
సాక్షి, హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దుపై స్టేను హైకోర్టు మరో 8 వారాలు పొడిగించింది. పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు గత నవంబర్‌లో స్టే ఇచ్చింది. ఆ ఉత్తర్వులను తాజాగా పొడిగిస్తూ న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం ఆదేశాలు జారీ చేశారు. రమేశ్ జర్మనీ పౌరసత్వం రద్దయిందో లేదో తెలపాలని కేంద్రాన్ని ఆదేశించారు. విచారణ 4 వారాలకు వాయిదా వేశారు. వాస్తవాలు దాచి మోసపూరిత విధానాల ద్వారా రమేశ్ భారతీయ పౌరసత్వం పొందినట్లు నిర్ధారించి.. భారత పౌరసత్వ చట్టం ప్రకారం పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment