రాజీవ్ చంద్రశేఖర్ అఫిడవిట్‌.. ఆస్థులకంటే అప్పులే ఎక్కువ! | Union IT Minister Rajeev Chandrasekhar Declared Poll Affidavit, Details Inside - Sakshi
Sakshi News home page

రాజీవ్ చంద్రశేఖర్ అఫిడవిట్‌.. ఆస్థులకంటే అప్పులే ఎక్కువ!

Published Thu, Apr 4 2024 9:53 PM | Last Updated on Fri, Apr 5 2024 11:34 AM

Rajeev Chandrasekhar Declared Affidavit - Sakshi

కేరళలోని తిరువనంతపురం లోక్‌సభ స్థానానికి 'రాజీవ్ చంద్రశేఖర్' నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్తులు, అప్పులు వంటి వాటిని వెల్లడించారు.

ఆస్తులకు సంబంధించి.. చంద్రశేఖర్ వద్ద రూ.52,000 నగదు, చరాస్తులతో పాటు మొత్తం రూ.9.26 కోట్లు ఉన్నట్లు తెలిపారు. ఇందులో రూ.10.38 కోట్లు బ్యాంకు డిపాజిట్లు, రూ.45.7 కోట్ల రుణాత్మక ఆస్తులు, వ్యక్తిగత రుణాలు రూ.41.2 కోట్లు ఉన్నట్లు సమాచారం. 

రాజీవ్ చంద్రశేఖర్ వద్ద రూ. 10000 విలువ చేసే స్కూటర్, రూ. 3.35 లక్షల విలువైన నగదు ఉన్నట్లు సమాచారం. కాగా ఆయన భార్యకు రూ. 12.47 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు.

మొత్తం మీద ఐటీ మంత్రి స్థిరాస్థులురూ. 14.4 కోట్లుగా ప్రకటించారు. అప్పులు దాదాపు రూ. 19.42 కోట్లు ఉన్నట్లు సమాచారం. తిరువనంతపురం నుంచి మూడుసార్లు కాంగ్రెస్ అధిపతి 'శశి థరూర్' & సీపీఐకి చెందిన పన్నియన్ రవీంద్రన్‌పై చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో శశిథరూర్ నాలుగోసారి గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేసారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement