nominated mla
-
ఆంగ్లో–ఇండియన్ ఎమ్మెల్యే నియామకాన్ని అడ్డుకోండి
యశవంతపుర: కర్ణాటక విధానసభకు ఆంగ్లో ఇండియన్ వినీషా నీరోను నామినేట్ చేస్తూ గవర్నర్ వజుభాయ్ వాలా తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్–జేడీఎస్‌లు గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. యడ్యూరప్ప అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకునే వరకూ గవర్నర్ నిర్ణయాన్ని అడ్డుకోవాలని తమ పిటిషన్లో పేర్కొన్నాయి. యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై దాఖలైన పిటిషన్‌తోపాటుగా నేడు ఈ పిటిషన్ సుప్రీంలో విచారణకు రానుంది. గురువారం యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఆంగ్లో–ఇండియన్‌ను గవర్నర్ నామినేట్ చేశారు. గవర్నర్ నిర్ణయంపై సుప్రీంకు జెఠ్మలానీ యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడాన్ని తప్పుపడుతూ సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే ఇదే తరహా పిటిషన్‌ను విచారిస్తున్న ధర్మాసనం ముందు వాదనలు వినిపించాలని సీజేఐ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ఆయనకు సూచించింది. -
పుదుచ్చేరిలో బీజేపీ ఎమ్మెల్యేలకు షాక్
సాక్షి, చెన్నై: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ నామినేట్ చేసిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ వైద్యలింగం షాకిచ్చారు. మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు వి.స్వామినాథన్, కె.జి.శంకర్, ఎస్.సెల్వగణపతిలను సభలోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీలోకి దూసుకెళ్లేందుకు యత్నించిన ముగ్గురు ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటకు ఈడ్చుకొచ్చి పడేశారు. ప్రభుత్వ వ్యవహారశైలిపై తీవ్రంగా మండిపడ్డ స్వామినాథన్.. స్పీకర్ వైద్యలింగంపై కోర్టు ధిక్కార కేసు వేయనున్నట్లు మీడియాకు తెలిపారు. -
జిల్లా సమస్యలపై దృష్టి
శ్రీకాకుళo : కల్చరల్: జిల్లాలోని క్రైస్తవుల సమస్యలపై దృష్టి సారిస్తానని క్రిస్టియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే ఫిలిప్ సి.టోచర్ అన్నారు. స్థానిక చిన్నబజారులోని తెలుసు బాప్టిస్టు చర్చిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా లో సమస్యలను అధ్యయనం చేసేందుకే వచ్చానని చెప్పారు. క్రైస్తవులకు శ్మశాన వాటికల విషయంలో రెవెన్యూ అధికారులతో చర్చిస్తానని చెప్పారు. స్థలాలు జారీ చేయాలని 1998లోనే అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా అవి అమలు కాలేదని అన్నారు. జిల్లాలో 150 శ్మశాన వాటికలు ఉన్నాయని, వాటికోసం స్థలం కేటాయించేలా కృషి చేస్తామన్నారు. కులధ్రువీకరణ పత్రాల మం జూరులోనూ అడ్డంకులు ఉన్నాయని, వాటినీ పరిష్కరిస్తామని తెలిపారు. క్రైస్తవుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. సమావేశంలో జిల్లా స్థాయి మైనారిటీ ఇంప్లిమెం టేషన్ కమిటీ సభ్యులు రెవ. పి.కృపానందం, బోసుబాబు, సుజ్నానరావు, సద్గుణరావు, ఆశీ ర్వాదం, జాకబ్, జె.కృపానందం తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ నామినేటెడ్ ఎమ్మెల్యేగా టోచర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి చెందిన ఫిలిప్ సి టోచర్ ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. టోచర్ ఎంతోకాలంగా గుంటూరు జిల్లా కన్నవారితోటలో ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ సభ్యుడిగా ఎవరినీ నామినేట్ చేయలేదు. దాదాపు రెండేళ్ల తర్వాత మంగళవారం టోచర్ ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. -
కోర్టుకు వెళ్లిన స్టీఫెన్సన్
ఓటుకు నోటు కేసులో కీలక సాక్షి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కోర్టుకు బయల్దేరి వెళ్లారు. ఈ కేసులో తన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ఎదుట ఇచ్చేందుకు ఆయన బోయిగూడ లోని తన నివాసం నుంచి నాంపల్లి లోని ఏసీబీ కోర్టుకు బయల్దేరి మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కోర్టు వద్దకు చేరుకున్నారు. పోలీసులు ఆయనకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్నారు. బుల్లెట్ ప్రూఫ్ కారులో ఆయనను పటిష్ఠమైన భద్రత నడుమ కోర్టుకు తరలించారు. ఈ కారులో స్టీఫెన్సన్ ఒక్కరే బయల్దేరారు. 15-20 మంది వరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయనకు భద్రత కల్పిస్తున్నారు. ముందుగానే దారి మొత్తం భద్రతా చర్యలు చేపట్టారు. ఈ కేసులో స్టీఫెన్సన్ వాంగ్మూలం అత్యంత కీలకం కావడంతో అంతా దీనిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. న్యాయమూర్తికి ఆయన చెప్పే విషయాలు కేసు దర్యాప్తులో కూడా కీలక పాత్ర పోషించబోతున్నాయి. తనతో బేరసారాలు జరిపినవారి పేర్లను ఆయన కోర్టుకు వెల్లడించబోతున్నారు. ఈ సందర్భంగా నాంపల్లి కోర్టు బయట భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
కోర్టుకు వెళ్లిన స్టీఫెన్సన్
-
చెన్నమనేని వ్యవహారం ఉమ్మడిది
హైదరాబాద్: చెన్నమనేని రమేష్ కోర్టు వ్యవహారం ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినదని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి యాదవ్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ నామినేటెడ్ ఎమ్మెల్యేకు కూడా ఓటు హక్కు ఉంటుందని చెప్పారు. పూర్తి బలం ఉన్నందుకే ఐదో అభ్యర్థిని కూడా బరిలోకి దింపామని ఆయన చెప్పారు. టీడీపీ అనవసరం రాద్ధాంతం చేస్తోందని, దానిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.