రోహింగ్యాల అంశం.. సుప్రీంలో కేంద్రం అఫిడవిట్‌ | Centre files affidavit in Supreme Court in Rohingya issue | Sakshi
Sakshi News home page

రోహింగ్యాల అంశం.. సుప్రీంలో కేంద్రం అఫిడవిట్‌

Published Mon, Sep 18 2017 1:15 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

రోహింగ్యాల అంశం.. సుప్రీంలో కేంద్రం అఫిడవిట్‌ - Sakshi

రోహింగ్యాల అంశం.. సుప్రీంలో కేంద్రం అఫిడవిట్‌

సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పదంగా మారిన రోహింగ్యా ముస్లిం శరణార్థుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. సోమవారం పలు అంశాలతో కూడిన నివేదికను బెంచ్‌కు సమర్పించింది. 
 
భారత్-మయన్మార్‌ సరిహద్దు గుండా అక్రమంగా సుమారు 40000 మందికి పైగానే దేశంలోకి చొరబడ్డారని తెలిపింది. దేశంలో పలు ప్రాంతాల్లో విస్తరించిన వీరు అసాంఘిక కార్యకలాపలకు పాల్పడుతున్నారని చెప్పింది. వీరిలో కొందరు పాకిస్థాన్‌కు చెందిన కొన్ని ఉగ్రవాద సంస్థలతో కలిసి పని చేస్తున్నారని, ఈ విషయాన్ని నిఘా వర్గాలు కూడా కనిపెట్టాయన‍్న విషయాన్ని బెంచ్‌ ముందు కేంద్రం ప్రస్తావించింది. 
 
ఇది ముమ్మాటికీ మనుషుల అక్రమ రవాణా కిందకే వస్తుందన్న కేంద్రం.. రోహింగ్యా శరణార్థులను ఇక్కడ కొనసాగించటం దేశ భద్రతకు పెను ముప్పేనని స్పష్టం చేసింది. ఈ వ్యవహరాన్ని తమకు వదిలేయాలని, చర్చలు.. విధాన నిర్ణయాల ద్వారా సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించింది. దీంతో ఈ కేసులో తదుపరి వాదనను కోర్టు అక్టోబర్‌ 3 కు వాయిదా వేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement