Mob Attack: రోహింగ్యాలు వెళ్లిపోవాలని నిరసన | Indonesia Protesters Storm Over Refugee Shelter Demanding Deportation | Sakshi
Sakshi News home page

Indonesia: ఇక్కడి నుంచి వెళ్లిపోండని.. రెచ్చిపోయిన నిరసనకారులు

Published Thu, Dec 28 2023 10:34 AM | Last Updated on Thu, Dec 28 2023 10:48 AM

Indonesia Protesters Storm Over Refugee Shelter Demanding Deportation - Sakshi

మయన్మార్‌ దేశానికి చెందిన రోహింగ్యాలు తమ దేశం నుంచి వెళ్లిపోవాలంటూ ఇండోయనేషియాలోని నిరసనకారులు డిమాండ్‌ చేశారు. పెద్ద నిరసనకారుల మూక బాండా అచే సీటీలోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఉ‍న్న మయన్మార్‌ చెందని రోహింగ్యాలు వెళ్లిపోవాలని దాడులకు దిగారు. ఇండోనేషియా నుంచి రోహింగ్యాలు వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. రోహింగ్యాలు నివాసం ఉంటున్న చోటుకు పెద్ద సంఖ్యలో నిరసనకారులు దూసుకురావటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. గ్రీన్‌ కలర్‌ జాకెట్లు ధరించిన కొంతమంది నిరసనకారుల మూక ఓ కన్వెన్షన్‌ సెంటర్‌ బిల్డింగ్ సెల్లార్‌లో ఉంటున్న రోహింగ్యాలు వెళ్లిపోవాలంటూ బెదరింపులకు దిగారు. పెద్ద సంఖ్యలో నిరసనకారులు తమపై రావడంతో రోహింగ్యా మహిళలు, చిన్న పిల్లలు భయంతో రోధించారు.

నిరసనకారులు 137 మంది రోహింగ్యాలను బలవంతంగా రెండు ట్రక్కులపై ఎక్కించి, బాండా అచే నుంచి పరో ప్రదేశాని బలవంతంగా తరలించారు. రోహింగ్యాలు.. ఇండోనేషియాలో తీవ్రమైన వ్యతిరేతక, తిరస్కరణను ఎదుర్కొంటున్నారు. మయన్మార్‌ నుంచి పెద్ద సంఖ్యలో ఇండోనేషియాకు వస్తున్న రోహింగ్యాల పట్ల రోజురోజుకు ఇండోనేషియాలో వ్యతిరేకత పెరుగుతోంది. అందులో భాగంగానే బుధవారం నిరసనకారుల మూక రోహింగ్యాలపై దాడులకు తెగపడినట్లు తెలుస్తోంది.

యునైటెడ్‌ నేషన్స్‌ రేఫ్యూజీ ఏజెన్సీ ఈ ఘటనపై  స్పందించింది. ‘ఈ ఘటన చాలా విచారకరం. మయన్మార్‌ రోహింగ్యాల కుటుంబాలపై దాడికి దిగటం చాలా బాధకరం. అక్కడ అధిక సంఖ్యలు మహిళలు చిన్నపిల్లలు మాత్రమే ఉన్నారు’ అని పేర్కొంది. వారికి భద్రత కల్పించాలని ఇండోనేషియా ప్రభుత్వాన్ని కోరింది. ఇటీవల ఇండోనేషియాకు వస్తున్న మానవ అక్రమ రవాణాపై ఆ దేశ అధ్యక్షుడు జోకో విడోడో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సంస్థలు రోహింగ్యాలకు తాత్కాలిక వసతులు కల్పించాలని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement