Rohingya issue
-
అభివృద్ధి భాగస్వామి బంగ్లాదేశ్
న్యూఢిల్లీ: సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సీఈపీఏ)పై చర్చలు ప్రారంభించాలని, ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకొనే దిశగా ప్రణాళిక రూపొందించుకోవాలని భారత్, బంగ్లాదేశ్ నిర్ణయించుకున్నాయి. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన బంగ్లా ప్రధానమంత్రి షేక్ హసీనాతో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార వాణిజ్యపరమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు. మయన్మార్ పరిణామాలతోపాటు రోహింగ్యా కాందిశీకుల అంశంపై అభిప్రాయాలు పంచుకున్నారు. అనంతరం సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. భారత్‌కు బంగ్లాదేశ్ అతిపెద్ద అభివృద్ధి భాగస్వామి అని మోదీ అన్నారు. బంగ్లాదేశ్‌తో సంబంధ బాంధవ్యాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా సీఈపీఏపై చర్చలు ప్రారంభించామని నిర్ణయించినట్లు తెలిపారు. రక్షణ రంగంలో పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించామన్నారు. రక్షణ ఉత్పత్తుల తయారీ, సైనిక దళాల ఆధునీకరణ విషయంలో ఇరుదేశాలు సహకరించుకోవాలని ఆకాంక్షించారు.భారత్ విశ్వసనీయ మిత్రదేశం: హసీనా ఇండో–పసిఫిక్ కార్యక్రమంలో చేరాలన్న బంగ్లాదేశ్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మోదీ చెప్పారు. ‘‘ఇరు దేశాల బంధానికి పౌరుల మధ్య సంబంధాలే పునాది. వైద్య సేవల కోసం వచ్చే బంగ్లా పౌరులకు ఈ–మెడికల్ వీసా కలి్పస్తాం. బంగ్లాదేశ్‌లోని రంగపూర్‌లోని కొత్తగా అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నాం. 1996 నాటి గంగా నది నీటి ఒప్పందాన్ని నవీకరించడానికి సాంకేతిక చర్చలు ప్రారంభిస్తాం. తీస్తా నది పరిరక్షణ, నిర్వహణపై చర్చించడానికి బంగ్లాదేశ్‌కు టెక్నికల్ టీమ్‌ను పంపుతాం’’ అని ప్రధాని వివరించారు. సుస్థిరమైన, సౌభాగ్యవంతమైన, ప్రగతిశీల బంగ్లాదేశ్‌ను బంగబంధు షేక్ ముజిబుర్ రెహా్మన్ కలలుగన్నారని, ఆ కలను నిజం చేయడానికి తమవంతు సహకారం అందిస్తామని నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్ తమకు అతిపెద్ద పొరుగు దేశమని, తమకు అత్యంత విశ్వసనీయ మిత్రదేశమని షేక్ హసీనా పునరుద్ఘాటించారు. భారత్‌తో సంబంధాలకు అత్యధిక విలువ ఇస్తున్నామని ఆమె పునరుద్ఘాటించారు.10 ఒప్పందాలపై సంతకాలు డిజిటల్, సముద్రయానం, సముద్ర వనరుల వినియోగం, రైల్వే, అంతరిక్షం, పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ టెక్నాలజీ, ఆరోగ్యం, వైద్య వంటి కీలక రంగాల్లో సహకారం పెంపొందించుకోవడమే లక్ష్యంగా భారత్, బంగ్లాదేశ్ శనివారం 10 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో షేక్ హసీనా భేటీ న్యూఢిల్లీ: వేర్వేరు రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకొనే దిశగా భారత్, బంగ్లాదేశ్ వేగంగా ముందుకు సాగుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. నూతన రంగాల్లో సహకారం పెంపొందించుకుంటున్నాయని, రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలను ఈ సహకారమే నిర్ణయిస్తుందని చెప్పారు. శనివారం రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ముతో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా సమావేశమయ్యారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలను బలోపేతం చేసుకొనేలా కలిసి పనిచేయాలని నిర్ణయానికొచ్చారు. షేక్ హసీనాను కలవడం సంతోషంగా ఉందని ముర్ము పేర్కొన్నారు. -
Mob Attack: రోహింగ్యాలు వెళ్లిపోవాలని నిరసన
మయన్మార్ దేశానికి చెందిన రోహింగ్యాలు తమ దేశం నుంచి వెళ్లిపోవాలంటూ ఇండోయనేషియాలోని నిరసనకారులు డిమాండ్ చేశారు. పెద్ద నిరసనకారుల మూక బాండా అచే సీటీలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఉన్న మయన్మార్ చెందని రోహింగ్యాలు వెళ్లిపోవాలని దాడులకు దిగారు. ఇండోనేషియా నుంచి రోహింగ్యాలు వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. రోహింగ్యాలు నివాసం ఉంటున్న చోటుకు పెద్ద సంఖ్యలో నిరసనకారులు దూసుకురావటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. A large crowd of Indonesian students stormed a convention center housing hundreds of Rohingya refugees from Myanmar in the city of Banda Aceh, demanding they be deported, @Reuters footage showed https://t.co/dYV7NVFbpE pic.twitter.com/xrhQKlSbB1 — Reuters (@Reuters) December 27, 2023 ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. గ్రీన్ కలర్ జాకెట్లు ధరించిన కొంతమంది నిరసనకారుల మూక ఓ కన్వెన్షన్ సెంటర్ బిల్డింగ్ సెల్లార్లో ఉంటున్న రోహింగ్యాలు వెళ్లిపోవాలంటూ బెదరింపులకు దిగారు. పెద్ద సంఖ్యలో నిరసనకారులు తమపై రావడంతో రోహింగ్యా మహిళలు, చిన్న పిల్లలు భయంతో రోధించారు. నిరసనకారులు 137 మంది రోహింగ్యాలను బలవంతంగా రెండు ట్రక్కులపై ఎక్కించి, బాండా అచే నుంచి పరో ప్రదేశాని బలవంతంగా తరలించారు. రోహింగ్యాలు.. ఇండోనేషియాలో తీవ్రమైన వ్యతిరేతక, తిరస్కరణను ఎదుర్కొంటున్నారు. మయన్మార్ నుంచి పెద్ద సంఖ్యలో ఇండోనేషియాకు వస్తున్న రోహింగ్యాల పట్ల రోజురోజుకు ఇండోనేషియాలో వ్యతిరేకత పెరుగుతోంది. అందులో భాగంగానే బుధవారం నిరసనకారుల మూక రోహింగ్యాలపై దాడులకు తెగపడినట్లు తెలుస్తోంది. This is heartbreaking. This is completely madness. Such a notorious response from Muslim students of Indonesia is extremely shameful. History will not forget this behaviour. May Allah judge it. pic.twitter.com/5O4D8G20HC — Hujjat Ullah (@hujjatullahhb) December 27, 2023 యునైటెడ్ నేషన్స్ రేఫ్యూజీ ఏజెన్సీ ఈ ఘటనపై స్పందించింది. ‘ఈ ఘటన చాలా విచారకరం. మయన్మార్ రోహింగ్యాల కుటుంబాలపై దాడికి దిగటం చాలా బాధకరం. అక్కడ అధిక సంఖ్యలు మహిళలు చిన్నపిల్లలు మాత్రమే ఉన్నారు’ అని పేర్కొంది. వారికి భద్రత కల్పించాలని ఇండోనేషియా ప్రభుత్వాన్ని కోరింది. ఇటీవల ఇండోనేషియాకు వస్తున్న మానవ అక్రమ రవాణాపై ఆ దేశ అధ్యక్షుడు జోకో విడోడో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సంస్థలు రోహింగ్యాలకు తాత్కాలిక వసతులు కల్పించాలని అన్నారు. -
మయన్మార్ అధ్యక్షుడి రాజీనామా
మయన్మార్ : తమ అధ్యక్షుడు హితిన్ క్యా రాజీనామా చేసినట్లు మయన్మార్ అధ్యక్ష కార్యాలయ వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుత బాధ్యతలు, విధుల నుంచి విశ్రాంతి తీసుకునేందుకు ఆయన రాజీనామా చేశారని ఫేస్బుక్లో పోస్ట్ చేశాయి. మయన్మార్ రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు రాజీనామా చేస్తే ఉపాధ్యక్షులు అధ్యక్ష బాధ్యతలు చేపడతారు. అప్పటి నుంచి ఏడు రోజుల్లోగా పార్లమెంట్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. అప్పటివరకు ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉన్న మింట్ స్వీ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. హితేన్ నామమాత్రమే... 2016లో జరిగిన ఎన్నికల్లో అంగ్‌సాన్ సూకీ సారథ్యంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ పార్టీ విజయం సాధించింది. అప్పుడు అంగ్‌సాన్ సూకీనే అధ్యక్షురాలు అవుతుందని అందరూ భావించారు. కానీ ఆ దేశ రాజ్యాంగం ప్రకారం.. విదేశీయుడిని పెళ్లి చేసుకున్న కారణంగా ఆమె అధ్యక్ష పదవికి దూరమయ్యారు. ఆమె స్థానంలో తనకు అత్యంత విధేయుడైన హితేన్కు పట్టం కట్టి సలహాదారుగా వ్యవహరించారు. ప్రధాని హోదాకు సమానమైన స్టేట్ కౌన్సిలర్‌గా, విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే దేశ పాలనలో తనదైన ముద్ర వేశారు. కానీ రోహింగ్యాల విషయంలో అంగ్‌సాన్ సూకీ, హితేన్ ఇతర దేశాల నుంచి వ్యతిరరేకత ఎదుర్కొన్నారు. అనారోగ్య కారణాల వల్లే.. 71 ఏళ్ల హితేన్ అనారోగ్య కారణంగానే అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగారని ఎన్ఎల్డీ పార్టీ అధికార ప్రతినిధి అంగ్ షిన్ తెలిపారు. పార్టీకి చెందిన మరో వ్యక్తి ఏడు రోజుల్లోగా అధ్యక్షునిగా ఎన్నికవుతారని, రాజ్యాంగం ప్రకారం ప్రస్తుత ఉపాధ్యక్షుడిని అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశం లేదని స్పష్టం చేశారు. -
కశ్మీర్‌పై అంతర్జాతీయ చర్చ!
దావోస్: కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ స్థాయిలో చర్చించాల్సిన అవసరం ఉందని పాక్ విదేశాంగ మంత్రి ఖ్వాజా మహ్మద్ అసిఫ్ దావోస్‌లో అన్నారు. ప్రస్తుత ప్రపంచంలోని వివిధ విభేదాలకు కశ్మీర్ వివాదం, రోహింగ్యాల అంశం కూడా కారణాలేనని ఆయన పేర్కొన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు పాకిస్తాన్ ప్రధాని షాహిద్ ఖాక్కన్ అబ్బాసీతోపాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. అసిఫ్ మాట్లాడుతూ ‘ప్రపంచం ముక్కలుగా విడిపోవడానికి కశ్మీర్ వివాదం, రోహింగ్యాల అంశం కూడా కారణమే’ అని అన్నారు. ఈ ఏడాది డబ్ల్యూఈఎఫ్ సమిట్ నినాదమైన ‘ముక్కలైన ప్రపంచంలో ఉమ్మడి భవిష్యత్తు నిర్మాణం’ను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇటు చైనా, అటు అమెరికాతో తమ ద్వైపాక్షిక బంధాలు ఎంతో దృఢంగా ఉన్నాయని పాక్ ప్రధాని షాహిద్ ఖాక్కన్ అబ్బాసీ అన్నారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ), చైనా–పాక్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ) తదితర ప్రాజెక్టులతో గత కొన్నేళ్లలో చైనాతో పాక్ బంధం మరింత బలపడిందని అబ్బాసీ చెప్పారు. -
రోహింగ్యాల అక్రమ చొరబాట్లు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో భద్రత తక్కువగా ఉన్న సుమారు 140 ప్రాంతాలనుంచి రోహింగ్యాలు అక్రమంగా చొరబాడేందుకు ప్రయత్నిస్తున్నారని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చీఫ్ కేకే శర్మ తెలిపారు.ఈ నేపథ్యంలో సరిహద్దులో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరముందుని ఆయన అన్నారు. అక్రమంగా చొరబడుతున్న రోహింగ్యాలకు కొన్ని ముఠాలు సహకరిస్తున్నాయని.. ఆ ముఠాలను ఏరిపారేయాల్సిన అవసరముందని చెప్పారు. బీఎస్ఎఫ్, బోర్డర్ గార్డ్ ఆఫ్ బంగ్లాదేశ్‌ల వార్షిక సమావేశం న్యూఢిల్లీ ముగిసింది. ఈ సమావేశంలో బీఎస్ఎఫ్ చీప్ కేకే శర్మ, బీజీబీ చీఫ్ జనరల్ అబుల్ హాసన్ రోహింగ్య అక్రమ చొరబాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని.. వారికి సరిహద్దు గ్రామాల్లోని కొందరు సహకారం అందిస్తున్నారని తెలిపారు. అంతేకాక రోహింగ్యాల వల్ల ఉగ్రవాదపెనుముప్పు పొంచి ఉందని అన్నారు. దీనిపై స్పందించిన అబుల్ హాసన్.. ఈ విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉందని.. ఉగ్రవాదానికి బంగ్లా సహకారం అందించదని తెలిపారు. మయన్మార్, బంగ్లా సరిహద్దులో కంచె నిర్మాణం చేయాలనే ఆలోచనలో బంగ్లా ప్రభుత్వం ఉన్నట్లు ఆయన చెప్పారు. -
రోహింగ్యాలకు సపోర్ట్: వరుణ్‌పై కేంద్రం ఫైర్!
సాక్షి, న్యూఢిల్లీ : రోహింగ్యా శరణార్థులకు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీకి సొంత పార్టీ నుంచే ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అభిప్రాయాన్ని ఖండిస్తూ.. నరేంద్రమోదీ కేబినెట్‌కు చెందిన సీనియర్ మంత్రి హన్సరాజ్ అహిర్ సీరియస్‌గా స్పందించారు. రోహింగ్యా శరణార్థులను బహిష్కరించే విషయంలో బీజేపీ వైఖరిని తప్పుపడుతూ వరుణ్ గాంధీ 'నవ్‌భారత్ టైమ్స్'లో ఓ వ్యాసాన్ని రాశారు. మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలను శరణార్థులుగా పరిగణించాలని ఆయన ఈ వ్యాసంలో కోరారు. వరుణ్ గాంధీ వ్యాఖ్యలు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని హన్సరాజ్ స్పందించారు. రోహింగ్యాల విషయంలో కేంద్రప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్లడానికి వీలులేదంటూ వరుణ్ గాంధీని హెచ్చరించారు. రోహింగ్యా శరణార్థుల్లో కొంతమందిని పాకిస్తాన్ ఉగ్రవాద గ్రూప్‌లు ఎరవేస్తున్నాయని కొన్ని రోజుల క్రితమే కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. వీరు అక్రమ వలసదారులని, శరణార్థులు కారని పేర్కొంది. ఈ ముస్లింల వల్ల జాతీయ భద్రతకు పెనుముప్పు ముంచి ఉందని కేంద్ర హోం శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. అంతేకాక వీరు భారత్‌లో మతహింసను ప్రేరేపించే అవకాశముందని చెప్పింది. అయితే రోహింగ్యాలకు శరణార్థుల గుర్తింపు కల్పించాలంటూ, ప్రభుత్వ వైఖరికి భిన్నంగా వరుణ్ గాంధీ కేంద్రాన్ని కోరుతున్నారు. ఆయన రాసిన వ్యాసంలో రోహింగ్యా శరణార్థులు, విదేశీ పాలసీ, దేశీయ రాజకీయాలకు బాధితులని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరికి పూర్తిగా భిన్నంగా తన అభిప్రాయాలు వెల్లడించారు. అంతర్జాతీయ ఒప్పందాల్లో భారత్ కూడా సంతకం చేసిందని, శరణార్థులకు సాయం చేసే మంచి సంప్రదాయాన్ని మనం కలిగి ఉన్నామంటూ వివరించారు. ఆర్టికల్ 17 ప్రకారం మానవతావాదంతో దేశం ఎవరినీ బహిష్కరించడానికి వీలులేందంటూ పేర్కొన్నారు. కానీ దేశప్రయోజాలను దృష్టిలో పెట్టుకున్న వారెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరంటూ అహిర్ మండిపడ్డారు. రోహింగ్యాల విషయంలో కేంద్రప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరూ కూడా వెళ్లడానికి వీలులేదంటూ హెచ్చరించారు. అహిర్ స్పందనను గౌరవిస్తూ, మరో బీజేపీ నేత షైనా కూడా ప్రభుత్వం తన జాబ్ తాను చేస్తుందనంటూ.. ఈ సమస్యను మోదీ ప్రభుత్వం చాలా సమర్థవంతంగా పరిష్కరిస్తుందని, ఎవరైనా మానవతావాదాన్ని ఎత్తిచూపాలంటే, తొలుత సమస్యను అర్థం చేసుకోవాలని వరుణ్ గాంధీకి సూచించారు. -
రోహింగ్యాల అంశం.. సుప్రీంలో కేంద్రం అఫిడవిట్
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పదంగా మారిన రోహింగ్యా ముస్లిం శరణార్థుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. సోమవారం పలు అంశాలతో కూడిన నివేదికను బెంచ్‌కు సమర్పించింది. భారత్-మయన్మార్ సరిహద్దు గుండా అక్రమంగా సుమారు 40000 మందికి పైగానే దేశంలోకి చొరబడ్డారని తెలిపింది. దేశంలో పలు ప్రాంతాల్లో విస్తరించిన వీరు అసాంఘిక కార్యకలాపలకు పాల్పడుతున్నారని చెప్పింది. వీరిలో కొందరు పాకిస్థాన్‌కు చెందిన కొన్ని ఉగ్రవాద సంస్థలతో కలిసి పని చేస్తున్నారని, ఈ విషయాన్ని నిఘా వర్గాలు కూడా కనిపెట్టాయన్న విషయాన్ని బెంచ్ ముందు కేంద్రం ప్రస్తావించింది. ఇది ముమ్మాటికీ మనుషుల అక్రమ రవాణా కిందకే వస్తుందన్న కేంద్రం.. రోహింగ్యా శరణార్థులను ఇక్కడ కొనసాగించటం దేశ భద్రతకు పెను ముప్పేనని స్పష్టం చేసింది. ఈ వ్యవహరాన్ని తమకు వదిలేయాలని, చర్చలు.. విధాన నిర్ణయాల ద్వారా సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించింది. దీంతో ఈ కేసులో తదుపరి వాదనను కోర్టు అక్టోబర్ 3 కు వాయిదా వేసింది. -
బంగ్లాదేశ్‌కు భారత్ ఫుల్ సపోర్ట్!
ఢాకా: రోహింగ్యాల విషయంలో బంగ్లాదేశ్ వైఖరికి పూర్తిస్థాయిలో భారత ప్రభుత్వం మద్దతు ఇస్తోందని విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ పొరుగుదేశానికి భరోసా ఇచ్చారు. సుష్మాస్వరాజ్ బంగ్లా ప్రధాని షైక్ హసీనాతో ఫోన్లో మాట్లాడి ఈమేరకు మద్దతు తెలిపారని హసీనా డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ నజ్రుల్ ఇస్లాం మీడియాకు తెలిపారు. 'రోహింగ్యాల సమస్య బంగ్లాదేశ్‌కు మాత్రమే పరిమితమైన అంశం కాదు. ఇది ఇప్పుడు ప్రాంతీయ అంశం నుంచి అంతర్జాతీయ సమస్యగా మారింది' అని పేర్కొన్నారు. మయన్మార్ రఖైన్ రాష్ట్రంలో హింసాకాండ కొనసాగుతుండటంతో భారీగా వలసవస్తున్న రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో పెద్దసంఖ్యలో ఉన్న రోహింగ్యా శరణార్థులకు ఆహారం, ఆశ్రయం, వైద్యం, పారిశుభ్రత వంటి మౌలిక వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని రోహింగ్యాలకు మానవతా సహాయాన్ని అందించడంలో బంగ్లాకు అండగా ఉంటామని భారత్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.