రాజన్న జిల్లా ప్రకటించాల్సిందే..
Published Sun, Aug 28 2016 11:38 PM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM
వేములవాడ : రాజన్న జిల్లాగా ప్రకటిస్తూ వేములవాడ – సిరిసిల్ల ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించాలని రాజన్న ఆలయ మాజీ చైర్మన్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్థానిక తెలంగాణచౌక్‌లోని ఉద్యమాల గద్దెపై న్యాయవాదులు చేస్తున్న రిలేనిరాహార దీక్షలు ఆదివారం రెండోరోజుకు చేరుకున్నాయి. దీక్షకు ఆది శ్రీనివాస్ సంఘీభావం ప్రకటించారు. టీడీపీ నాయకులు సుదర్శన్‌యాదవ్, రాంబాబు, ఉమేందర్, శ్రీనివాస్, నృత్యకళానికేతన్ అధ్యక్షులు యెల్ల పోచెట్టి, సోమినేని బాలు, సీఐటీయూ నాయకులు గుర్రం అశోక్ మద్దతు ప్రకటించారు. దీక్ష చేపట్టిన వారిలో న్యాయవాదులు పిట్టల భూమేశ్, కందుల క్రాంతికుమార్, కోరెపు అనిల్, బొడ్డు దేవయ్య, గుంటి శంకర్, బొజ్జ మహేందర్, మాదాసు దేవయ్య, సంటి సుజీవన్, బొడ్డు ప్రశాంత్, బొడ్డు గంగరాజులు ఉన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నేరెళ్ల తిరుమల్‌గౌడ్ పూలమాలలు వేసి దీక్ష ప్రారంభించారు.
జిల్లాల ఏర్పాటులో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం కల్పించండి
కొత్త జిల్లాల ఏర్పాటులో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత కల్పించాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బానోతు కిషన్‌నాయక్ కోరారు. ఆదివారం పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో ఎస్సీలు, ఎస్టీలకు ప్రాధాన్యత కల్పించే అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ ప్రతినిధులు పిట్టల దేవరాజు, పి.లక్ష్మీనారాయణ, ప్రేమ్‌సాగర్, ఎం.కిషన్, హన్మండ్లు, పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement