ఆంగ్లో ఇండియన్ కోటాలో ఫిలిప్ సి.థాచర్‌కు స్థానం దక్కింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి చెందిన ఫిలిప్ సి టోచర్ ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. టోచర్ ఎంతోకాలంగా గుంటూరు జిల్లా కన్నవారితోటలో ఉంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ సభ్యుడిగా ఎవరినీ నామినేట్ చేయలేదు. దాదాపు రెండేళ్ల తర్వాత మంగళవారం టోచర్ ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.