ఢిల్లీ: రాష్ట్రంలో టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం బుధవారం అఫిడవిట్ దాఖలు చేసింది. కోవిడ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. కోవిడ్ నివారణ జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కోర్టు ఆదేశాలకనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.
వేర్వేరు రోజుల్లో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తామని, పరీక్ష గదిలో 15 నుంచి 18 మంది విద్యార్థులు ఉండేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. ప్రతి విద్యార్థికి 5 అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసుకుంటామని, భౌతిక దూరం, శానిటేషన్ తదితర అంశాలను కచ్చితంగా అమలు చేస్తామని అఫిడవిట్‌లో పేర్కొంది. విద్యార్థుల ఎంట్రీ, ఎగ్జిట్ వేర్వేరుగా ఉంటాయని అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రభుత్వం .. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహించాలనుకుంటున్నట్లు సుప్రీంకు స్పష్టం చేసింది. పరీక్షలు నిర్వహణకు కోర్టు అనుమతి ఇవ్వాలని అఫిడవిట్‌లో పేర్కొంది. కాగా ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై రేపు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. కాగా ఏపీలో టెన్త్, ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగిన సంగతి తెలిసిందే.
చదవండి: తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే పరీక్షలకు అనుమతి: సుప్రీంకోర్టు
Comments
Please login to add a commentAdd a comment