మేరకు కాంగ్రెస్ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. -
పోటీలో సీనియర్లు.. గండం గట్టెక్కాలంటే గెలిచి తీరాల్సిందే.. లేదంటే!
ఎన్నికల్లో గెలవడం లేదా ఓడిపోవడం అనేది మామూలు విషయమే. కాని పదే పదే ఓడిపోయే నేతలకు రాజకీయ భవిష్యత్ అంధకారంగా మారుతుంది. అందుకే ఈసారి చాలా మంది నేతలు చావో రేవో అన్నట్లుగా పోరాడుతున్నారు. ఇప్పుడు ఓడితే వచ్చేసారి టిక్కెట్ రాదనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. అందుకే కసితో ఎన్నికల పోరాటంలో పాల్గొంటున్నారు. ఓటమి నుంచి తప్పించుకునేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ వారెవరు? ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి గెలవాలనే అనుకుంటారు. అందుకోసమే శ్రమిస్తారు. అయతే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే కొందరు అభ్యర్థులకు మాత్రం జీవన్మరణ సమస్యగా మారింది. ఇప్పటికే రెండు లేదా మూడుసార్లు ఓడిపోయినా.. ఆయా పార్టీలు వారికి ఈసారికి అవకాశం ఇచ్చాయి. ఇప్పుడు గనుక ఓడిపోతే..ఇక తమ రాజకీయ జీవితం ఖతం అయిపోయినట్లే అనే భయం ఆ అభ్యర్థులను వెంటాడుతోంది. ఇలా రెండు, మూడు సార్లు ఓడిపోయి.. ఇప్పుడు బరిలో దిగినవారు అధికార బీఆర్ఎస్లో మాత్రం పెద్దగా లేరు. కాంగ్రెస్, బీజేపీల్లో ఇటువంటి అభ్యర్థులు ఎక్కువగానే ఉన్నారు. ఇప్పుడు వారందరి గుండెళ్ళో రైళ్ళు పరుగెడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నవారిలో ఏడెనిమిది మంది అభ్యర్థులు రెండు మూడు సార్లుగా వరుసగా ఓడిపోతున్నవారే. గత రెండు ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఇప్పుడు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా నిజామాబాద్‌లో గెలిచి తీరాలనే పట్టుదలతో ప్రచారం చేస్తున్నారు. ఇక కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ ది ఇదే పరిస్థితి.. ఈసారి సింపతితో గెలుస్తా అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు లక్ష్మణ్. ఇప్పటికే మూడు సార్లు ఓడిన ఆది శ్రీనివాస్ మరోసారి వేములవాడ బరిలో దిగుతున్నారు. ఒకసారి ఎంపీగా గెలిచిన పొన్నం ప్రభాకర్ ఆ తర్వాత ఎంపీగా ఓడిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన పొన్నం ప్రభాకర్ ఈసారి ఎలాగైనా గెలవాలని వ్యూహాలకు పదును పెడుతున్నారు. గండ్ర సత్యనారాయణ, గడ్డం ప్రసాద్, కేఎల్ఆర్, ప్రేమ్ సాగర్ రావు లాంటి నేతల పరిస్థితి ఇదే. ఇప్పటికే రెండు మూడు సార్లు ఓడిన నేతలు రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక బీజేపీ లోను కొందరు నేతల పరిస్థితి ఇలాగే ఉంది. సనత్ నగర్ నుంచి ఇప్పటికే పలుమార్లు అదృష్టం పరిక్షించుకున్న సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి మరోసారి బీజేపీ అభ్యర్థిగా సనత్ నగర్ బరిలో దిగారు. ఇది నాకు చివరి ఎన్నిక అని ప్రచారం చేస్తున్నారట మర్రి. మరోనేత మహేశ్వర్ రెడ్డి వరుసగా రెండు సార్లు ఓటమి పాలయ్యి ఈ సారి మళ్ళీ నిర్మల్ బరిలో దిగారు. తల్లోజు ఆచారి పరిస్థితి ఇలాగే ఉంది. గతంలో విజయం గుమ్మం దాకా వచ్చినట్లే వచ్చి వెనక్కి పోయింది. ఈ సారి గెలుపు పై ఆచారి ఆశలు పెట్టుకున్నారు. ఎల్బీనగర్ అభ్యర్థి సామ రంగారెడ్డి కూడా వరుస ఓటములతో చతికిల పడ్డారు. సూర్యాపేట నుంచి బరిలో ఉన్న సంకినేని వెకటేశ్వరరావు , రామచందర్ రావు, కూన శ్రీశైలం గౌడ్ లది ఇదే పరిస్థితి. అన్ని పార్టీల్లోనూ 15 నుంచి 20 మంది రెండు లేదా మూడు సార్లు వరుసగా ఓడిపోయారు. అందుకే ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతున్నారు. ఇప్పుడు గనుక ఓడితే ఇక తమ రాజకీయ భవిష్యత్తుకు ఎండ్ కార్డ్ తప్పదని వారంతా ఆందోళన చెందుతున్నారు. మరి ప్రజలు వారిపట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. -
తెరపై మరోసారి చెన్నమనేని పౌరసత్వ వివాదం
సాక్షి, న్యూఢిల్లీ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశాన్ని వీలైనంత త్వరగా తేల్చాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ కేంద్ర హోం శాఖను ఆశ్రయించారు. చెన్నమనేని భారత పౌరుడు కాదంటూ కాంగ్రెస్ నేత శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మరోసారి సమీక్ష చేయాలని చేయాలని జూలై 10న హైకోర్టు తీర్పు వెలువరించింది. మూడు నెలల్లోగా ఈ అంశాన్ని తేల్చాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆది శ్రీనివాస్ మరోసారి కేంద్ర హోం శాఖను ఆశ్రయించారు. ఈ అంశాన్ని వీలైనంత త్వరగా తేల్చాలని హోశాఖలో అప్పీల్ చేశారు. (చదవండి : చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టు ఊరట) -
ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తా
కథలాపూర్ : ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే కథలాపూర్ మండలానికి సాగు, తాగు నీరందించి సస్యశామలం చేస్తామని వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం కథలాపూర్ మండలం చింతకుంట, భూషణరావుపేట, ఊట్‌పెల్లి, పెగ్గెర్ల, దుంపేట, పోసానిపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలతో కలిసి ఆయన పాల్గొన్నారు. గ్రామాల్లో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలోనే కథలాపూర్ మండలంలో ఐదు గ్రామాలకు సాగునీరందించే రాళ్లవాగు ప్రాజెక్టును నిర్మించామని, కలిగోట శివారులో సూరమ్మ రిజర్వాయర్ కోసం కాంగ్రెస్ హయాంలోనే నిధులు మంజూరు చేశామన్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం తట్టెడు మట్టి పనిచేయించలేదని, రైతులను విస్మరించారని మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాలు భూమి పంపిణీ చేస్తామని హామీలు ఇచ్చిన టీఆర్ఎస్.. అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి ఏడాదికి 6 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. ప్రతి మహిళ సంఘానికి రూ. లక్ష వారి ఖాతాలో జమచేస్తామని వాటిని తిరిగి చెల్లించనవసరంలేదన్నారు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీ మండలాధ్యక్షుడు చెదలు సత్యనారాయణ, పీసీసీ సభ్యుడు తొట్ల అంజయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొలుమల్ల గంగాధర్, నాయకులు పాల్గొన్నారు. లక్ష్మీ నర్సింహుని సన్నిధిలో.. వేములవాడ: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తమ స్వగ్రామం రుద్రంగిలోని శ్రీలక్ష్మీనర్సింహాస్వామిని ఆది శ్రీనివాస్ దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
నాటి మిత్రులు .. నేటి ప్రత్యర్థులు
సాక్షి, వేములవాడ: గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసిన ఆది శ్రీనివాస్‌కు ప్రస్తుత బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అప్పుడు మద్దతు పలుకుతూ ప్రచారం నిర్వహించారు. నాటి మిత్రులు నేడు ప్రత్యర్థులుగా పోటీలో ఉండే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆది శ్రీనివాస్ పోటీ చేస్తున్న నేపథ్యంలో బీజేపీ నుంచి ప్రతాప రామకృష్ణ బరిలో నిలవనున్నారు. బుధవారం పాతమిత్రులు ఇలా కలుసుకున్నారు. -
ఎమ్మెల్యే వైఫల్యంతోనే నీటి సమస్య
కథలాపూర్(వేములవాడ): వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు వైఫల్యంతోనే నియోజకవర్గంలోని గ్రామాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండలంలోని పోసానిపేట గ్రామంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటిపోయి తాగునీటికి ప్రజలు, సాగునీటికి రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయిన లేదని మండిపడ్డారు. కలిగోట సూరమ్మ రిజర్వాయర్‌ను నింపి అక్కడి నుంచి కథలాపూర్, మేడిపెల్లి మండలాల చెరువులకు నీరు వదలాలని ప్రజలతో కలిసి ఆందోళనలు చేసినా.. మా మాట వినకపోవడం, ప్రభుత్వానికి, పాలకులకు ముందుచూపు లేకపోవడంతో ఈ దౌర్భాగ్యపు పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు. మిషన్‌భగీరథ పథకాన్ని అడ్డుపెట్టుకొని నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో బోరుబావులు ఏర్పాటు చేయకపోవడంపై ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. సమావేశంలో కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్‌రెడ్డి, బీజేవైఎం మండలాధ్యక్షుడు పులి హరిప్రసాద్, నాయకులు వెలిచాల సత్యనారాయణ, కాయితి నాగరాజు, ప్రసాద్, సురేశ్ పాల్గొన్నారు. -
రాజన్న జిల్లా ప్రకటించాల్సిందే..
వేములవాడ : రాజన్న జిల్లాగా ప్రకటిస్తూ వేములవాడ – సిరిసిల్ల ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించాలని రాజన్న ఆలయ మాజీ చైర్మన్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్థానిక తెలంగాణచౌక్‌లోని ఉద్యమాల గద్దెపై న్యాయవాదులు చేస్తున్న రిలేనిరాహార దీక్షలు ఆదివారం రెండోరోజుకు చేరుకున్నాయి. దీక్షకు ఆది శ్రీనివాస్ సంఘీభావం ప్రకటించారు. టీడీపీ నాయకులు సుదర్శన్‌యాదవ్, రాంబాబు, ఉమేందర్, శ్రీనివాస్, నృత్యకళానికేతన్ అధ్యక్షులు యెల్ల పోచెట్టి, సోమినేని బాలు, సీఐటీయూ నాయకులు గుర్రం అశోక్ మద్దతు ప్రకటించారు. దీక్ష చేపట్టిన వారిలో న్యాయవాదులు పిట్టల భూమేశ్, కందుల క్రాంతికుమార్, కోరెపు అనిల్, బొడ్డు దేవయ్య, గుంటి శంకర్, బొజ్జ మహేందర్, మాదాసు దేవయ్య, సంటి సుజీవన్, బొడ్డు ప్రశాంత్, బొడ్డు గంగరాజులు ఉన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నేరెళ్ల తిరుమల్‌గౌడ్ పూలమాలలు వేసి దీక్ష ప్రారంభించారు. జిల్లాల ఏర్పాటులో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం కల్పించండి కొత్త జిల్లాల ఏర్పాటులో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత కల్పించాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బానోతు కిషన్‌నాయక్ కోరారు. ఆదివారం పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో ఎస్సీలు, ఎస్టీలకు ప్రాధాన్యత కల్పించే అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ ప్రతినిధులు పిట్టల దేవరాజు, పి.లక్ష్మీనారాయణ, ప్రేమ్‌సాగర్, ఎం.కిషన్, హన్మండ్లు, పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు.