హైదరాబాద్: చెన్నమనేని రమేష్ కోర్టు వ్యవహారం ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినదని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి యాదవ్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ నామినేటెడ్ ఎమ్మెల్యేకు కూడా ఓటు హక్కు ఉంటుందని చెప్పారు. పూర్తి బలం ఉన్నందుకే ఐదో అభ్యర్థిని కూడా బరిలోకి దింపామని ఆయన చెప్పారు. టీడీపీ అనవసరం రాద్ధాంతం చేస్తోందని, దానిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.