Citizenship Revocation
-
చెన్నమనేనిని ప్రశ్నించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దుపై స్టేను హైకోర్టు మరోసారి పొడిగించింది. చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు గత నవంబర్‌లో స్టే ఇచ్చింది. తాజాగా ఆ ఉత్తర్వులను ఈ నెల 24 వరకు పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం జరిగిన విచారణలో చెన్నమనేని రమేశ్ ఇప్పటికీ జర్మనీ పాస్‌పోర్టుతోనే విదేశాలకు వెళ్లినట్లు కేంద్ర హోంశాఖ కోర్టుకు తెలిపింది. తద్వారా రమేష్ జర్మనీ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని పేర్కొంది. దీంతో భారత పౌరసత్వం ఉందని చెప్తూనే జర్మనీ పాస్పోర్టుతో ఎందుకు వెళ్లావని న్యాయస్థానం చెన్నమనేనిని ప్రశ్నించింది.(చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో ఊరట) దీనికి ఆయన స్పందిస్తూ జర్మనీ పౌరసత్వం ఎప్పుడో రద్దు చేసుకున్నట్లు తెలిపారు. ‘జర్మనీ సిటిజన్‌షిప్ వదులుకున్నారా? అందుకు జర్మనీ ప్రభుత్వం ఆమోదించిందా?’ అని హైకోర్టు వరుస ప్రశ్నలు సంధించింది. అనంతరం జర్మనీ పౌరసత్వం రద్దు చేసుకున్నట్లు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చెన్నమనేనికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. కాగా వాస్తవాలు దాచి మోసపూరిత విధానాల ద్వారా చెన్నమనేని రమేశ్ భారతీయ పౌరసత్వం పొందినట్లు నిర్ధారించి.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గతేడాది నవంబర్ 20న అతని పౌరసత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. (చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దు) -
చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దుపై స్టేను హైకోర్టు మరో 8 వారాలు పొడిగించింది. పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు గత నవంబర్‌లో స్టే ఇచ్చింది. ఆ ఉత్తర్వులను తాజాగా పొడిగిస్తూ న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం ఆదేశాలు జారీ చేశారు. రమేశ్ జర్మనీ పౌరసత్వం రద్దయిందో లేదో తెలపాలని కేంద్రాన్ని ఆదేశించారు. విచారణ 4 వారాలకు వాయిదా వేశారు. వాస్తవాలు దాచి మోసపూరిత విధానాల ద్వారా రమేశ్ భారతీయ పౌరసత్వం పొందినట్లు నిర్ధారించి.. భారత పౌరసత్వ చట్టం ప్రకారం పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
చెన్నమనేనికి తాత్కాలిక ఊరట
పౌరసత్వ రద్దు నిర్ణయం అమలును తాత్కాలికంగా నిలిపేసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: భారత పౌరసత్వం రద్దు కేసులో వేములవాడ టీఆర్ఎస్ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌కు తాత్కాలిక ఊరట లభించింది. ఆగస్టు 31 నుంచి ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల (అబయన్స్) చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ సోమవారం మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. తన పౌరసత్వం రద్దు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలంటూ రమేశ్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ఆరు వారాల్లోగా పరిష్కరించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించారు. కేంద్ర హోంశాఖ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రమేశ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై హైకోర్టులో అంతకుముందు జరిగిన విచారణలో ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించే ముందు రమేశ్ వివరణ తీసుకోలేదని కోరలేదని రమేశ్ తరఫు న్యాయవాది వై.రామారావు వాదించారు. పౌరసత్వ రద్దు నిర్ణయాన్ని పునః సమీక్షించాలంటూ రమేశ్ చేసుకున్న దరఖాస్తు కేంద్ర హోంశాఖ వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. అనంతరం కేంద్రం తరఫున సహాయ పోలిసిటర్ జనరల్ లక్ష్మణ్ వాదిస్తూ రమేశ్ అనేక విషయాల్ని గోప్యంగా ఉంచి పౌరసత్వం తీసుకున్నట్లు తేలిందన్నారు. భారత్‌లో 96 రోజులే ఉన్నా ఏడాదిపాటు ఉన్నట్లు చెప్పి భారత పౌర సత్వం పొందారని చెన్నమనేని చేతిలో ఎన్నికల్లో ఓడిపోయిన ఆది శ్రీనివాస్ (బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు) తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న కోర్టు...రమేశ్ పునఃసమీక్ష పిటిషన్‌పై 6 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. ఇరుపక్షాలు సంబంధిత పత్రాలతో కేంద్ర హోం శాఖ వద్ద వాదనల్ని వినిపించుకునే వెసులుబాటు కోసం పౌరసత్వ రద్దు నిర్ణయాన్ని అబయన్స్‌లో పెడుతూ ఆదేశించింది.