భూషణరావుపేటలో మహిళలకు అభివాదం చేస్తున్న ఆది శ్రీనివాస్
కథలాపూర్ : ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే కథలాపూర్ మండలానికి సాగు, తాగు నీరందించి సస్యశామలం చేస్తామని వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం కథలాపూర్ మండలం చింతకుంట, భూషణరావుపేట, ఊట్‌పెల్లి, పెగ్గెర్ల, దుంపేట, పోసానిపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలతో కలిసి ఆయన పాల్గొన్నారు. గ్రామాల్లో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలోనే కథలాపూర్ మండలంలో ఐదు గ్రామాలకు సాగునీరందించే రాళ్లవాగు ప్రాజెక్టును నిర్మించామని, కలిగోట శివారులో సూరమ్మ రిజర్వాయర్ కోసం కాంగ్రెస్ హయాంలోనే నిధులు మంజూరు చేశామన్నారు.
ఆ తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం తట్టెడు మట్టి పనిచేయించలేదని, రైతులను విస్మరించారని మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాలు భూమి పంపిణీ చేస్తామని హామీలు ఇచ్చిన టీఆర్‌ఎస్.. అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి ఏడాదికి 6 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. ప్రతి మహిళ సంఘానికి రూ. లక్ష వారి ఖాతాలో జమచేస్తామని వాటిని తిరిగి చెల్లించనవసరంలేదన్నారు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీ మండలాధ్యక్షుడు చెదలు సత్యనారాయణ, పీసీసీ సభ్యుడు తొట్ల అంజయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొలుమల్ల గంగాధర్, నాయకులు పాల్గొన్నారు.
లక్ష్మీ నర్సింహుని సన్నిధిలో..
వేములవాడ: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తమ స్వగ్రామం రుద్రంగిలోని శ్రీలక్ష్మీనర్సింహాస్వామిని ఆది శ్రీనివాస్ దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment