పాక్ విదేశాంగ మంత్రి ఖ్వాజా మహ్మద్ అసిఫ్
దావోస్: కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ స్థాయిలో చర్చించాల్సిన అవసరం ఉందని పాక్ విదేశాంగ మంత్రి ఖ్వాజా మహ్మద్ అసిఫ్ దావోస్‌లో అన్నారు. ప్రస్తుత ప్రపంచంలోని వివిధ విభేదాలకు కశ్మీర్ వివాదం, రోహింగ్యాల అంశం కూడా కారణాలేనని ఆయన పేర్కొన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు పాకిస్తాన్ ప్రధాని షాహిద్ ఖాక్కన్ అబ్బాసీతోపాటు పలువురు మంత్రులు హాజరయ్యారు.
అసిఫ్ మాట్లాడుతూ ‘ప్రపంచం ముక్కలుగా విడిపోవడానికి కశ్మీర్ వివాదం, రోహింగ్యాల అంశం కూడా కారణమే’ అని అన్నారు. ఈ ఏడాది డబ్ల్యూఈఎఫ్ సమిట్ నినాదమైన ‘ముక్కలైన ప్రపంచంలో ఉమ్మడి భవిష్యత్తు నిర్మాణం’ను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇటు చైనా, అటు అమెరికాతో తమ ద్వైపాక్షిక బంధాలు ఎంతో దృఢంగా ఉన్నాయని పాక్ ప్రధాని షాహిద్ ఖాక్కన్ అబ్బాసీ అన్నారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్‌ఐ), చైనా–పాక్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ) తదితర ప్రాజెక్టులతో గత కొన్నేళ్లలో చైనాతో పాక్ బంధం మరింత బలపడిందని అబ్బాసీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment